koti womens college
-
కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
కోఠి ఉమెన్స్ కాలేజ్ ఇక ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం’
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలో కొత్తగా స్థాపించిన మహిళా వర్సిటీకి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేసినట్లు కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.విజ్జులత బుధవారం తెలిపారు. ఓయూకు అనుబంధంగా 98 సంవత్సరాలు కొనసాగిన కోఠి మహిళా కాలేజీ ఈ విద్యా సంవత్సరం (2022–23) తెలంగాణ మహిళా యూనివర్సిటీ(టీఎంయూ)గా మారడం తో పాలన వ్యవహారాలు బదిలీ కానున్నాయి. కోఠి మహిళా కాలేజీలో కొనసాగుతున్న బోధన, బోధనేతర సిబ్బంది ఓయూకు వచ్చేందుకు వీలుగా ఇటీవల జరిగన పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాగా, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి వీసీని నియమించాల్సి ఉంది. వీసీని నియమించనందున వర్సిటీలో చేపట్టాల్సిన పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక మహిళా వర్సిటీ పరిధిలోని కాలేజీల సంఖ్య, కోర్సుల వివరాలు ఇంతవరకు ప్రకటించలేదు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించే దోస్తు ద్వారా డిగ్రీ, ఓయూ నిర్వహించే టీఎస్‌సీపీజీఈటీ ద్వారా వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు జరగ నున్నాయి. టీఎస్‌సీపీజీఈటీ–2022 పీజీ అడ్మిషన్ల జాబితాలో తెలంగాణ మహిళా వర్సిటీని కూడా చేర్చారు. కానీ మహిళా వర్సిటీ నుంచి వివరాలు రానందున జూన్ 1న విడుదల కావాల్సిన టీఎస్ సీపీజీఈటీ–2022 నోటిఫికేషన్ నిలిచిపోయింది. -
కోఠి కాలేజ్ భవితవ్యం ఏమిటి?
హైదరాబాద్‌లోని ‘కోఠి మహిళా కళాశాల’ను ప్రభుత్వం ‘యూనివర్సిటీ’గా ప్రకటించింది. దీన్ని అందరం ఆహ్వానించాల్సిందే, కానీ ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన విధానపరమైన ప్రకటన రాకపోవడం విచారకరం. నూతనంగా ఏర్పాటయ్యే ‘కోఠి మహిళా విశ్వవిద్యాలయం’లో పెట్టే కోర్సులు, ఆర్థిక వనరులు, టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టుల పూర్తిస్థాయి భర్తీ ప్రక్రియ, యూని వర్సిటీ ఎప్పుడు ప్రారంభమవుతుంది వంటి విషయాలు అస్పష్టం గానే ఉండిపోయాయి. యూనివర్సిటీ నిర్వహణకు కనీసం రెండు వందల ఎకరాల సువిశాలమైన భూమి ఉండాలి. ఇప్పటివరకు ఉన్న మహిళా కళాశాలను యూనివర్సిటీగా కొంతకాలం నిర్వహించి, తర్వాత వరంగల్‌లో కానీ, విజయవాడ రహదారి పక్కన కానీ భూమి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అలా కేటా యిస్తే... ఇప్పుడున్న మహిళా కళాశాల భూములను, భవనాలను కార్పొరేట్, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా... మంచి రీసెర్చ్ సెంటర్‌ని అభివృద్ధి చేయాలి. (క్లిక్: తొలి మహిళా వర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీ) ఇప్పటికే రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి అందరికీ తెలిసిందే. నిధుల్లేక కునారిల్లుతున్నాయి. బోధన, బోధనేతర సిబ్బంది లేక క్లాసులు జరగడం లేదు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫెలోషిప్‌లు, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జేఎన్టీయూ లాంటి విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయి. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు అను మతి ఇచ్చింది. ఫలితంగా ఉన్నత విద్యా వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రకటించిన ‘కోఠి మహిళా విశ్వవిద్యాలయం’ ఎలా రూపుదిద్దుకుంటుందో చూడాలి! (క్లిక్: మరీ ఇంత రుసుమా.. ఉద్యోగాలకు అప్లై చేయాలా వద్దా?) – పి. మహేష్ పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
తెలంగాణ తొలి మహిళా వర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లలో శత వసంత ఉత్సవాలకు సిద్ధమవుతున్న హైదరాబాద్ కోఠి మహిళా కళాశాల.. తెలంగాణ తొలి మహిళా యూనివర్సి టీగా మారనుంది. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మహిళా విశ్వవిద్యాల యం ఏర్పాటుకు ఆమోదం తెలిపిన సంగతి తెలి సిందే. దీనికి సంబంధించి సమగ్ర నివేదిక కోసం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. గతంలో అనుకున్న మేరకు కోఠి విమెన్స్ కాలేజీలోనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. నాలుగేళ్ల కిందే అనుకున్నా.. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయం ఉమ్మడి రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీగా అందుబా టులో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు మహిళా యూనివర్సిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది. 2018 మార్చిలో జాతీయ ఉన్నత విద్యా శిక్షా అభియాన్(రూసా) కింద కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చాలని భావించా రు. అప్పట్లో విద్యాశాఖ మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి.. ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపారు. తర్వాత విమెన్స్ కాలేజీని సందర్శించి వసతులను పరిశీలించారు. ఈ మహిళా కళాశాలలో ఒక్క పరిశోధనా సౌకర్యాలు మాత్రమే లేవని, విశ్వ విద్యాలయంగా మారితే పరిశోధనలు కూడా ప్రారంభమవుతాయని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. నిధుల విషయంగా నిలిచిపోయి..: మహిళా వర్సిటీ ఏర్పాటు కోసం రూ.50 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అప్పట్లో సుముఖత వ్యక్తం చేసింది. దీనికి అదనంగా మరో రూ.100 కోట్లు వెచ్చిస్తేనే.. సకల వసతులతో విశ్వవిద్యాలయంగా మార్చవచ్చని ఉస్మానియా వర్సిటీ అధికారులు అంచనాలు రూపొందించారు. కానీ ఆ తర్వాత పెండింగ్‌లో పడింది. అయితే ఉస్మానియా వర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్.. కోఠి ఉమెన్స్ కాలేజీకి రూ.37 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా మంత్రి కేటీఆర్ ప్రతిపాదనతో మహిళా వర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. స్వయం ప్రతిపత్తి హోదా నుంచి.. 1924లో నిజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున సుమారు 42 ఎకరాల వైశాల్యంలో కోఠి విమెన్స్ కాలేజీ ఏర్పాటైంది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతోంది. 1998లో యూజీసీ నుంచి స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా లభించింది. మూడు సార్లు న్యాక్ గుర్తింపు దక్కించుకుంది కూడా. ప్రస్తుతం 57 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, 20 పీజీ కోర్సులు కొనసాగుతున్నాయి. కాలేజీలో 4,091 మంది రెగ్యులర్, 150 మంది డిప్లొమా, 17 మంది విదేశీ విద్యార్థినులు చదువుకుంటున్నారు. వంద మంది రెగ్యులర్, మరో 100 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయంగా మారితే.. ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఉన్న మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలన్నింటినీ కోఠి మహిళా వర్సిటీకి అనుబంధ కాలేజీలుగా మార్చే అవకాశాలున్నాయి. అర్హతలున్నాయ్.. నిధులే కావాలి కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా వర్సిటీగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలున్నాయని.. అయితే కనీసం రూ.వంద కోట్లు నిధులు వెచ్చించాల్సి ఉంటుందని ఉన్నత విద్య అధికారులు తేల్చారు. ముఖ్యంగా మౌలిక వసతుల మెరుగుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తించారు. రాష్ట్రంలో విమెన్స్ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్య మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, కోఠి విమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విద్యుల్లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు తమ ప్రతిపాదనలు, అభిప్రాయాలను మంత్రికి వివరించారు. ఈ మేరకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కొంతకాలం ఓయూ పర్యవేక్షణలోనే.. కోఠి విమెన్స్ కాలేజీని వర్సిటీగా మార్చినా.. కొంతకాలం ఉస్మానియా వర్సిటీ నేతృత్వంలోనే కొనసాగే వీలుందని అధికారులు అంటున్నారు. కొత్త వర్సిటీకి వెంటనే గుర్తింపు అందడం కష్టమని.. అందువల్ల మూడేళ్ల పాటు ఓయూ పేరిటే సర్టిఫికెట్లు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మంచి నిర్ణయమిది.. ఉన్నత విద్యావంతుల జాబితాలో మహిళల సంఖ్య పెరుగుతోంది. మహిళా కాలేజీలు చాలా ఉన్నా.. వర్సిటీ లేదనే కొరత ఉండేది. ఆ దిశగా ముందడుగు వేసిన సీఎం నిర్ణయం అభినందనీయం. – ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ మహిళలకు మరింత ప్రోత్సాహం చాలా వరకు డిగ్రీతోనే చదువు ఆపేసే మహిళ లు.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పైస్థాయి విద్యకు ఆసక్తి చూపుతున్నారు. ఉస్మానియా క్యాంపస్ హాస్టళ్లలో మహిళలకే ఎక్కువ భవనాలు అవసరమయ్యే పరిస్థితి ఏర్పడింది. 70% ఉన్నత విద్యావంతులు వారే ఉంటున్నా రు. ఈ తరుణంలో మహిళా వర్సిటీ ఏర్పాటు వారికి మరింత ప్రోత్సాహకరంగా నిలుస్తుంది. – ప్రొఫెసర్ రవీందర్, ఉస్మానియా వర్సిటీ వీసీ -
యువర్..‘ఆనర్స్’
బీఏ కోర్సులంటేనే బోర్ కొట్టించే పరిస్థితిని రూపుమాపేందుకు ఉన్నత విద్యా మండలి ప్రయత్నిస్తోంది. సరికొత్త రాజనీతి బోధనకు శ్రీకారం చుట్టింది. బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును తొలిసారిగా కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యామండలి సాధన చేసి సరికొత్త రాజనీతి బోధనకు శ్రీకారం చుట్టింది. విద్య, విలువల కలబోతగా కొత్త కోర్సును విద్యార్థుల ముందుకు తెచ్చింది. వినూత్న పాఠ్యప్రణాళిక ఈ కోర్సు విశేషం. బీఏ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) కోర్సులంటేనే బోర్ కొట్టించే పరిస్థితిని రూపుమాపేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త కోర్సుకేకాదు, బావితరాల కోసం కొత్త రాజకీయ నాయకత్వానికి డిజైన్ చేసింది. బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును తొలిసారిగా కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టింది. 60 మంది విద్యార్థులతో ప్రయోగాత్మకంగా మొదలైన తొలిబ్యాచ్ ప్రారంభ కార్యక్రమం మంగళవారం ఇక్కడ జరిగింది. కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్ అరుణ్ పట్నాయక్, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ విద్యుల్లత, రాజనీతిశాస్త్రం ప్రొఫెసర్ వి.శ్రీలత తదితరులు పాల్గొన్నారు. నాయకత్వలక్షణాలు, రాజకీయ మేధోమథనం, క్షేత్రస్థాయి రాజనీతిజ్ఞత మేళవించిన పాఠ్యప్రణాళికను ఈ కోర్సులో జోడించారు. ఈ కోర్సు ప్రాధాన్యతలపై నిపుణులు ‘ఇండస్ ప్రోగ్రామ్’లో ఏమన్నారంటే... దేశంలోనే భిన్నమైన ఆలోచన: ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి భిన్నమైన ఆలోచనలతో కోర్సుకు డిజైన్ చేశాం. సమకాలీన అంతర్జాతీయ, రాజకీయ విషయాలే బోధనాంశాలు. తరగతికే పరిమితమయ్యే పాతవిధానానికి భిన్నంగా రాజకీయప్రముఖుల అనుభవాలే పాఠ్యాంశాలుగా నేరుగా విద్యార్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. సంప్రదాయ ఫ్యాకల్టీ పాత్ర కన్నా, రాజకీయ ముఖ్యులు, విశ్లేషకులే ఇక్కడ బోధకులుగా వ్యవహరిస్తారు. నాలుగు గోడల మధ్య చదువును పక్కన బెట్టి, విశాల ప్రపంచంలో విస్తృత అవగాహన బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ ప్రత్యేకత. చారిత్రక అవసరం : ఓయూ వీసీ ప్రొ. డి. రవీందర్ ఉన్నత విద్యలో మహిళల పాత్ర 70 % మేర పెరిగింది. గొప్ప నాయకత్వ లక్షణాలను సంతరించుకునే దిశగా వాళ్లు అడుగులు వేస్తున్నారు. అందుకే బీఏ హానర్స్ పొలిటికల్ సైన్స్ కోర్సును కోఠి ఉమెన్స్ కాలేజీలో ప్రవేశపెట్టాం. దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో అధ్యయనం చేసిన తర్వాతే ఈ కోర్సు రూపొందించాం. భావితరాలకు మంచి నాయకులను అందిస్తామనే ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాం. ఢిల్లీ కన్నా ... ఇక్కడే బెస్ట్ ఢిల్లీలోని విశ్వవిద్యాలయాల కన్నా మెరుగైన రీతిలో బీఏ ఆనర్స్‌ను తెలంగాణ అందించాలనుకుంటోం ది. దక్షిణ భారతదేశంలో ఈ కోర్సుకు అనువైన పరిస్థితులు తెలంగాణలోనే ఉన్నాయి. భవిష్యత్‌లో ఈ కోర్సు కోసం ఇతర రాష్ట్రాల వాళ్లూ పోటీపడతారు. తెలంగాణలోని నాయకత్వ లక్షణాలు, విద్యాహబ్‌గా హైదరాబాద్ ముందుండటం వల్ల ఈ కోర్సు కు మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నాం. ఈ కోర్సు అభ్యసించిన విద్యార్ఙినులు రోల్‌మోడల్‌గా నిలుస్తారని ఆశిస్తున్నాం. – ప్రొ.వెంకటేశు రాజకీయాల్లో విలువలు పెంచే కోర్సు విలువలతో కూడిన రాజకీయాలు నేటితరానికి అవసరం. ప్రజా సంక్షేమ పాలనకు ఇదే పునాది. ముఖ్యంగా మహిళారాజకీయ చైతన్యం వెల్లివిరుస్తున్న నేపథ్యంలో హానర్స్ పొలిటికల్ కోర్సులకు ఎంతో ప్రాధాన్యముంది. పార్లమెంటరీ విలువలు, నాయకత్వ లక్షణాలు కలబోసి రూపొందించిన ఈ పాఠ్యప్రణాళిక... వాస్తవాలే పాఠాలు మార్చి అందించే బోధనావిధానం తెలంగాణను దేశంలో గర్వంగా నిలుపుతుందని భావిస్తున్నాం. – ముసలయ్య (రాజనీతి శాస్త్రం ఆచార్యుడు) -
16వ స్నాతకోత్సవం: కళకళలాడిన కోఠి ఉమెన్స్ కాలేజీ
-
నచ్చిన కాలేజీలోనూ క్లాసులు వినొచ్చు
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ డిగ్రీలో సరికొత్త విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు. కొఠారీ కమిషన్, జాతీయ విద్యా విధానం సిఫార్సుల మేరకు క్లస్టర్ విధానానికి ఉన్నత విద్యా మండలి రూపకల్పన చేసింది. ఏదైనా ఒక కాలేజీలో చదువుకునే విద్యార్థి మరో కాలేజీలో వేరే సబ్జెక్టు క్లాసులకు హాజరయ్యే వెసులు బాటును ఇది కల్పిస్తుంది. దీనిపై కోఠి ఉమెన్స్ కాలేజీలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిం చారు. ఆధునిక విద్యావిధానం కోరు కునే విద్యార్థులకు క్లస్టర్ విధానం చక్కటి అవకాశమని అధికారులు తెలిపారు. ప్రత్యక్ష, పరోక్ష (ఆన్లైన్) చదువుకూ వీలుంటుంద న్నారు. తొలి దశలో తొమ్మిది కాలేజీల మధ్య సమన్వయం తీసుకొస్తున్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీ, సిటీ కాలేజ్, రెడ్డి ఉమెన్స్, సెయింట్ ఆన్స్, సెయింట్ ఫ్రాన్సిస్, భవన్స్, లయోలా, బేగంపేట ఉమెన్స్ కాలేజ్, నిజాం కాలేజీలు ఈ జాబితాలో ఉన్నాయి. త్వరలో మార్గదర్శకాలు కళాశాలల్లోని ఫ్యాకల్టీ, లేబొరేటరీ, లైబ్రరీ, రీసెర్చ్ తదితర అంశాల్లో ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకుని వాటిలో ఎక్కడైనా విద్యార్థులు ఒక సబ్జెక్టును చదవచ్చు. దానికి సంబంధించిన పరీక్ష అదే కాలేజీలో నిర్వహించి, మార్కులు మాతృ కాలేజీకి పంపుతారు. తొమ్మిది కాలేజీల్లో ఒకే రకమైన పాఠ్య ప్రణాళిక, పరీక్ష విధానం, అడ్మిషన్ ప్రక్రియ ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ఈ ఉమ్మడి ఎజెండాకు అనుగుణంగా తొమ్మిది కాలేజీలు అవగాహన ఒప్పందానికి వస్తాయని, పరస్పర సమన్వయంతో ముందుకెళ్తాయని వివరించారు. దీనిపై త్వరలో మరోసారి సమీక్షించి, అవసరమైన మార్గదర్శకాలు అందుబాటులోకి తెస్తామని లింబాద్రి చెప్పారు. -
ప్రముఖులతో పాఠాలు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు తరగతి గదుల్లో పాఠ్యపుస్తకాల చదువులను తగ్గించి, సామాజిక అవగాహన మేళవించి సరికొత్త బోధనను అందుబాటులోకి తేనున్నారు. రాజకీయ ప్రముఖులు, ఆర్థికవేత్తలు, మాజీ ఐఏఎస్‌లు, ఇతర మేధావులతో పాఠాలు చెప్పించబోతున్నారు. ఈ దిశగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి బీఏ ఆనర్స్ కోర్సులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మంగళవారం హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో ఈ కొత్త కోర్సును లాంఛనంగా ప్రారంభించారు. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఏ ఆనర్స్ (పొలిటికల్), నిజామ్ కాలేజీలో బీఏ ఆనర్స్ (ఎకనామిక్స్)ను అమలు చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలుపెట్టనున్న ఈ కోర్సులో ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్‌లో వీటిని చేరుస్తారు. రెండు కాలేజీల్లో లభించే ఆదరణను బట్టి రాష్ట్రవ్యాప్తంగా కోర్సును విస్తరించే వీలుందని మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. ప్రస్తుతానికి మూడేళ్ల కాలపరిమితితోనే కోర్సు ఉంటుందని, మున్ముందు నాలుగేళ్లకు పెంచుతామని అధికారులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవీ, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రవీందర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ పాల్గొన్నారు. కోర్సు లక్ష్యం ఇదీ.. ఉమ్మడి రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం బీఏ ఆనర్స్ కోర్సును సమర్థవంతంగా నిర్వహించారు. అప్పట్లో ఈ కోర్సు చేసిన వారికి ఇంటర్మీడియెట్ బోధించే అర్హత కూడా ఉండేది. సైన్స్ కోర్సుల ప్రాధాన్యం పెరగడంతో ఆనర్స్ తెరమరుగైంది. సంప్రదాయ బీఏ కోర్సుల్లో చేరే వారి సంఖ్య 16 శాతానికి పరిమితమైంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో బీఏ చదివే వారి సంఖ్య పెరుగుతోంది. అదీగాక ఈ కోర్సు కోసం ఇక్కడి నుంచి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోనూ అందుబాటులోకి తెస్తున్నారు. సామాజిక అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశమని ఉన్నత విద్యామండలి తెలిపింది. పాఠ్యపుస్తకాల్లో అంశాలకు 50 శాతం మార్కులిస్తే, సామాజిక అవగాహనకు మరో 50 మార్కులు ఇస్తారు. ఆనర్స్ కోర్సును వ్యాపారం కాకుండా, ప్రభుత్వ కాలేజీల్లో నిర్వహిస్తే బాగుంటుందని వినోద్‌కుమార్ సలహా ఇచ్చారు. సమాజాన్ని అర్థం చేసుకోకపోతే అది చదువే కాదని, దీన్ని గుర్తించే ఆనర్స్ తెస్తున్నట్టు తెలిపారు. -
భాగ్యనగరంలో ఓ శ్వేతసౌధం
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌ను ఎప్పుడైనా చూశారా? క్రీస్తుపూర్వం ఓ వెలుగు వెలిగిన గ్రీక్–రోమన్ నిర్మాణ శైలిని 15వ శతాబ్దంలో పునరుద్ధరించాక ఆ శైలిలో రూపుదిద్దుకున్న గొప్ప నిర్మాణాల్లో ‘వైట్‌హౌస్’ కూడా ఒకటి. ఆ భవనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఓసారి హైదరాబాద్‌లోని కోఠికి వెళ్లండి సరిపోతుంది! సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని కోఠిలో ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాలగా వెలుగొందుతున్న బ్రిటిష్ రెసిడెన్సీ భవనం చూడటానికి వాషింగ్టన్‌లోని శ్వేతసౌధంలానే ఉంటుంది. వాస్తవానికి ఈ రెండు భవనాలకు ఒకదానికొకటి సంబంధం లేకపోయినా పల్లాడియన్ శైలి, సమకాలీన పరిస్థితులు ఈ రెండు భవనాలకు పోలిక తెచ్చిపెట్టాయి. శైలిలోనే కాదు... నిర్మాణ సమయం కూడా ఈ రెండు భవనాలకూ ఇంచుమించు ఒక్కటే. వైట్‌హౌస్ నిర్మాణం 1792లో ప్రారంభమై 1800 సంవత్సరంలో ముగియగా 1803లో బ్రిటిష్ రెసిడెన్సీ రూపుదిద్దుకుంది. వైట్ హౌస్ ముందు భాగం నిర్మాణ ప్రత్యేకతలెన్నో.. అంతెత్తున కనిపించే భారీ స్తంభాలు.. వాటిపై ఐకా నిక్ క్యాపిటల్.. దానిపైన త్రికోణాకారంలో పెడిమెంట్. దర్బారు హాలుకు ప్రవేశ మార్గ భారీతనం.. దానికి రెండు వైపులా రెండంతస్తుల భారీ గదులతో కూడిన భవంతులు.. లోనికి ప్రవేశించేందుకు ఎత్తయిన మెట్ల వరుస.. అర్ధ వృత్తాకారంలో పోర్టికో న మూనాలో వెనుక వైపు ప్రవేశద్వారం.. దానికి ఆధారంగా డబుల్ హైట్ కాలమ్స్.. లోనికి వెళ్లగానే ద ర్బార్ హాల్.. అది కూడా డబుల్ హైట్ బాల్కనీల నిర్మాణం.. ఇవన్నీ కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీ ప్రత్యేకతలు.ఇక్కడ కళ్లు మూసుకొని ‘వైట్‌హౌస్’ ముందు తెరిస్తే దాదాపు అదే శైలి నిర్మాణం కనిపిస్తుంది. బ్రిటీష్ రెసిడెన్సీ భవనం వెనక భాగం ఇలా.. కలిపింది పల్లాడియన్ శైలి.. ‘వైట్‌హౌస్’కు మన కోఠి భవనానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఒకే తరహా శైలి రెండింటినీ జోడించింది. ఇటలీకి చెందిన ఆర్కిటెక్ట్ ఆండ్రూ పల్లాడియో 15వ శతాబ్దంలో కొత్త నిర్మాణ శైలికి బీజం వేశారు. క్రీస్తుపూర్వం గ్రీక్–రోమన్ నిర్మాణ శైలికి ఆధునికతను జోడిస్తూ పునరుద్ధరించారు. దానికి ప్రపంచం మంత్రముగ్ధమైంది. ఎన్నో నిర్మాణాలను ఆ రూపులో తీర్చిదిద్దిన ఆయన.. ఆ నిర్మాణ శైలికి సంబంధించి నాలుగు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి ఆ తరహా నిర్మాణశైలి పల్లాడియన్ డిజైన్‌గా పేరుగాంచింది. ఆ తర్వాత పల్లాడియన్ శైలిని తిరిగి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ జోమ్స్ ఇటలీకి వెళ్లి చదువుకొని మరీ పునరుద్ధరించారు. ఇది బాగా నచ్చి హైదరాబాద్‌లో బ్రిటిష్ రెసిడెంట్‌గా ఉన్న కిర్క్ ప్యాట్రిక్ అదే నమూనాలో రెసిడెన్సీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను మద్రాస్ ఇంజనీర్స్కు చెందిన శామ్యూల్ రసెల్స్కు అప్పగించారు. దాదాపు అదే సమయంలో జేమ్స్ హోబన్ అనే అమెరికా ఆర్కిటెక్ట్ ‘వైట్‌హౌస్’కు ప్రాణం పోశారు. వెనక పోర్టికో ప్రవేశమార్గం ఇలా భవనాన్ని కాపాడే ప్రయత్నమేదీ..? సమకాలీన నిర్మాణాలే అయినప్పటికీ ‘వైట్‌హౌస్’ తళతళా మెరిసిపోతుంటే కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీ మాత్రం ఎప్పుడు కూలుతుందో తెలియనంతగా శిథిలావస్థకు చేరింది. 1949లో ఇది మహిళా కళాశాలగా మారినా భవనాన్ని కాపాడేందుకు పెద్దగా ప్రయత్నం జరగలేదు. త్వరలో కొలువుదీరే జీహెచ్ఎంసీ కొత్త పాలకవర్గం దీనిపై దృష్టి సారించి పురావస్తుశాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకొని దీన్ని హైదరాబాద్ షాన్లలో ఒకటిగా తీర్చిదిద్దాలన్న వినతులు చరిత్రకారుల నుంచి వస్తున్నాయి. భావితరాలకు చూపించాలి.. బ్రిటిష్ రెసిడెన్సీ భవనం పల్లాడియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న గొప్ప నిర్మాణం. అమెరికా వైట్‌హౌస్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ శైలిలో ఎన్నో భవనాలున్నాయి. గ్రీన్విచ్లోని క్వీన్స్ హౌస్, బర్లింగ్టన్స్ హోమ్ చిస్విక్ హౌస్, ఇంగ్లండ్‌లోని క్లేర్మంట్ హౌస్, కోల్‌కతాలోని గవర్నమెంట్ హౌస్‌లు వాటికి నిదర్శనం. గొప్ప నిర్మాణశైలికి నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని కాపాడి భావితరాలకు చూపించాలి. – వసంత శోభ తురగ, కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ -
‘కోఠి’ వర్సిటీ
సాక్షి, సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్: ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా...సరిగ్గా 94 ఏళ్ల క్రితం కేవలం నలుగురు విద్యార్థినులతో ప్రారంభమైన కోఠి మహిళా కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇక మహిళలకు మరింత నాణ్యమైన ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం ఇక్కడ 44 కోర్సులుండగా...4516 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఈ కళాశాలకు న్యాక్ ఏ గుర్తింపు సైతం ఉంది. హైదరాబాద్ నడిబొడ్డున కోఠిలో 42 ఏకరాల విస్తీర్ణంలోఉమెన్స్ కళాశాల విస్తరించి ఉంది. ప్రస్తుతం 29 శాఖలు ఉండగా, వీటిలో 22 యూజీ కోర్సులు, 20 పీజీ కోర్సులు కొనసాగుతున్నాయి. 253 మంది టీచింగ్ స్టాఫ్, 191 మంది నాన్ టీచింగ్ ఉద్యోగులు పనిచేస్తు న్నారు. ఎంతో మంది మహిళలను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఈ కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దితే..కొత్తగా వీసీ, రిజిస్ట్రార్ పోస్టులు మంజూరు కావడంతో పాటు ఇప్పటికే ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు అధ్యాపక పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. యూజీసీ నుంచే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. మహిళల ఉన్నత విద్యకు ఎంతగానో దోహదపడుతుంది. యూజీ, పీజీ విద్య కోసం ఈ కళాశాలలో 49 సైన్స్ ల్యాబులు, ఆరు కంప్యూటర్ ల్యాబ్‌లు, ఒక లైబ్రరీ, సైబర్ కేఫ్, గ్రీన్హౌస్, 110 తరగతిగదులు, ఫార్మస్యూటికల్ ల్యాబ్, సైకాలాజీ కౌన్సిలింగ్ ల్యాబ్, ఇంగ్లీష్ లాగ్వేజ్ ల్యాబ్, హెల్త్ సెంటర్లతో పాటు రెండు వసతి గృహాలు, నాలుగు సెమినార్ హాల్స్, దర్బార్‌హాల్, ఎగ్జామినేషన్ బ్రాంచ్, పరిపాలన భవనాలు కలిగిఉన్నాయి. కళాశాలలోని శాఖలు..... ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్... డిపార్ట్మెంట్ ఆఫ్ అరబిక్, హింది, ఇంగ్లీష్, పర్షియన్, ఉర్దూ, మరాఠి, ఫ్రెంచ్, తెలుగు, సంస్కృతం ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ స్టడీస్... డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, పొల్టికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, సోషియాలాజీ, సైకాలాజీ, మాస్ కమ్యూనికేషన్స్, జియోగ్రఫీ, ఫిలాసఫీ ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్.. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ ఆఫ్ లైఫ్‌సైన్స్.. డిపార్ట్మెంట్ ఆఫ్ బోటని, జువాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ, న్యూట్రీషియన్ తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, బిజినెస్ మెనేజ్మెంట్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, యూజీ,పీజీ, ఎంఎస్సీ, ఎంబీఎ, ఎంసీఎ, డిప్లొమా తదితర కోర్సుల శాఖలు ఉన్నాయి.. అనుకూల వాతావరణం ఉంది... కోఠి ఉమెన్స్ కళాశాలను మహిళ విశ్వవిద్యాలంగా ఏర్పాటు చేస్తే ఎంతో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంగా మారుతుంది. ఈ కళాశాలలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు అన్ని వనరులు ఉన్నాయి. 42 ఏకరాల స్థలం, ఇతర భవనాలు, ల్యాబ్‌లు, స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఉన్నాయి. మరికొన్ని కోర్సులు పెంచుకుని విద్యార్థులకు పరిశోధన విభాగం ఏర్పాటు చేయవచ్చు. విశ్వవిద్యాలయానికి ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. – ప్రొఫెసర్ ప్రశాంతాత్మ, కోఠి ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ మహిళా వర్సిటీ సంతోషకరం... నేను చదివే కోఠి ఉమెన్స్ కళాశాల మహిళా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు కానుందని మంత్రి కడియం శ్రీహరి మా కళాశాల సందర్శించిన తర్వాతే తెలిసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పద్మావతి విశ్వవిద్యాలయం ఉండేది. అది ఏపీకి వెళ్లింది. తెలంగాణలో కోఠి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు సంతోషకరం. – జూహిరాణి సింగ్, యూజీ విద్యార్థిని, బొల్లారం మహిళలకు ఉన్నత విద్య నేను ఇండియాకు విద్యను అభ్యసించేందుకు వచ్చాను. ఏ కళాశాలలో చేరాలో అని వెదికితే కోఠి మహిళ కళాశాల ప్రతిష్టాత్మకంగా కనిపించింది. ఈ కళాశాలలో అన్ని వసతులు, నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఈ కళాశాల యూనివర్సిటీగా మారితే దేశ విదేశాలనుంచి విద్యను అభ్యసించేందుకు వచ్చే విదేశీయుల సంఖ్య పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. – కలిద– ఒమన్ (విదేశీ విద్యార్థిని) చరిత్ర సృష్టిస్తుంది కోఠి ఉమెన్స్ కళాశాలలో రెగ్యులర్ యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఈ కళాశాల విశ్వవిద్యాలయంగా మారితే మహిళలకు ఆల్‌రౌండ్ విశ్వవిద్యాలయంగా ఉంటుంది. రానున్న విద్యాసంవత్సరం లోగా దీన్ని విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలి. ఇది తప్పక చరిత్ర సృష్టిస్తుంది. – అస్రాబాను (గుజారాత్), బీఏ విద్యార్థిని -
మహిళా వర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజ్
హైదరాబాద్: నగరంలోని కోఠి ఉమెన్స్ కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మారుస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన కాలేజీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడ మౌలిక వసతులు, బోధనా తీరు, విద్యావిధానం వంటి అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చే అవకాశాలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదంతో వచ్చే విద్యా ఏడాది నుంచే వర్సిటీని ప్రారంభిస్తామన్నారు. 40 ఎకరాల్లో విస్తరించిన ఈ కళాశాలలో బోధనా వసతులు బాగున్నాయని ప్రశంసించారు. రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన విద్యార్థినులతో పాటు విదేశాలకు చెందిన వారు కూడా ఇక్కడ చదువుతున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలోని పద్మావతి మహిళా వర్సిటీ విభజన అనంతరం ఏపీకి వెళ్లడంతో రాష్ట్రానికి మహిళా విశ్వవిద్యాలయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మహిళా వర్సిటీని ఏర్పాటు చేయాలని, కేంద్రం ఇందుకు తగిన సాయం చేయాలని ఇటీవల కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరినట్లు చెప్పారు. ఆ ఒక్కటే కొరత కోఠి ఉమెన్స్ కళాశాలలో 42 యూజీ, పీజీ కోర్సులు కొనసాగుతున్నాయని ఒక్క పరిశోధన మాత్రమే లేదని, వర్సిటీగా మారితే అది కూడా ప్రారంభమవుతుందని కడియం చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ వర్సిటీకి రూ. 200 కోట్లు, ఓయూ అనుబంధ కళాశాలగా ఉన్న ఉమెన్స్ కాలేజీకి రూ. 37 కోట్లు కేటాయించారన్నారు. ఈ రూ.37 కోట్ల నిధులతోనే ఆయా భవనాల మరమ్మతులు కొనసాగుతున్నాయన్నారు. అధికారుల నివేదిక అనంతరం వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ఇతర వసతులు కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ వీసీ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ స్త్రీల సాహిత్యంపై సదస్సు
హైదరాబాద్: తెలంగాణ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో భాగంగా సాహిత్య అకాడమీ, కోఠి మహిళా విశ్వవిద్యాలయ కళాశాలలోని తెలుగుశాఖ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఒక రోజు సదస్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా సాహితీ ప్రియులందరిని ఆహ్వానిస్తున్నాయి. ఆగస్టు 30న(మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ఈ సదస్సులో 'తెలంగాణ స్త్రీల సాహిత్యం సమాలోచన' అనే అంశంపై పలువురు ప్రముఖులు ప్రసంగాలు చేయడంతోపాటు పత్ర సమర్పణ కూడా ఉంటుంది. సాహిత్య అకాడెమి ప్రాంతీయ కార్యదర్శి ఎస్పీ మహాలింగేశ్వర్ ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్పనుండగా.. తెలుగు సలహా మండలి, సాహిత్య అకాడమి సంచాలకులు గోపీ ఈ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. ఇక స్వాగతోపన్యాసం ప్రొఫెసర్ సూర్యాధనంజయ్, కీలకోపన్యాసం ఎస్ రఘు(తెలుగు శాఖాధ్యక్షులు కోఠి, మహిళా విశ్వవిద్యాలయం) చేయనున్నారు. దీని అనంతరం రెండు దఫాలుగా ఈ సమావేశం జరుగనుంది. తొలి దఫా ఉదయం 11.30గంటలకు ప్రారంభం కానుండగా.. రెండో దఫా సమావేశం మ.2గంటలకు ఉంటుంది. సూరెపల్లి సుజాత, అనిశెట్టి రజిత, కే లావణ్య, ఎన్ రజిని, ఎం గీతావాణి, గోగు శ్యామల వంటి రచయితలతోపాటు, పలువురు పరిశోధకులు పాల్గొంటున్నారు. సమాపన ప్రసంగం ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖ అధ్యక్షుడు వెలిదండ నిత్యానంద రావు చేయనున్నారు. -
'మెట్రో' పై కోఠి ఉమెన్స్ కాలేజీ విద్యార్థినుల ఆందోళన
హైదరాబాద్ : మెట్రో పనులను వ్యతిరేకిస్తూ కోఠి ఉమెన్స్ కళాశాల ఎదుట విద్యార్థులు గురువారం నిరసనకు దిగారు. కోఠి కాలేజీ క్యాంపస్‌లో నుంచి మెట్రో లైన్ వెళ్లకూడదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘కోఠి’ కాంతులు
-
కోఠి మహిళా కళాశాల వార్షికోత్సవం
-
'నా గురువుల వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను'
హైదరాబాద్: తాను ఈ స్థితిలో ఉండటానికి నా గురువులే కారణమని ఇరు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. గురువారం కోఠి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవ వేడుకల్లో నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కాలేజీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి నరసింహన్ ప్రసంగించారు. ఎంత ఉన్నత స్థితికి వెళ్లినా గురువుల్ని మాత్రం మరవకూడదని విద్యార్థులకు హితబోధ చేశారు. ఈ కాలేజీ వేడుకలు చూస్తుంటే తన చదివిన కాలేజీలోని నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. కాలేజీ 90 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలది విశేషమైన పాత్ర ఉందన్నారు. మహిళ విద్యతోనే సమాజ అభివృద్ధి సాథ్యమని నరసింహన్ స్పష్టం చేశారు.