సాక్షి, హైదరాబాద్: పగటి వేళల్లో మాత్రమే పరుగులు పెడుతున్న డబుల్ డెక్కర్ రైలును రాత్రివేళ నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేకు మంజూరైన రెండు సర్వీసులు ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాచిగూడ- తిరుపతి డబుల్ డెక్కర్ రైలు ఆక్యుపెన్సీ రేటు సగటున 36 శాతం, కాచిగూడ-విజయవాడ సర్వీసుకు 38 శాతం మాత్రమే.
ఇవి పగటివేళ తిరుగుతుండడం, కేవలం కూర్చునే వీలు మాత్రమే ఉండడంతో చాలామంది ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైళ్లల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ సర్వీసులను రాత్రి వేళల్లో నడిపితే ఎలా ఉంటుందన్న విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం దృష్టికి తీసుకొచ్చారు. తొలుత ప్రయోగాత్మకంగా పరిశీలించి చూసేందుకు ఆయన ఒప్పుకొన్నట్లు సమాచారం.
రాత్రి వేళల్లో ‘డబుల్ డెక్కర్’?
Published Fri, Jun 12 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement
Advertisement