ప్రతి పంచాయతీలో దేశీ విత్తన నిధి! | Domestic seed fund for each project! | Sakshi
Sakshi News home page

ప్రతి పంచాయతీలో దేశీ విత్తన నిధి!

Published Fri, May 2 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

ప్రతి పంచాయతీలో దేశీ విత్తన నిధి!

ప్రతి పంచాయతీలో దేశీ విత్తన నిధి!

దేశవాళీ వంగడాల పరిరక్షణ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి ప్రతి పంచాయతీలోనూ ఒక విత్తన నిధిని ఏర్పాటు చేస్తోంది. కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థకు అనుబంధంగా ఈ మండలి పనిచేస్తోంది. మే  22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా మండలి అధ్యక్షుడు డా. ఆర్. హంపయ్య ‘సాక్షి’కి చెప్పిన అంశాలివి.
 
 వ్యవసాయ జీవవైవిధ్య పరిరక్షణకు మండలి చేస్తున్న కృషి ఏమిటి?
 కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయంలో రసాయనిక ఎరు వులు, పురుగుమందులను విపరీతంగా వాడడం వల్ల జీవవైవిధ్యం నాశనమైంది. రసాయనిక వ్యవసాయం వల్ల జీవరాశికి తీరని నష్టం జరిగింది. వానపాములు నశించి భూసారం తగ్గింది. రసాయనాలకు స్పందించే హైబ్రిడ్ విత్తనాల రాకతో దేశవాళీ విత్తనాలు అంతరిం చిపోయే పరిస్థితి నెలకొంది. మన వ్యవసాయక జీవవై విధ్యం అమూల్యమైనది. దీన్ని పరిరక్షించుకోవాలి. ఇందుకోసం దేశవాళీ విత్తన నిధుల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం..
 
  విత్తన నిధులను ఏ స్థాయిలో ఏర్పాటు చేస్తారు..?
 పంచాయతీ స్థాయిలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీ (బీఎంసీ)లను ఏర్పాటు చేస్తున్నాం. సర్పంచ్ సారథ్యం లో ఏడుగురు సభ్యులతో బీఎంసీని ఏర్పాటు చేస్తున్నాం. స్థానికంగా అందుబాటులో ఉన్న నిపుణులు, మేధావు లతో ఏర్పాటయ్యే కమిటీ తోడ్పాటుతో బీఎంసీ ఆ పంచాయతీ గ్రామాల్లో ఉన్న పంటలు, పశువులు, ఔష ధ మొక్కలు, మత్స్యజాతులు, పక్షులు.. తదితర వివరా లను నమోదు చేస్తారు. పంచాయతీ పరిధిలోని జీవవైవి ధ్యాన్ని పరిరక్షించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత బీఎంసీకి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న దేశవాళీ విత్తనాలను సేకరించి విత్తన నిధులను ఏర్పాటు చేయించబో తున్నాం. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లోని విత్తన నిధులపై అధ్యయనం కూడా పూర్తయింది. విత్తన నిధి నిర్వహ ణపై బీఎంసీల సభ్యులకు శిక్షణ ఇస్తాం. కొంత మేరకు ఆర్థిక సాయం కూడా అందిస్తాం.
 
  రైతులకు దేశవాళీ విత్తనాలు ఇస్తారా?
 అవును. హైబ్రిడ్ విత్తనాల ద్వారా ఆహారోత్పత్తుల దిగు బడి పెరిగినా రుచి, పోషక విలువలు తగ్గిపోయాయి. దేశవాళీ వంగడాలలో పోషక విలువలు ఎక్కువ. విని యోగదారులకు ఈ విత్తనాలతో పండించిన ఆహారమే ఆరోగ్యదాయకం. దేశవాళీ ధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలతోపాటు పూల విత్తనాలను సైతం సేకరిం చి విత్తన నిధులలో భద్రపరుస్తాం. వీటిని స్థానిక రైతు లకు ఇవ్వడం.. తీసుకున్న విత్తనంతో పంటలు సాగు చేసిన తర్వాత తీసుకున్న విత్తనానికి రెట్టింపు విత్తనాన్ని రైతులు విత్తన నిధికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
 
  సేంద్రియ వ్యవసాయాన్ని ఎలా ప్రోత్సహిస్తారు..?
 రసాయనాలు వాడకుండా తక్కువ ఖర్చుతో చాలా మంది రైతులు ఇప్పటికే సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ పద్ధతులను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నిస్సారమైన భూములను తిరిగి సజీవంగా మార్చుకోవడం మానవ మనుగడకు అత్యవసరం. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారానే ఇది సాధ్యం.
 
  బీఎంసీల ఏర్పాటు మందకొడిగా సాగుతోంది కదా?
 ఉమ్మడి రాష్ట్రంలో 28 వేల గ్రామాలున్నా దాదాపు వెయ్యి వరకు బీఎంసీలు ఏర్పాటయ్యాయి. మిగతా పంచాయతీల్లో పనిని వేగవంతం చేయడానికి రాష్ట్ర జీవవైవిధ్య మండలి తరఫున రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలోనూ సమన్వయకర్తలను నియమించాం. చెట్లు, పక్షులు, అడవులు, విత్తనాలు, పశు సంపద వివరాలన్నిటినీ బీఎంసీ నమోదు చేసి, పరిరక్షిస్తుంది.  
 
  మండలికి నిధులు ఎలా సమకూరతాయి..?

 మన రాష్ట్రం వేలంలో విక్రయించనున్న ఎర్రచందనం విలువలో 5% డబ్బును జీవవైవిధ్య అభివృద్ధి నిధికి వస్తుంది. ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసి, వడ్డీ మొత్తాన్ని జీవవైవిధ్య పరిరక్షణకు వెచ్చిస్తాం. అడవు లకు వెలుపల కూడా కొందరు రైతులు కొద్దోగొప్పో ఎర్రచందనం మొక్కలు పెంచుతున్నారు. వీరి వద్ద 500 టన్నుల ఎర్రచందనం చెట్లు నరికి ఎగుమతి చేయడా నికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని ద్వారా కూడా నిధులు సమకూరతాయి.
 
 వివరాలకు: డా. ఆర్. హంపయ్య (98494 27981), అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి, 6వ అంతస్తు, చంద్రవిహార్ కాంప్లెక్స్, ఎం.జె.రోడ్డు, నాంపల్లి, హైదరా బాద్ - 500001. ఫోన్: 040-24602869
 - ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, ‘సాగుబడి’ డెస్క్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement