డ్యూయల్ డిగ్రీ కోర్సులు కొనసాగింపు | dual degree courses extended, says ranjeev r aacharya | Sakshi
Sakshi News home page

డ్యూయల్ డిగ్రీ కోర్సులు కొనసాగింపు

Published Wed, Aug 26 2015 4:45 AM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

dual degree courses extended, says ranjeev r aacharya

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో 2013లో ప్రవేశపెట్టిన డ్యూయల్ డిగ్రీ, ల్యాటరల్ ఎంట్రీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో జారీ చేశారు. మేనేజ్‌మెంట్‌లో 5 ఏళ్ల డ్యూయల్ డిగ్రీ, ఐదున్నరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఇంజనీరింగ్-మేనేజ్‌మెంట్, ఫార్మసీ-మేనేజ్‌మెంట్), ఆరున్నరేళ్ల ఆర్కిటెక్చర్ మేనేజ్‌మెంట్ కోర్సులు, రెండేళ్ల ఎంసీఏ, ఎంసీఏలో ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ, మూడేళ్ల ఇంజనీరింగ్ టెక్నాలజీ, బీసీఏ, బీఎస్సీ (ఐటీ/సీఎస్) విద్యార్థులు ఎంసీఏ ద్వితీయ సంవత్సరంలో చేరే తదితర కోర్సులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement