dual degree
-
భారతీయ విద్యార్ధుల్లో... అమెరికా క్రేజ్ తగ్గింది!
ఉన్నత విద్యార్జనకు సంబంధించి ప్రస్తుతం బారతీయ విద్యార్ధుల్లో అమెరికాపై ఉన్న అధిక ఆసక్తి తగ్గుముఖం పట్టిందని ప్రముఖ యుకె వర్సిటీ అసెక్స్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల విదేశీ విద్యావకాశాలు మరింతగా భారతీయులకు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్‌లో ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన యుకెలోని ప్రతిష్ఠాత్మక ఎసెక్స్ వర్సిటీ హైదరాబాద్‌కు చెంది ఉస్మానియా విశ్వవిద్యాలయంతో తొలి భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ నేపధ్యంలో నగరానికి వచ్చిన ఎసెక్స్ కమ్యూనికేషన్స్ అండ్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ వెనెస్సా పోట్టెర్, భారతీయ ప్రతినిధి సందీప్ శర్మ, లు ‘సాక్షి’తో ముచ్చటించారు. వారు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే... అరవైఏళ్ల...వర్సిటీ మాది... యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మక వర్సిటీ మా ఎసెక్స్. దీనిని 1964లో తొలి ఏడాది 122 మంది విద్యార్ధులతో ప్రారంభించగా ఇప్పుడు 17వేల మందికి చేరింది. యూనివర్సిటీ 3 క్యాంపస్‌లను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలకు చెందిన విద్యార్ధులు చదువుతున్నారు. పూర్వ విద్యార్ధుల అలుమ్ని సంఖ్య దాదాపుగా 1లక్షకుపైనే ఉంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యకేషన్ అవార్డ్స్‌లో యూనివర్సిటి ఆఫ్ ద ఇయర్‌గా, అలాగే రిసెర్చ్ క్వాలిటీ పరంగా టాప్ 25లోనూ ఉంది. 2వేల మంది భారతీయ విద్యార్ధులే లక్ష్యం... అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న సమయంలో, మా పబ్లిక్ రీసెర్చ్ విశ్వవిద్యాలయం ఒక దశాబ్దానికి పైగా భారత్‌లో కార్యాలయాన్ని కలిగి ఉంది. అలాగే పరిశోధనా రంగంలో మా విజయాలే పునాదిగా 2022–2023 విద్యా సంవత్సరంలో మేం 2,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే విధంగా మేం అందించే స్కాలర్‌షిప్‌ల శ్రేణి కూడా అత్యంత ఆకర్షణీయమైన అంశం. కంప్యూటర్‌సైన్స్, బిజినెస్ ఇంజనీరింగ్ కోర్సుకి ఇండియా నుంచి బాగా డిమాండ్ ఉంది. ఈ ఏడాది ఇక్కడ నుంచి 2వేల మంది విద్యార్ధుల్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఏ యూనివర్సిటీలో అయినా స్కాలర్షిప్స్ కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎసెక్స్‌లో అర్హతను బట్టి వర్సిటీ నుంచి అది మంజూరైపోతుంది. జాతీయ విద్యా విధానంతో మేలు... జాతీయ విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నాము ఇది ఒక ముఖ్యమైన ముందడుగు. జాతీయ విద్యా విధానం అంతర్జాతీయ విద్యావకాశాలను మరింత విస్త్రుతం చేస్తుంది. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు, ముఖ్యంగా భారతదేశంలో పదేళ్లుగా ఉనికిని కలిగి ఉన్న ఎసెక్స్కు బాగా ప్రయోజనకరం. ఈ విద్యా విధానం భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతిస్తుంది. ఇందుకు అనుగుణంగా మేం ఇప్పటికే గుజరాత్‌లోని సంస్థలతో మాట్లాడుతున్నాము. కోవిడ్.. మాకు ట్రాన్స్‌నేషనల్ ఎడ్యుకేషన్ ఏర్పాట్ల పరంగా సృజనాత్మక అవకాశాలను అందించింది. . ఉస్మానియా...మా తొలి భాగస్వామి... ఇండియాలో ఇప్పటికి 19 భాగస్వాములను ఏర్పరచుకున్నాం. తెలంగాణలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీతో తొలి ఒప్పందం కలిగి ఉన్నాం. మరిన్ని కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ తరహా భాగస్వామ్యాల్లో బాగా అనుభవం ఉన్నవి కొన్నే కాబట్టి భాగస్వామ్యాలలు నెలకొల్పడానికి ఎక్కువ సమయం పడుతుందని అనుకుంటున్నాం. మా భాగస్వాముల కోసం విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉమ్మడి పీహెచ్డీ పర్యవేక్షణ, ఉమ్మడి బోధన మరెన్నో రకాల భాగస్వామ్యాల పోర్ట్‌ఫోలియో మా స్వంతం. ఇక సృజనాత్మక కార్యక్రమాల జాబితాకు అంతేలేదు. చాలా వరకూ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు భాగస్వాముల ప్రయోజనాల గురించి ఆలోచన లేకుండా తెలివైన విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. కానీ మేం పరస్పర ప్రయోజనాలను కోరుకుంటున్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మేలు కలిగించే భాగస్వామ్యాలను కోరుకుంటున్నాము. హైదరాబాద్ మాకు చాలా ముఖ్యమైన నగరం... చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన భాగస్వామిగా హైదరాబాద్‌ను పరిగణిస్తాం. సంప్రదాయంగా చూస్తే హైదరాబాద్ నగరం నుంచి అమెరికాకు ఎక్కువ దరఖాస్తులు వెళతాయి. అయితే గత మూడేళ్లుగా ఇది మారింది. ఇటీవల ఆ క్రేజ్ యుఎస్ నుంచి యుకెకు బదిలీ అయింది. మాకు వచ్చే దరఖాస్తుల సంఖ్యలో 200శాతం పెరుగుదల ఉంది. తెలంగాణ నుంచే కాకుండా భారత్ నుంచి మాకు వస్తున్న విద్యార్ధుల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, కంప్యూటర్‌సైన్స్, డేటా సైన్స్... వంటివి ఎంచుకునేవారు ఎక్కువగా ఉన్నారు. ఒకేసారి 2 సబ్జెక్ట్స్ కలిసి చదవడం అనే ట్రెండ్‌ని వీరు అనుసరిస్తున్నారు. ముఖ్యంగా బిజినెస్ విత్ కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్.. ఇలా కలిపి చదువుతున్నారు. (చదవండి: బస్‌భవన్‌లో స్వతంత్ర వజ్రోత్సవాలకు నరసింహ.. సత్తయ్య..) -
Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు!
కష్టసుఖాల కలయికే జీవితం. కానీ కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఊపిరాడనీయకుండా చేçస్తుంటాయి. ఇలాంటప్పుడు మనసులో ఏదోఒక మూలన ఉన్న.. ఉన్నతంగా ఎదగాలన్న కోరిక కూడా ఆవిరైపోతుంది. అచ్చం ఇలాగే జరిగింది రాధికా గుప్తా జీవితంలో. అర్హతలు ఉన్నప్పటికీ, పుట్టుకతో ఉన్న శారీరక సమస్యను సాకుగా చూపుతూ ఉద్యోగానికి పనికిరావని చీత్కారాలకు గురైంది. దీంతో 22 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ కొన్నాళ్లకు ఎడారిలో వర్షంపడినట్లుగా రాధిక జీవితంలో ఉద్యోగ అవకాశం రావడం.. దానిని అందిపుచ్చుకుని నేడు ఏకంగా ఓ పెద్ద కంపెనీకి సీఈవో అయ్యింది. ఇండియాలో ఉన్న అతిపిన్న వయసు సీఈవోలలో రాధిక కూడా ఒకరిగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. యోగేష్, ఆర్తీ గుప్తా దంపతుల ముద్దుల కూతురు రాధికా గుప్తా. యోగేశ్ వృత్తిరీత్యా దౌత్యవేత్త కావడంతో రాధిక చిన్నతనం మొత్తం పాకిస్థాన్, నైజీరియా, అమెరికా, ఇటలీలలో గడిచింది. విదేశాల్లో ఉన్నప్పటికీ ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబం కావడంతో ..‘‘బాగా చదువుకో జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడతావు’’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తుండేవారు. దీంతో రాధిక కూడా చక్కగా చదువుకుంటూ స్కూల్లో టాప్–ఫైవ్ జాబితాలో ఉండేది. అంతా బాగానే ఉన్నప్పటికీ రాధికకు పుట్టుకతో కొన్ని సమస్యల కారణంగా మెడ వంకరగా ఉండేది. వంకర మెడతో స్కూలుకెళితే మిగతా విద్యార్థులంతా.. ఆమెను చూసి గేలి చేసేవారు. నువ్వు మీ అమ్మకంటే అందవిహీనంగా ఉన్నావు’’ అంటూ తరచూ మాటలతో హింసించేవారు. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీ అవ్వడం.. వెళ్లిన ప్రతి కొత్త స్కూల్లో అవమానాలు వెన్నంటి వేధిస్తుండేవి. అయినప్పటికీ తనని తాను నిరూపించుకునేందుకు నిరంతరం కష్టపడేది . డ్యూయల్ డిగ్రీ ఉన్నప్పటికీ.. ప్రతిష్టాత్మక వార్టన్ బిజినెస్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్‌లలో డ్యూయల్ డిగ్రీ చేసింది. రెండు డిగ్రీలు పూర్తయ్యాక ఉద్యోగాన్వేషణ ప్రారంభించింది. ఆమె విద్యార్హతలు, ప్రతిభా నైపుణ్యాలను పక్కనపెట్టేసి ‘నీ మెడ వంకరగా ఉంది నీలాంటి వాళ్లకు ఉద్యోగం ఇవ్వలేము’’ అని వెనక్కి తిప్పి పంపేవారు. ఇలా వరుసగా ఏడుసార్లు జరగడంతో రాధిక తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యింది. ఎందుకు ఈ జీవితం ఆత్మహత్య చేసుకుంటే ఏబాధ ఉండదు అనిపించింది ఆమెకు. కౌన్సిలింగ్‌తో... నిరాశనుంచి బయటపడేందుకు కొంతమంది స్నేహితుల సాయంతో సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్ తీసుకుంది. ఆ తరువాత మెకిన్సేలో ఉద్యోగం వచ్చింది. ఇక్కడ కొన్నాళ్లు పనిచేశాక, ఏక్యూఆర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా చేరింది. తరువాత తన భర్తతో కలిసి ఇండియా వచ్చింది. సొంతంగా ‘ఫోర్‌ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్మెంట్’ కంపెనీని ప్రారంభించింది. కంపెనీ క్యాపిటల్, పనితీరు బావుండడంతో ఎడిల్వీజ్ ఫోర్ఫ్రంట్ను కొనేసింది. ఇదే సమయంలో రాధిక పనితీరుని మెచ్చి ఎడిల్వీజ్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌కు సీఈవోని చేసింది. అనేక అవమానాలు, కష్టాల తరువాత సీఈవోగా రాణిస్తోన్న రాధిక ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ‘దట్ గర్ల్ విత్ ఏ బ్రోకెన్ నెక్’ వీడియోలో తన కథను వివరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అనేక అవమానాలనుంచి అందనంత ఎత్తుకు ఎదిగి నేను ఇది అని నిరూపించి చూపిస్తోంది రాధిక. నాన్నే ప్రేరణ.. నాన్న ..ఉత్తరప్రదేశ్‌లోని ఓ కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు. కష్టపడి చదివి సివిల్ సర్వీసెస్‌లో ఏడో ర్యాంక్ సాధించారు. నిరుపేదరికం నుంచి వచ్చిన ఆయన అన్నిసాధించ గలిగినప్పుడు, నాకున్న ఒక సమస్యతో ఎందుకు వెనుకబడిపోవాలి అనుకుని, బాగా కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నాను. అందం, అనుమానాలను పక్కనపెట్టి, నేను ఎదుర్కొన్న ప్రతిసమస్యను అనుభవాలుగా మార్చుకుని ముందుకు సాగాను. దాంతోనే ఈ స్థాయిలో నిలబడిగలిగాను. – రాధికా గుప్తా -
‘ఆస్కి’లో అంతర్జాతీయ స్థాయి ఎంబీఏ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అంతర్జాతీయ స్థాయిలో డ్యూయల్ డిగ్రీ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రాంను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) అక్టోబరులో ప్రారంభిస్తోంది. కోర్సు కాల వ్యవధి 18 నెలలు. ఇందులో భాగంగా అభ్యర్థులకు నెల రోజులపాటు యూరప్‌లోనూ బోధన ఉంటుంది. మొత్తంగా 15 వారాలు మాత్రమే తరగతులకు హాజరైతే చాలు. విద్యనభ్యసించే వారికి, వారు పనిచేస్తున్న కంపెనీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ విధంగా కోర్సును డిజైన్ చేశారు. సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతైన అవగాహన, వ్యాపార అవకాశాలు, ఆచరణీయ వ్యూహరచన, వాస్తవ పరిష్కారాలపై బోధన ఉంటుందని ఆస్కి సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. -
డ్యూయల్ డిగ్రీ కోర్సులు కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో 2013లో ప్రవేశపెట్టిన డ్యూయల్ డిగ్రీ, ల్యాటరల్ ఎంట్రీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో జారీ చేశారు. మేనేజ్మెంట్లో 5 ఏళ్ల డ్యూయల్ డిగ్రీ, ఐదున్నరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఇంజనీరింగ్-మేనేజ్మెంట్, ఫార్మసీ-మేనేజ్మెంట్), ఆరున్నరేళ్ల ఆర్కిటెక్చర్ మేనేజ్మెంట్ కోర్సులు, రెండేళ్ల ఎంసీఏ, ఎంసీఏలో ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ, మూడేళ్ల ఇంజనీరింగ్ టెక్నాలజీ, బీసీఏ, బీఎస్సీ (ఐటీ/సీఎస్) విద్యార్థులు ఎంసీఏ ద్వితీయ సంవత్సరంలో చేరే తదితర కోర్సులను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు.