పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులో స్టెనో పోస్టులు
పశ్చిమ గోదావరి పీఆర్‌ఎల్. డిస్ట్రిక్ట్ కోర్టు (ఏలూరు).. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 20. వివరాలకు www.ecourts.gov.in/westgodavari చూడొచ్చు.
కేరళ ఈఎస్‌ఐసీ ఆస్పత్రిలో ఖాళీలు
కొల్లాం (కేరళ)లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్‌స కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) హాస్పిటల్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 28. ఇంటర్వ్యూ తేది ఫిబ్రవరి 5. వివరాలకు www.esic.nic.in
చూడొచ్చు.
అలహాబాద్ వర్సిటీలో టీచింగ్ పోస్టులు
వర్సిటీ ఆఫ్ అలహాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్(ఖాళీలు 157), అసోసియేట్ ప్రొఫెసర్(ఖాళీలు 84), ప్రొఫెసర్(ఖాళీలు 49) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వా నిస్తోంది. చివరి తేది మార్చి 10. వివరాలకు www.allduniv.ac.in చూడొచ్చు.
ఏఐఐపీఎంఆర్‌లో టీచింగ్ పోస్టులు
ముంబైలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలి టేషన్ (ఏఐఐపీఎంఆర్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 13. వివరాలకు www.aiipmr.gov.in చూడొచ్చు.
సెబీలో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్‌డ ఆఫ్ ఇండియా (సెబీ).. జనరల్, అఫీషియల్ లాంగ్వేజ్, ఐటీ విభాగాల్లో వికలాంగుల కోసం ఆఫీసర్ గ్రేడ్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 26. వివరాలకు www.sebi.gov.in చూడొచ్చు.
ఉద్యోగ సమాచారం
Published Fri, Feb 5 2016 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM
Advertisement
Advertisement