Ministry of Environment and Forests
-
చిరుత నవ్వింది!
చిరుతలు దుమ్ము రేపుతున్నాయి. దేశమంతటా యమా స్పీడుతో దూసుకెళ్తున్నాయి. గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా చిరుతల సంఖ్యలో 8 శాతం పెరుగుదల నమోదైంది. మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో వాటి సంఖ్య బాగా పెరిగింది. కాకపోతే తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో చిరుతలు తగ్గుతుండటం కాస్త కలవరపెట్టే అంశమేనని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరం చాలా ఉందని పేర్కొంది. 2018లో భారత్‌లో 12,852గా ఉన్న చిరుతపులుల సంఖ్య 2022 నాటికి 13,874కు పెరిగిందని కేంద్రం వెల్లడించింది. ‘భారత్‌లో చిరుతల స్థితిగతులు–2022’ పేరిట తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. చిరుతల సంఖ్యలో మధ్యప్రదేశ్ టాప్‌లో నిలిచింది. అక్కడ 3,907 చిరుతలున్నట్టు తేలింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (1,985), కర్ణాటక (1,879) నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా మాత్రం చిరుతల సంఖ్యలో గత నాలుగేళ్లలో తగ్గుదలే నమోదైంది. ఆవాస ప్రాంతాలతో పాటు ఆహార లభ్యత కూడా తగ్గిపోవడం, చిరుతల వేట విచ్చలవిడిగా పెరగడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. ‘‘ఫలితంగా చిరుతలు నివాస ప్రాంతాలపైకి వచి్చపడుతున్నాయి. దాంతో జనం వాటిని హతమారుస్తున్నారు. ఈ ధోరణి కొంతకాలంగా పెరుగుతుండటం ఆందోళనకరం’’ అని నివేదిక ఆవేదన వెలిబుచి్చంది. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా చిరుతల సంఖ్య కాస్తో కూస్తో స్థిరంగానే కొనసాగినట్టు తెలిపింది. మొత్తమ్మీద వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను మరింతగా పెంచాల్సిన అవసరాన్ని సర్వే వెలుగులోకి తెచి్చందని పేర్కొంది. వన్యప్రాణుల పట్ల భారతీయుల సహన ధోరణి ప్రపంచానికి ఆదర్శం కావాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వనీకుమార్ చౌబే అభిప్రాయపడ్డారు. సంఖ్య పెరిగినా... ► గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 1,022 చిరుతలు పెరిగాయి. ► మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 486 చిరుతలు పెరిగాయి. పలు ఇతర రాష్ట్రాల్లోనూ పెరుగుదల నమోదైంది. ► శాతాలపరంగా చూసుకుంటే ఏకంగా 282 శాతం పెరుగుదలతో అరుణాచల్‌ప్రదేశ్ టాప్‌లో నిలిచింది. ► కానీ తెలంగాణతో పాటు గోవా, బిహార్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఒడిశాల్లో చిరుతల సంఖ్య తగ్గింది. ► ఒడిశాలోనైతే ఏకంగా నాలుగో వంతు, అంటే 192 చిరుతలు తగ్గాయి. సర్వే ఇలా... ► దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల పరిధిలో 6.4 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల పరిధిలో సమగ్ర సర్వే జరిపారు. ► ఇందుకు ఏకంగా 6.4 లక్షల పనిదినాలు పట్టింది! దీన్ని ప్రపంచంలోకెల్లా అతి విస్తారమైన వణ్యప్రాణి సర్వేగా కేంద్రం అభివరి్ణంచింది. ► చిరుతలను గుర్తించేందుకు 32,803 వ్యూహాత్మక స్థానాల్లో కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు. ► అలా సమకూరిన 4 కోట్ల పై చిలుకు ఫొటోలను విశ్లేíÙంచారు. వాటిలో చిరుతలకు సంబంధించిన 85 వేల ఫొటోలను గుర్తించారు. ► తద్వారా చిరుతల మొత్తం సంఖ్యను 13,874గా నిర్ధారించారు ► అయితే సర్వేలో దేశంలోని చిరుతల ఆవాస ప్రాంతాల్లో 70 శాతాన్ని మాత్రమే కవర్ చేయగలిగినట్టు కేంద్రం పేర్కొంది. ► హిమాలయాలు, అటవేతర ఆవాసాలు, మెట్ట ప్రాంతాలను సర్వే పరిధి నుంచి మినహాయించారు. ► ఆ లెక్కన భారత్‌లో చిరుతల వాస్తవ సంఖ్య 13,874 కంటే ఇంకా ఎక్కువగా ఉంటుందని వివరించింది. విశేషాలు ఇవీ... మధ్య భారతంతో పాటు తూర్పు కనుమల్లో నాలుగేళ్లలో చిరుతలు 8,071 నుంచి 8,820కి పెరిగాయి. అంటే 1.5 శాతం పెరుగుదల నమోదైంది. పశి్చమ కనుమల్లో 3,387 నుంచి 3,596కు పెరిగాయి. ఈశాన్య కొండప్రాంతాలు, బ్రహ్మపుత్ర వరద మైదానాల్లోనూ అవి 141 నుంచి 349కి పెరిగాయి. 2018లో శివాలిక్ కొండలు, గంగా మైదాన ప్రాంతాల్లో మాత్రం చిరుతలు 1,253 నుంచి 1,109కి, అంటే 3.4 శాతం తగ్గాయి. అయితే, ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ అటవీ డివిజన్లో గత నాలుగేళ్లలో చిరుతలు తగ్గగా పులుల సంఖ్య మాత్రం అనూహ్యంగా పెరగడం విశేషం! – సాక్షి, నేషనల్‌డెస్క్ -
సచివాలయం కూల్చివేతపై కౌంటర్ ఇంకెప్పుడు వేస్తారు?: ఎన్జీటీ
సాక్షి, హైదరాబాద్: సరైన అనుమతుల్లేకుండా సచివాలయాన్ని కూల్చేయడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంవోఈఎఫ్) కౌంటర్ వేయకపోవడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘దాదాపు 50 శాతానికిపైగా కొత్త భవనాల నిర్మాణం పూర్తయినా ఇంకా కౌంటర్ దాఖలు చేయరా?’అని నిలదీసింది. డిసెంబర్ 17లోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. నిబంధనల మేరకు అనుమతులు తీసుకోకుండానే పాత సచివాలయాన్ని కూల్చేశారని, కొత్త నిర్మాణాలకు సరైన అనుమతులు లేవని రేవంత్ వేసిన పిటిషన్‌ను ఎన్జీటీ ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. కొత్త సచివాలయం నిర్మాణం కోసమే పాత సచివాలయాన్ని అనుమతుల్లేకుండా కూల్చివేశారని పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్ నివేదించారు. (చదవండి: కొత్త పంట గెర్కిన్.. లక్షల్లో ఆదాయం) -
టైగర్ జిందా హై..!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న పులుల గణన నివేదికను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో విడుదల చేశారు. పులులకు ప్రపంచంలోనే అత్యంత భద్రమైన నివాస స్థలంగా భారత్‌లోని అడవులు మారాయని ఆయన తెలిపారు. ప్రపంచ పులుల దినోత్సవమైన సోమవారమే మోదీ ‘అఖిల భారత పులుల సంఖ్య అంచనా–2018’ నివేదికను విడుదల చేస్తూ భారత్‌లో పులుల సంఖ్యను పెంచే ప్రక్రియలో పాలుపంచుకున్న వారందరినీ తాను ప్రశంసిస్తున్నానన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ), జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టీసీఏ) కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. నివేదికలో వెల్లడించిన అంశాల ప్రకారం 2006లో దేశంలో 1,411 పులులు మాత్రమే ఉండగా, వాటి సంఖ్య 2014కు 2,226కు, 2018కి 2,967కు పెరిగింది. పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించారు. మోదీ మాట్లాడుతూ ‘పులుల సంఖ్యను పెంచడంపై 9 ఏళ్ల క్రితం రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశం జరిగింది. 2022 నాటికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆ సమావేశంలో పాల్గొన్న దేశాలన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. గడువు పూర్తవ్వడానికి నాలుగేళ్ల ముందే భారత్‌లో పులుల సంఖ్యను మనం రెట్టింపు చేశాం. సంకల్పంతో మనం దేన్నయినా సాధించవచ్చు అనడానికి ఇదే ఉదాహరణ’ అని వెల్లడించారు. 2006 నాటి లెక్కలను 2018 లెక్కలతో పోల్చుతూ మోదీ ఈ విషయం చెప్పారు. అదే 2014 లెక్కలను 2018 గణాంకాలతో పోలిస్తే పులుల సంఖ్య నాలుగేళ్లలో 33 శాతం పెరిగింది. దాదాపు మూడు వేల పులులను కలిగిన ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే పులులకు అత్యంత భద్రమైన, పెద్ద నివాస స్థలంగా మారిందని మోదీ పేర్కొన్నారు. కాగా, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి, ఎం–స్ట్రైప్స్ అనే మొబైల్ యాప్ సాయంతో పులుల సంఖ్యను సులభంగా లెక్కించగలిగామని డబ్ల్యూఐఐలో పనిచేసే శాస్త్రవేత్త వైవీ.ఝాలా చెప్పారు. సమాచారాన్ని సేకరించడం సులభమైందిగానీ, దానిని విశ్లేషించడం కష్టంగా మారిందని ఆయన తెలిపారు. ‘ఎక్ థా టైగర్’ నుంచి... సల్మాన్ ఖాన్ నటించిన రెండు బాలీవుడ్ చిత్రాల పేర్లను మోదీ ప్రస్తావిస్తూ, పులుల సంఖ్య పెరుగుదలపై చమత్కారంగా మాట్లాడారు. భారత్‌లో పులుల సంరక్షణ ప్రక్రియ ‘ఎక్ థా టైగర్’ (గతంలో ఓ పులి ఉండేది)తో మొదలై, ఇప్పుడు ‘టైగర్ జిందా హై’ (పులి బతికే ఉంది) వరకు చేరుకుందని మోదీ వివరించారు. అయితే ఇది ఇక్కడితో ఆగకూడదనీ, పులుల సంరక్షణను మరింత వేగవంతం, విస్తృతం చేయాలని ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్యన ఆరోగ్యకరమైన సమతుల్యం తీసుకురావడం సాధ్యమేనని మోదీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మౌలిక వసతుల నిర్మాణంతోపాటు అడవుల విస్తీర్ణాన్ని కూడా పెంచగలిగిందని మోదీ తెలిపారు. 2014లో దేశంలో సంరక్షణ ప్రాంతాలు 692 ఉండగా, ప్రస్తుతం 860కి పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం జంతువుల కోసం కూడా మరిన్ని ఆవాసాలను ఏర్పాటు చేస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లో అధికం దేశంలోనే అత్యధిక సంఖ్యలో పులులు మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో 2014లో 308గా ఉన్న పులుల సంఖ్య 2018కి ఏకంగా 526కి పెరిగింది. అలాగే మహారాష్ట్రలోనూ 2014లో 190 పులులు ఉండగా, 2018లో 312 ఉన్నాయి. 2018 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 48 పులులు ఉన్నాయి. తెలంగాణలో గత నాలుగేళ్లలో పులుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే పెరిగింది. తెలంగాణలో ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో పులుల సంరక్షణ కేంద్రాలుండగా, ఈ రెండింటిలో కలిపి 2014లో 20 పులులు ఉండేవి. 2018 నాటికి ఆ సంఖ్య 26కు పెరిగింది. ఇవే కాకుండా, మరో ఆరు పులి పిల్లలు కూడా ఆమ్రాబాద్, కవ్వాల్‌ల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పులుల సంఖ్య దేశవ్యాప్తంగా పెరిగినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తగ్గింది. ఛత్తీస్‌గఢ్‌లో 2014లో 46 పులులు ఉండగా, 2018కి వాటి సంఖ్య 19కి పడిపోయింది. -
అరబిందో విస్తరణకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: అరబిందో ఫార్మా విస్తరణ ప్రణాళికకు పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో రూ.250 కోట్ల మూలధన వ్యయంతో ఏర్పాటుచేయనున్న ఉత్పత్తి కేంద్రానికి సోమవారం గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ కేంద్రంలో ప్రస్తుతం 583.31 టీపీఎం (ఒక నెల్లో ఉత్పత్తి అయ్యే మొత్తం టన్నులు) భారీ ఔషధాలు, ఇంటర్మీడియట్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా.. విస్తరణ అనంతరం ఇది 1,518.3 టీపీఎంకు చేరుతుందని వివరించింది. ఈ యూనిట్లో 8.85 మెగావాట్ల క్యాపిటివ్ పవర్ ప్లాంటును సైతం నెలకొల్పనుంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ చర్యల కోసం రూ.32.77 కోట్లుగా అంచనావేసింది. ప్రాజెక్ట్ ద్వారా 600 మందికి ప్రత్యక్షంగానూ, 120 మందికి పరోక్షంగానూ ఉపాధి లభించనున్నట్లు వెల్లడించింది. -
జహీరాబాద్ నిమ్జ్‌కు ‘పచ్చ’ జెండా!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక జహీరాబాద్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ప్రాజెక్టు నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఈ మెగా పారిశ్రామికవాడ నిర్మాణంలో అనుసరించాల్సిన నియమ నిబంధనల (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్)కు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) ఆమోదం తెలిపింది. తొలి దశ పర్యావరణ అనుమతులుగా భావించే ‘టీఓఆర్’కు ఆమోదం లభించడంతో.. తుది అనుమతులు కోరేందుకు మార్గం సుగమమమైంది. నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం బహిరంగ విచారణ జరిపి తుది దశ అనుమతుల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోనుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, ఝరాసంఘం మండలాల్లో 12,635 ఎకరాల భారీ విస్తీర్ణంలో నిమ్జ్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.44 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రూ.37,740 కోట్ల పెట్టుబడులతో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఈ పారిశ్రామికవాడలో ఏర్పాటవనున్నాయి. 2040 సంవత్సరం నాటికి రూ.96,778 కోట్లు విలువ చేసే ఉత్పత్తులు జరగనున్నాయి. 2030 నాటికి పూర్తి.. నిమ్జ్ నిర్మాణానికి రూ.4,500 కోట్ల అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. సైట్ అభివృద్ధి, అంతర్గత రోడ్లు, నీరు, విద్యుత్ సరఫరా, వరద, మురుగు నీటి కాల్వలు, భవనాలు, వీధి దీపాలు, పచ్చదనం అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ప్రాజెక్టుకు వెలుపల మౌలిక సదుపాయాల కోసం మరో రూ.6,100 కోట్ల వ్యయం కానుంది. 2020 నాటికి ప్రాజెక్టు తొలి దశ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, 2030 నాటికి మొత్తం పూర్తవుతుందని ప్రభుత్వం పేర్కొంటోంది. నిమ్జ్ పరిధిలో 17 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. 12,635 ఎకరాలకు గాను 2,884 ఎకరాలు టీఎస్ఐఐసీ ఇప్పటికే సేకరించింది. హైదరాబాద్ నుంచి 65 కి.మీ. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు ఆకర్షించేందుకు నిమ్జ్ ప్రతిపాదిత ప్రాంతం అనుకూలమని ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టు సమీపంలో ఇప్పటికే మహీంద్ర, ఎంఆర్ఎఫ్ టైర్స్, అరబిందో ఫార్మా, స్పార్శ్ ఫార్మా, కావేరీ ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్, ఆర్డాన్స్ ఫ్యాక్టరీ మెదక్, భారత్ డైనమిక్స్(బీడీఎల్), ట్రైడెంట్ షుగర్స్ లాంటి మెగా పరిశ్రమలున్నాయంది. హైదరాబాద్ నుంచి 65 కి.మీ., ఓఆర్ఆర్ నుంచి 50 కి.మీ, దూరంలోని ఈ ప్రాజెక్టుకు రహదారులు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్, సీ పోర్టు (కృష్ణపట్నం, జవహర్లాల్ పోర్ట్ ట్రస్ట్) సదుపాయాలతో పాటు నీరు, విద్యుత్ సదుపాయాలున్నాయని పేర్కొంది. కాగా, నిమ్జ్‌లో ప్రధానంగా ఎలక్ట్రిక్ పరికరాలు, ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ రంగాల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. జోన్ల వారీగా ప్రాజెక్టు అభివృద్ధి ఇలా.. జోన్ స్థలం (ఎకరాల్లో) ఉత్పత్తి పరిశ్రమలు 7,107 సాంకేతిక సదుపాయాలు 550 మౌలిక వసతులు 883 గృహ నిర్మాణం 638 లాజిస్టిక్స్ 899 పచ్చదనం 1,603 రహదారులు 955 మొత్తం 12,635 నోట్: కామన్ ఫోల్డర్లో నీమ్జ్ జహీరాబాద్ పేరుతో ప్రాజెక్టు సైట్ మ్యాప్ ఫోటోలు ఉన్నాయి. పరిశీలించగలరు. 12,635 - ఎకరాల్లో మెగా పారిశ్రామిక వాడ నిర్మాణం 4,500 - కోట్లు అంచనా వ్యయం 6,100- కోట్లు ప్రాజెక్టు వెలుపల మౌలిక వసతులకు.. 2,40,000- మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి -
‘భద్రాద్రి’కి పర్యావరణ వివాదం
పర్యావరణ అనుమతి లేకుండానే థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనులు చేపట్టడంపై కేంద్రం సీరియస్ తమ శాస్త్రవేత్తతో తనిఖీ జరిపించిన కేంద్ర పర్యావరణ శాఖ ప్రాజెక్టు స్థలంలో పరిశీలన.. నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిర్ధారణ చాలా వరకు పనులు ప్రారంభమయ్యాయని వెల్లడి ప్లాంట్ నిర్మాణ స్థలానికి సమీపంలో చెరువు ఉందని గుర్తింపు జెన్కోపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి నివేదిక’ సాక్షి, హైదరాబాద్: జెన్కో చేపట్టిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పర్యావరణ అనుమతుల వివాదంలో చిక్కుకుంది. పర్యావరణ అనుమతి లేకుండానే చకచకా ప్రాజెక్టు పనులు నిర్వహిస్తుండడంపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సీరియస్ అయింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలతో ఆ శాఖ శాస్త్రవేత్త పి.కరుపయ్య గత నెల 9వ తేదీన ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో తనిఖీ జరిపి నివేదిక సమర్పించారు. పర్యావరణ అనుమతి లేకుండా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారని, నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ధ్రువీకరించారు. దీనికి సంబంధించి జెన్కోపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. కాలం చెల్లిన టెక్నాలజీతో.. ఖమ్మం జిల్లా మణుగూరు, పినపాక మండలాల్లోని రామానుజవరం, ఎద్దులబయ్యారం, సీతారామపురం గ్రామాల పరిధిలో 1,080 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని జెన్కో చేపట్టింది. సబ్ క్రిటికల్ బాయిలర్ సాంకేతికతతో 270 మెగావాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లను నిర్మిస్తోంది. అయితే కాలం చెల్లిన సబ్ క్రిటికల్ బాయిలర్ టెక్నాలజీతో కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదని కేంద్ర విద్యుత్ శాఖ గతంలోనే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భద్రాద్రి థర్మల్ ప్లాంట్‌ను ఆధునిక సూపర్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మించాలని జెన్కోకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సూచించింది. లేకుంటే కేంద్ర విద్యుత్ శాఖ నుంచి ప్రత్యేక అనుమతి పొందాలనే షరతు విధిస్తూ... గత జూన్ 23న ఈ ప్రాజెక్టు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్(టీవోఆర్)ను ఆమోదించింది. ఇంకా పర్యావరణ అనుమతి జారీ చేయలేదు కూడా. అయినప్పటికీ జెన్కో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించడంతో... ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ తమ శాస్త్రవేత్తతో తనిఖీ జరిపించింది. ఆయన ప్రాజెక్టు స్థలంలో పరిశీలన జరిపి కేంద్రానికి నివేదిక సమర్పించారు. నివేదికలో పేర్కొన్న పలు అంశాలు.. - గతేడాది అక్టోబర్ నుంచే భదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనులను ప్రాజెక్టు యాజమాన్యం ప్రారంభించింది. - తనిఖీ నిర్వహించిన సమయంలో ప్రాజెక్టు స్థలంలో కార్మికులు ఎక్కువ సంఖ్యలో కనిపించలేదు. కొంత మంది మాత్రం ప్రాజెక్టు సైట్‌తో పాటు యంత్ర సామగ్రి నిల్వ ఉంచే గోదాంలో కనిపించారు. అన్ని రకాల భారీ యంత్రాలు, వాహనాలు, వస్తు సామగ్రిని ప్రాజెక్టు స్థలం వద్ద నిల్వ ఉంచారు. - మెయిన్ పవర్ హౌస్‌తో పాటు టౌన్‌షిప్‌కు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మెయిన్ పవర్ హౌస్ వద్ద అంతర్గత రోడ్లు, సబ్‌స్టేషన్ వద్ద సివిల్ పనులు, సైట్ ఆఫీస్ నిర్మాణం, ఫౌండేషన్ పనులు, బాయిలర్ హౌస్, చిమ్నీ, స్విచ్‌యార్డు పనులు చకచకా జరుగుతున్నాయి. - ప్రాజెక్టు స్విచ్‌యార్డు ఏరియాకు వెనుక భాగంలో మణుగూరు-ఏటూరునాగారం రోడ్డుకు సమాంతరంగా ఓ చెరువు గుర్తించాం. ఈ చెరువుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను గానీ, ఈ చెరువు భూముల వినియోగంపై కానీ ప్రాజెక్టు యాజమాన్యం ఎలాంటి సమాచారాన్ని తనిఖీ సమయంలో ఇవ్వలేకపోయింది. సమీప వ్యవసాయ భూమి నుంచి వస్తున్న నీటి ప్రవాహమే ఇదని ప్రాజెక్టు యాజమాన్యం చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు. చెరువుతో పోల్చితే వ్యవసాయ భూములు లోతైన ప్రాంతంలో ఉన్నాయి, ఆ భూములు, చెరువుకు మధ్య మణుగూరు-ఏటూరునాగారం రోడ్డు అడ్డుగా ఉంది. ఈ అంశాన్ని కేంద్ర పర్యవరణ శాఖ పరిశీలించాలి. - ప్రాజెక్టుకు కావాల్సిన బొగ్గు, నీటి కేటాయింపులు ఇంకా జరగలేదు. -
వన్యమృగ దాడి.. నష్ట పరిహారం రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: వన్యమృగాల దాడిలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే నష్ట పరిహారాన్ని అటవీ పర్యావరణ శాఖ రెట్టింపు చేసింది. ప్రస్తుతం వన్యమృగాల దాడిలో ఎవరైనా చనిపోతే వారి వారసులకు ప్రభుత్వం రూ. 2.50 లక్షలు నష్ట పరిహారం కింద చెల్లిస్తోంది. దీనిని రూ. 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అడవి జంతువుల దాడిలో గాయపడిన వారికి ప్రస్తుతం రూ. 75 వేలు పరిహారం ఇస్తుండగా ఇక నుంచి మొత్తం వైద్య ఖర్చులతోపాటు రూ. 75 వేలు పరిహారం ఇవ్వాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ప్రతి పంచాయతీలో దేశీ విత్తన నిధి!
దేశవాళీ వంగడాల పరిరక్షణ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి ప్రతి పంచాయతీలోనూ ఒక విత్తన నిధిని ఏర్పాటు చేస్తోంది. కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థకు అనుబంధంగా ఈ మండలి పనిచేస్తోంది. మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా మండలి అధ్యక్షుడు డా. ఆర్. హంపయ్య ‘సాక్షి’కి చెప్పిన అంశాలివి. వ్యవసాయ జీవవైవిధ్య పరిరక్షణకు మండలి చేస్తున్న కృషి ఏమిటి? కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయంలో రసాయనిక ఎరు వులు, పురుగుమందులను విపరీతంగా వాడడం వల్ల జీవవైవిధ్యం నాశనమైంది. రసాయనిక వ్యవసాయం వల్ల జీవరాశికి తీరని నష్టం జరిగింది. వానపాములు నశించి భూసారం తగ్గింది. రసాయనాలకు స్పందించే హైబ్రిడ్ విత్తనాల రాకతో దేశవాళీ విత్తనాలు అంతరిం చిపోయే పరిస్థితి నెలకొంది. మన వ్యవసాయక జీవవై విధ్యం అమూల్యమైనది. దీన్ని పరిరక్షించుకోవాలి. ఇందుకోసం దేశవాళీ విత్తన నిధుల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం.. విత్తన నిధులను ఏ స్థాయిలో ఏర్పాటు చేస్తారు..? పంచాయతీ స్థాయిలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీ (బీఎంసీ)లను ఏర్పాటు చేస్తున్నాం. సర్పంచ్ సారథ్యం లో ఏడుగురు సభ్యులతో బీఎంసీని ఏర్పాటు చేస్తున్నాం. స్థానికంగా అందుబాటులో ఉన్న నిపుణులు, మేధావు లతో ఏర్పాటయ్యే కమిటీ తోడ్పాటుతో బీఎంసీ ఆ పంచాయతీ గ్రామాల్లో ఉన్న పంటలు, పశువులు, ఔష ధ మొక్కలు, మత్స్యజాతులు, పక్షులు.. తదితర వివరా లను నమోదు చేస్తారు. పంచాయతీ పరిధిలోని జీవవైవి ధ్యాన్ని పరిరక్షించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత బీఎంసీకి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న దేశవాళీ విత్తనాలను సేకరించి విత్తన నిధులను ఏర్పాటు చేయించబో తున్నాం. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోని విత్తన నిధులపై అధ్యయనం కూడా పూర్తయింది. విత్తన నిధి నిర్వహ ణపై బీఎంసీల సభ్యులకు శిక్షణ ఇస్తాం. కొంత మేరకు ఆర్థిక సాయం కూడా అందిస్తాం. రైతులకు దేశవాళీ విత్తనాలు ఇస్తారా? అవును. హైబ్రిడ్ విత్తనాల ద్వారా ఆహారోత్పత్తుల దిగు బడి పెరిగినా రుచి, పోషక విలువలు తగ్గిపోయాయి. దేశవాళీ వంగడాలలో పోషక విలువలు ఎక్కువ. విని యోగదారులకు ఈ విత్తనాలతో పండించిన ఆహారమే ఆరోగ్యదాయకం. దేశవాళీ ధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలతోపాటు పూల విత్తనాలను సైతం సేకరిం చి విత్తన నిధులలో భద్రపరుస్తాం. వీటిని స్థానిక రైతు లకు ఇవ్వడం.. తీసుకున్న విత్తనంతో పంటలు సాగు చేసిన తర్వాత తీసుకున్న విత్తనానికి రెట్టింపు విత్తనాన్ని రైతులు విత్తన నిధికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. సేంద్రియ వ్యవసాయాన్ని ఎలా ప్రోత్సహిస్తారు..? రసాయనాలు వాడకుండా తక్కువ ఖర్చుతో చాలా మంది రైతులు ఇప్పటికే సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ పద్ధతులను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నిస్సారమైన భూములను తిరిగి సజీవంగా మార్చుకోవడం మానవ మనుగడకు అత్యవసరం. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారానే ఇది సాధ్యం. బీఎంసీల ఏర్పాటు మందకొడిగా సాగుతోంది కదా? ఉమ్మడి రాష్ట్రంలో 28 వేల గ్రామాలున్నా దాదాపు వెయ్యి వరకు బీఎంసీలు ఏర్పాటయ్యాయి. మిగతా పంచాయతీల్లో పనిని వేగవంతం చేయడానికి రాష్ట్ర జీవవైవిధ్య మండలి తరఫున రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలోనూ సమన్వయకర్తలను నియమించాం. చెట్లు, పక్షులు, అడవులు, విత్తనాలు, పశు సంపద వివరాలన్నిటినీ బీఎంసీ నమోదు చేసి, పరిరక్షిస్తుంది. మండలికి నిధులు ఎలా సమకూరతాయి..? మన రాష్ట్రం వేలంలో విక్రయించనున్న ఎర్రచందనం విలువలో 5% డబ్బును జీవవైవిధ్య అభివృద్ధి నిధికి వస్తుంది. ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, వడ్డీ మొత్తాన్ని జీవవైవిధ్య పరిరక్షణకు వెచ్చిస్తాం. అడవు లకు వెలుపల కూడా కొందరు రైతులు కొద్దోగొప్పో ఎర్రచందనం మొక్కలు పెంచుతున్నారు. వీరి వద్ద 500 టన్నుల ఎర్రచందనం చెట్లు నరికి ఎగుమతి చేయడా నికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని ద్వారా కూడా నిధులు సమకూరతాయి. వివరాలకు: డా. ఆర్. హంపయ్య (98494 27981), అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి, 6వ అంతస్తు, చంద్రవిహార్ కాంప్లెక్స్, ఎం.జె.రోడ్డు, నాంపల్లి, హైదరా బాద్ - 500001. ఫోన్: 040-24602869 - ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్ -
'సింహాలను తరలిస్తాం, ఏడు కోట్లు ఇవ్వండి'
ఆసియా ఖండానికి చెందిన జాతి సింహాలను తరలించేందుకు ఏడు కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కోరింది. గుజరాత్ నుంచి మధ్య ప్రదేశ్ లో గ్వాలియర్ డివిజన్ లోని షియోపూర్ జిల్లాలోని పాల్పర్ కునో వన్యప్రాణ సంరక్షణ కేంద్రానికి తరలించాలని ఏప్రిల్ 15 తేదిన సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. జాతి సింహాలు అంతరించే ప్రమాదం ఉందనే భయాందోళనలు తలెత్తడంతో వేరే ప్రాంతానికి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ కు సింహాలను తరలించాలని సుప్రీం కోర్టు తీసుకున్న తుది నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర పర్యావరణ, అడవుల శాఖ ఆదేశాల్ని జారీ చేసింది. సింహాల తరలింపుకు సుప్రీం ఆరునెలల గడువు విధించిందని, అయితే ఈ కార్యక్రమం చాలా రిస్క్ తో కూడిన పని అని.. ఆరునెలల గడువు చాలా తక్కువ అని..గడువు పొడిగించాలని పర్యావరణ శాఖను అధికారులు కోరారు. ఇప్పటికే నాలుగు నెలల కాలం ముగిసిందని.. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. సింహాల సంరక్షణతోపాటు మౌళిక సదుపాయాలు, ఇతర పనుల కోసం ఏడు కోట్ల 37 లక్షల రూపాయలను కేంద్రాన్ని కోరామని అధికారులు తెలిపారు. సింహాల తరలింపు కార్యక్రమం కోసం సంబంధింత కేంద్ర మంత్రిత్వ శాఖకు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి లేఖ రాయనున్నట్టు అధికారి తెలిపారు. పులుల సంరక్షణ కేంద్రంలో టూరిజంను ఆపివేయాలని పర్యావరణ కార్యకర్త ఒకరు ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.