'నా గురువుల వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను'
హైదరాబాద్: తాను ఈ స్థితిలో ఉండటానికి నా గురువులే కారణమని ఇరు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. గురువారం కోఠి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవ వేడుకల్లో నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కాలేజీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి నరసింహన్ ప్రసంగించారు. ఎంత ఉన్నత స్థితికి వెళ్లినా గురువుల్ని మాత్రం మరవకూడదని విద్యార్థులకు హితబోధ చేశారు.
ఈ కాలేజీ వేడుకలు చూస్తుంటే తన చదివిన కాలేజీలోని నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. కాలేజీ 90 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలది విశేషమైన పాత్ర ఉందన్నారు. మహిళ విద్యతోనే సమాజ అభివృద్ధి సాథ్యమని నరసింహన్ స్పష్టం చేశారు.