Employment news
-
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 10,190 ఖాళీలు
-
గ్రామీణ బ్యాంకుల్లో 10,190 ఖాళీలు
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీ పర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు (క్లరికల్), ఆఫీసర్లు (పీవో, ఆపై స్థాయి) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్–సీఆర్పీ ఆర్ఆర్బీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 10,190 1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)– 5249 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వయసు: 18–28 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది. 2. ఆఫీసర్ స్కేల్ –ఐ (అసిస్టెంట్ మేనేజర్)– 3312 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్మెంట్, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు. వయసు: 18– 30 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. 3. ఆఫీసర్ స్కేల్– ఐఐ (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు) – 1208. అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో రెండేళ్ల అనుభవం అవసరం. వయసు: 21– 32 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. 4. ఆఫీసర్ స్కేల్–ఐఐ (స్పెషలిస్ట్ ఆఫీసర్, సీఏ, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్, ఐటీ, అగ్రి కల్చర్ మేనేజర్)– 261. అర్హత: పోస్టును అనుసరించి ఆయా విభాగాల్లో డిగ్రీ/ పీజీ. సంబంధిత రంగంలో ఏడాది/ రెండేళ్ల అనుభవం. వయసు: 21– 32 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్‌సీలకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది. 5. ఆఫీసర్ స్కేల్– ఐఐఐ (సీనియర్ మేనేజర్)– 160 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఐటీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ విభాగాల్లో డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. బ్యాంకింగ్/ఫైనాన్షియల్ రంగంలో ఐదేళ్ల అనుభవం అవసరం. ఠి వయసు: 21– 40 (2018, జూన్ 1 నాటికి) ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులను కేవలం రాత పరీక్ష ద్వారా మాత్రమే భర్తీ చేస్తారు. ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం ఉంటుంది. రాత పరీక్షలను ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆఫీసర్ స్కేల్–ఐ పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్ అనే రెండు అంచెలతో కూడిన రాత పరీక్ష ఉంటుంది. ఆఫీసర్ స్కేల్–ఐఐ, ఆఫీసర్ స్కేల్–ఐఐఐ పోస్టులకు ఒకే రాత పరీక్ష (సింగిల్ లెవల్ ఎగ్జామినేషన్) ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ పద్ధతిలో. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100. దరఖాస్తుకు చివరితేదీ: జూలై 2, 2018. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: ఆఫీసర్ స్కేల్–ఐ– ఆగస్టు 11, 12, 18; ఆఫీస్ అసిస్టెంట్లకు ఆగస్టు 19, 25, సెప్టెంబర్ 1. ఆన్లైన్ మెయిన్ పరీక్ష తేదీలు: ఆఫీసర్స్ పోస్టులకు సెప్టెంబర్–30, ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకు అక్టోబర్–7. ఇంటర్వ్యూలు నవంబర్‌లో ఉంటాయి. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ibps.in, www.sakshieducation.com/Banks/Index.html, www.sakshieducation.com/Home.html చూడగలరు -
ఉద్యోగ ఖాళీలకు ప్రాచుర్యం: కేంద్రం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని స్థానిక ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్‌లు, ఉద్యోగ సమాచార పత్రికల్లో ప్రచురించాలని కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. 2017 కల్లా వివిధ విభాగాల్లో 2 లక్షల ఉద్యోగాల కల్పన యోచన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, మంత్రిత్వ శాఖలు రోజువారీ కూలీల నియామకాలను ఆపకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని డీపీఓటీ హెచ్చరించింది. -
ఉద్యోగ సమాచారం
పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులో స్టెనో పోస్టులు పశ్చిమ గోదావరి పీఆర్ఎల్. డిస్ట్రిక్ట్ కోర్టు (ఏలూరు).. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 20. వివరాలకు www.ecourts.gov.in/westgodavari చూడొచ్చు. కేరళ ఈఎస్ఐసీ ఆస్పత్రిలో ఖాళీలు కొల్లాం (కేరళ)లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) హాస్పిటల్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 28. ఇంటర్వ్యూ తేది ఫిబ్రవరి 5. వివరాలకు www.esic.nic.in చూడొచ్చు. అలహాబాద్ వర్సిటీలో టీచింగ్ పోస్టులు వర్సిటీ ఆఫ్ అలహాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్(ఖాళీలు 157), అసోసియేట్ ప్రొఫెసర్(ఖాళీలు 84), ప్రొఫెసర్(ఖాళీలు 49) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వా నిస్తోంది. చివరి తేది మార్చి 10. వివరాలకు www.allduniv.ac.in చూడొచ్చు. ఏఐఐపీఎంఆర్లో టీచింగ్ పోస్టులు ముంబైలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలి టేషన్ (ఏఐఐపీఎంఆర్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 13. వివరాలకు www.aiipmr.gov.in చూడొచ్చు. సెబీలో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ ఆఫ్ ఇండియా (సెబీ).. జనరల్, అఫీషియల్ లాంగ్వేజ్, ఐటీ విభాగాల్లో వికలాంగుల కోసం ఆఫీసర్ గ్రేడ్-ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 6. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 26. వివరాలకు www.sebi.gov.in చూడొచ్చు. -
ఉద్యోగాలే.. ఉద్యోగాలు
రాజమండ్రి సీటీఆర్‌ఐలో 34 పోస్టులు రాజమండ్రిలోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అయిన సెంట్రల్ టొబాకో రీసెర్చ ఇన్స్టిట్యూట్ (సీటీఆర్ఐ).. వివిధ విభాగాల్లో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 34. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 8. వివరాలకు www.ctri.org.in చూడొచ్చు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 200 పోస్టులు ఎయిర్పోర్ట అథారిటీ ఆఫ్ ఇండియా.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 200. దరఖాస్తుకు చివరి తేది జనవరి 30. వివరాలకు www.aai.aero చూడొచ్చు. ఎన్సీఈఆర్టీలో 70 పోస్టులు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ).. లోయర్ డివిజన్ క్లర్క పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 70. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 8. వివరాలకు www.ncert. nic.in చూడొచ్చు. ఏఐఐఏలో టీచింగ్ ఫ్యాకల్టీ న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ).. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 26. దరఖాస్తుకు చివరి తేది జనవరి 30. వివరాలకు www.ccras.nic.in చూడొచ్చు. జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో స్పెషల్ రిక్రూట్మెంట్ జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్). వికలాంగుల కోటాలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, హాస్పిటల్ సర్వీసెస్ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేది జనవరి 21. వివరాలకు www. aiimsjodhpur.edu.in చూడొచ్చు. ఇందిరాగాంధీ హెల్త్ అండ్ మెడికల్ సెన్సైస్లోస్పెషల్ రిక్రూట్మెంట్ షిల్లాంగ్‌లోని నార్త ఈస్టర్న ఇందిరా గాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సెన్సైస్.. వికలాంగుల కోటాలో వివిధ విభాగాల్లో మెడికల్ ఫిజిస్ట్, స్టాఫ్ నర్స, సీనియర్ స్టెనోగ్రాఫర్, మెడికల్ సోషల్ వర్కర్, హెల్త్ ఎడ్యుకేటర్, వార్డెన్/లేడీ వార్డెన్, టెక్నికల్ అసిస్టెంట్, హౌస్ కీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. దరఖాస్తుకు చివరి తేది జనవరి 24. వివరాలకు www.neigrihms.gov.in చూడొచ్చు. ఎంఆర్పీఎల్లో 96 పోస్టులు మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్).. వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ కెమిస్ట్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 96. దరఖాస్తుకు చివరి తేది జనవరి 12. వివరాలకు www.mrpl.co.in చూడొచ్చు. యునాని మెడిసిన్ ఇన్స్టిట్యూట్లో వివిధ పోస్టులు లక్నోలోని సెంట్రల్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన యోగా ఇన్స్ట్రక్టర్/థెరపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వాని స్తోంది. మొత్తం ఖాళీలు 17. దరఖాస్తుకు చివరి తేది జనవరి 16. వివరాలకు www.ccrum.net చూడొచ్చు. సీబీఆర్ఐలో రీసెర్చ ఇన్టర్నలు సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ (సీబీఆర్ఐ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ ఇన్టర్నల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 11. ఇంటర్వ్యూ తేది జనవరి 27, 28. వివరాలకు www. cbri.res.in చూడొచ్చు. ఐసీఏఆర్ అనుబంధ సంస్థలో వివిధ పోస్టులు ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ.. వివిధ విభాగాల్లో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, ఫాం మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 9. దరఖాస్తుకు చివరి తేది జనవరి 25. వివరాలకు www.spices.res.in చూడొచ్చు. సీఎంఎఫ్ఆర్ఐలో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు కొచ్చిలోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ.. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ ఇన్స్టి ట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ).. వివిధ విభాగాల్లో టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 13. దరఖాస్తుకు చివరి తేది జనవరి 31. వివరాలకు www.cmfri.org.in చూడొచ్చు. ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కాటన్ టెక్నాలజీలో 8 పోస్టులు ముంబైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ ఆన్ కాటన్ టెక్నాలజీ .. వివిధ విభాగాల్లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, లోయర్ డివిజన్ క్లర్క పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 8. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 8. వివరాలకు www.circot.res.in చూడొచ్చు. ఎన్‌ఏఆర్‌ఎల్‌లో 11 పోస్టులు చిత్తూరు జిల్లాలోని నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ లేబొరేటరీ (ఎన్ఏఆర్ఎల్).. వివిధ విభాగాల్లో పోస్ట్ డాక్టోరల్ ఫెలో, జూనియర్ రీసెర్చ ఫెలో, ప్రాజెక్ట్ జూనియర్ రీసెర్చ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 11. వివరాలకు www.narl.gov.in చూడొచ్చు. ఎయిర్ ఇండియాలో 534 పోస్టులు ఎయిర్ ఇండియా లిమిటెడ్.. సీనియర్ ట్రైనీ పైలట్స్ (పీ2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీలు 534. దరఖాస్తుకు చివరి తేది జనవరి 31. వివరాలకు www.airindia.com చూడొచ్చు. బాబా ఫరీద్ వర్సిటీలో టీచింగ్ పోస్టులు ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్.. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 58. దరఖాస్తుకు చివరి తేది జనవరి 21. వివరాలకు www.bfuhs.ac.in చూడొచ్చు. సెంట్రల్ వేర్‌హౌసింగ్‌లో 26 పోస్టులు సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్.. చెన్నై రీజియన్ పరిధిలో వేర్‌హౌస్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 26. దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 4. వివరాలకు www.cewacor.nic.in చూడొచ్చు. డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ మధ్యప్రదేశ్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీ.. వివిధ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 32. దరఖాస్తుకు చివరి తేది జనవరి 15. వివరాలకు www.dhsgsu.ac.in చూడొచ్చు. రూర్కీ ఐఐటీలో ఫ్యాకల్టీ పోస్టులు రూర్కీలోని ఐఐటీ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టు ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 20. దరఖాస్తుకు చివరి తేది జనవరి 20. వివరాలకు www.iitr.ernet.in చూడొచ్చు. -
కంప్యూటర్ల చికిత్సకు.. నెట్వర్క్ ఎక్స్పర్ట్!
కంప్యూటర్.. నేటి ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో కార్యకలాపాలు సజావుగా సాగడానికి కావాల్సిన ప్రధాన సాధనం. ప్రపంచవ్యాప్తంగా సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, అన్ని రకాల కమ్యూనికేషన్ దీనిద్వారానే సాగుతున్నాయి. కంప్యూటర్లు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. దీన్నే నెట్వర్క్ అంటారు. ఇందులో లోపాలు తలెత్తితే అపారమైన నష్టం జరుగుతుంది. లక్షలాది మంది జీవితాలు ప్రభావితమవుతాయి. కాబట్టి అవి సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. నెట్‌వర్క్‌లో లోపాలు ఏర్పడి కంప్యూటర్లు మొరాయిస్తే సరిచేసే నిపుణులే.. కంప్యూటర్ నెట్వర్క్ ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం దేశవిదేశాల్లో అత్యధికంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్న రంగం ఇదే. కంప్యూటర్లు కనిపించని కార్యాలయమే లేదనడం అతిశయోక్తి కాదు. అందుకనుగుణంగా నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. వీరికి రూ.లక్షల్లో వేతన ప్యాకేజీలు స్వాగతం పలుకుతున్నాయి. అవకాశాలు.. కోకొల్లలు నెట్వర్క్ నిపుణులు కంప్యూటర్ అప్లికేషన్లను రూపొందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సొంతంగా నెట్‌వర్క్‌ను డిజైన్ చేయాలి. అవసరాన్ని బట్టి హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్‌ను సృష్టించాలి. బ్యాంక్‌లు, మ్యానుఫ్యాక్చరింగ్, మీడియా సంస్థల్లో భారీసంఖ్యలో కంప్యూటర్లుంటాయి. వీటి నెట్వర్క్ సక్రమంగా ఉండేలా చూడడానికి నిపుణులను నియమిస్తున్నారు. నెట్వర్క్ ఎక్స్‌పర్ట్స్‌కు హెచ్‌సీఎల్, విప్రో వంటి ఔట్సోర్సింగ్ కంపెనీల్లో కొలువులున్నాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నెట్వర్క్ సిస్టమ్ సాఫ్ట్వేర్ డెవలపర్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేయొచ్చు. క్వాలిటీ అస్యూరెన్స్/టెస్టింగ్ ఆఫ్ నెట్వర్క్ ప్రోటోకాల్స్, రీసెర్చ్ ఇన్ నెట్వర్కింగ్లో సేవలందించొచ్చు. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ వీరి అవసరం అధికంగా ఉంది. 100 కంప్యూటర్లు ప్రతి ఉన్న కార్యాలయంలో నెట్వర్క్ నిపుణులు ఉండడం తప్పనిసరి. కావాల్సిన స్కిల్స్: కంప్యూటర్ నెట్వర్క్ నిపుణులకు శాస్త్రీయ దృక్పథం ఉండాలి. విశ్లేషణాత్మక ఆలోచనా ధోరణి అవసరం. సాంకేతిక సమస్యలను పరిష్కరించే నేర్పు తప్పనిసరి. తమ రంగానికి సంబంధించిన కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపన ఉండాలి. ఎప్పటికప్పుడు వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి. అర్హతలు: కంప్యూటర్ నెట్వర్క్ నిపుణులుగా మారాలంటే.. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన బీఈ/బీటెక్(కంప్యూటర్ సైన్స్) కోర్సు చదవాలి. కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారు కూడా కంప్యూటర్ నెట్వర్క్ నిపుణుడిగా మారొచ్చు. దీర్ఘకాలంలో ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవాలంటే ఎంటెక్ వంటి కోర్సులు పూర్తిచేయడం మంచిది. కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా, సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఉన్నాయి. వేతనాలు: ఐఐటీలో విద్యాభ్యాసం పూర్తిచేసిన నెట్వర్క్ ప్రొఫెషనల్‌కు ప్రారంభంలో నెలకు రూ.40 వేల వేతనం అందుతుంది. బీసీఏ/బీఎస్సీ చదివి ఏడాదిపాటు నెట్వర్క్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ పొందితే ప్రారంభంలో నెలకు రూ.10 వేల వేతనం అందుకోవచ్చు. సర్టిఫైడ్ కోర్సులు చదివితే రూ.20 వేల నుంచి రూ.25 వేల వేతనం లభిస్తుంది. రెండు మూడేళ్ల పని అనుభవం ఉన్న నెట్వర్క్ నిపుణులకు బహుళజాతి సంస్థల్లో ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వేతన ప్యాకేజీ దక్కుతుంది. ఈ రంగంలో సీనియారిటీ, పనితీరును బట్టి జీతభత్యాలుంటాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఏ ఉస్మానియా యూనివర్సిటీ; వెబ్సైట్: www.osmania.ac.in ఏ జేఎన్టీయూ-హైదరాబాద్; వెబ్సైట్: www.jntuh.ac.in ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)-వరంగల్ వెబ్సైట్: www.nitw.ac.in ఏ బిట్స్-పిలానీ; వెబ్సైట్: www.bitspilani.ac.in ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)-బాంబే, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్ వెబ్‌సైట్స్: www.iitb.ac.in, www.iitd.ac.in, www.iitm.ac.in, www.iitk.ac.in కాంపిటీటివ్ కౌన్సెలింగ్ డీఎస్సీ పరీక్షలో ‘మూలకాల వర్గీకరణ’ పాఠ్యాంశం నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? - ఎ.సంయుక్త, అవంతినగర్ గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ‘మూలకాల వర్గీకరణ’ పాఠ్యాంశం నుంచి సగటున 2 బిట్లు అడిగారు. ఈసారి కూడా కనీసం రెండు ప్రశ్నలు రావొచ్చు. ఈ పాఠ్యాంశంలో ముఖ్యంగా పరమాణు ధర్మాలు - వాటి క్రమం పీరియడ్లలో, గ్రూపుల్లో ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని పరిశీలించాలి. విస్తృత ఆవర్తన పట్టికను ఏయే ధర్మం ఆధారంగా వర్గీకరించారో తెలుసుకోవాలి. జడవాయువులు, ప్రాతినిధ్య మూలకాలు, పరివర్తన మూలకాలు, అంతర పరివర్తన మూలకాలు, వాటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసాలపై పట్టు సాధించాలి. పరమాణు పరిమాణం, అయనీకరణ శక్మం, ఎలక్ట్రాన్ అఫినిటీల ప్రమాణాలు, అత్యధిక, అత్యల్ప పరమాణు పరిమాణం, రుణ విద్యుదాత్మకతల మూలకాలను గుర్తుంచుకోవాలి. ఆవర్తన పట్టికను ఏయే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారో తెలుసుకోవాలి. లాంథనైడ్స, ఆక్టినైడ్సపై దృష్టి సారించాలి. ఇన్పుట్స్: ఎ.వి.సుధాకర్, సీనియర్ ఫ్యాకల్టీ పోటీ పరీక్షల్లో ‘భారతదేశ పర్వతాలు, కనుమలు’ అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? - ముత్యాల నవనీత, కంచన్ బాగ్ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ప్రధానంగా వింధ్య, సాత్పురా, ఆరావళి పర్వతాలు, వీటిలో ఎత్తయిన శిఖరాలు; పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఇవి కలిసే ప్రదేశం, వీటిలోని శిలలు; మాల్వా పీఠభూమి; ద్వీపకల్ప పీఠభూమిలో జీవజాలం... తదితరాలపై ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు గమనించవచ్చు. ఉదాహరణకు ‘తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి?’ అని అడిగారు. ఈ ప్రశ్న సులభమైందే అయినా చాలామంది తప్పులు చేశారు. దీనికి కారణం క్షుణ్నంగా అవగాహన పెంపొందించుకోకపోవడమే. ఈ టాపిక్‌లో అనేక అంశాల మధ్య దగ్గరి సంబంధం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వీటిని చదివేటప్పుడు భారతదేశ నైసర్గిక స్వరూపం పటాన్ని ముందుంచుకొని, ఒక అంశానికి, మరొక అంశానికి సంబంధాన్ని గుర్తుంచుకుంటూ పరిశీలనాత్మకంగా అధ్యయనం చేయాలి. పోటీ తీవ్రత పెరుగుతుండడంతో ఇవే అంశాలపై కఠినమైన ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంది. ఉదా: 1) పశ్చిమ కనుమలు ఏయే ప్రాంతాల్లో వ్యాపించి ఉన్నాయి? 2) వింధ్య పర్వతాల సరిహద్దులు ఏవి? గంగా- సింధూ మైదానంలో ఉన్న భూస్వరూపాల్లోని ఉపరితల వ్యత్యాసాలైన భాబర్, టెరాయ్, భంగర్, ఖాదర్ మొదలైన వాటిపై కూడా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి వీటన్నింటినీ ప్రత్యేక దృష్టితో చదవాలి. ఇన్పుట్స్: ముల్కల రమేశ్, సీనియర్ ఫ్యాకల్టీ త్వరలో కేంబ్రిడ్జి-ఇండియా సీనియర్ ఫెలోషిప్ నూతన రంగాల్లో భారత విద్యార్థుల భాగస్వామ్యంతో పరిశోధనలు కొనసా గిస్తామని యునెటైడ్ కింగ్డమ్(యూకే)లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ లెస్జెక్ బోరిసీవిజ్ తెలిపారు. ప్రతిభావంతులను ప్రోత్సహిం చేందుకు త్వరలో కేంబ్రిడ్జి-ఇండియా సీనియర్ ఫెలోషిప్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ ఫెలోషిప్ పొందడా నికి పోస్ట్ డాక్టోరల్ లెవల్ కంటే పైస్థాయి లోని స్కాలర్స్ అర్హులని పేర్కొన్నారు. ఎంపికైనవారు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పరిశోధనలు చేయొచ్చన్నారు. ప్రస్తుతం భారత్‌తో కలిసి 270 ప్రాజెక్ట్‌లు చేపట్టామని అన్నారు. ప్లాంట్ సైన్స్, ఫుడ్ సెక్యూరిటీ, నానో సైన్స్, ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ వంటి కొత్త రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నా మన్నారు. తమ వర్సిటీలో ప్రస్తుతం 250 మందికిపైగా భారత విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారని, కొన్నేళ్లుగా ఈ సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత్‌లో కేంబ్రిడ్జి వర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలను బోరిసీవిజ్ తోసిపుచ్చారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ అర్హతలు: మ్యాథమెటిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. రీసెర్చ్‌లో కనీసం రెండేళ్ల అనుభవం అవసరం. వయోపరిమితి: 35 ఏళ్లకు మించకూడదు టెక్నికల్ అసిస్టెంట్ అర్హతలు: బీఎస్సీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/జియాలజీ)తోపాటు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయోపరిమితి: 28 ఏళ్లకు మించకూడదు ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు: ఆన్లైన్లో పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి, పోస్టు ద్వారా పంపించాలి. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 17 హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: అక్టోబర్ 24 వెబ్సైట్: www.ngri.org.in బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంబీఏ బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎంబీఏ (జనరల్) స్పెషలైజేషన్: హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ సీట్ల సంఖ్య: 46 ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) సీట్ల సంఖ్య: 46 ఎంపిక: అకడమిక్ మెరిట్, క్యాట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31 వెబ్సైట్: http://bhu.ac.in/ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ సీట్ల సంఖ్య: 103 విభాగాలు: ఏరోనాటికల్, ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్, కంప్యూటర్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, ఇండస్ట్రియల్, మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెటలర్జీ, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఇంజనీరింగ్. కాలపరిమితి: ఏడాది వయసు: 25 ఏళ్లకు మించకూడదు. టెక్నీషియన్ (వొకేషనల్) అప్రెంటీస్‌షిప్ సీట్ల సంఖ్య: 35 విభాగాలు: అకౌంట్స్ అండ్ ఆడిటింగ్, బిల్డింగ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ టెక్నిక్స్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆఫీస్ మేనేజ్మెంట్, ఆఫీస్ స్టెనోగ్రఫీ, పర్చేజింగ్ అండ్ స్టోర్ కీపింగ్. కాలపరిమితి: ఏడాది అర్హతలు: ఇంటర్ (వొకేషనల్ గ్రూప్) లేదా తత్సమానం. వయసు: 23 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 16 వెబ్సైట్: www.hal-india.com -
ఆన్లైన్ జాబ్ అప్లికేషన్స్.. తప్పులను సరిదిద్దుకోండిలా!
టాప్ స్టోరీ: రోజూ వార్తాపత్రికల్లో, వెబ్సైట్లలో అనేక ఉద్యోగ ప్రకటనలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, మీడియా, మ్యానుఫ్యాక్చరింగ్, రియల్ ఎస్టేట్ కంపెనీలు కొలువుదీరిన హైదరాబాద్ వంటి సిటీలో.. ఉద్యోగాలకు కొదవలేదు. అయినా ఆన్లైన్లో ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా.. కంపెనీల నుంచి స్పందన ఉండటం లేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు రిప్లై రావాలంటే.. వెంటనే వ్యూహం మార్చాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల విషయంలో అభ్యర్థులు సాధారణంగా ఏడు పొరపాట్లు చేస్తుంటారని చెబుతున్నారు. వీటిని సరిదిద్దుకుంటే కోరుకున్న ఉద్యోగం సంపాదించడం కష్టమేమీ కాదని సూచిస్తున్నారు. దరఖాస్తు.. అసంపూర్ణం పూర్తి సమాచారం లేకుండా దరఖాస్తును పంపి, రిక్రూటర్స్‌కు శ్రమ కలిగిస్తే ఫలితం సున్నా. రోజూ వందలాది దరఖాస్తులను పరిశీలించేవారి సమయాన్ని హరించొద్దు. పూర్తి వివరాలు ఉన్న అప్లికేషన్లను చూసేందుకు వారు ఇష్టపడతారు. ముందు జాబ్ బోర్డులో మీ వివరాలు నమోదు చేయాలి. తర్వాత రెజ్యుమెను, కవర్ లెటర్‌ను అప్లోడ్ చేయాలి. విద్యార్హతలు, ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థ, గతంలో పనిచేసిన సంస్థ, పని అనుభవం, వ్యక్తిగత వివరాలను వరుస క్రమంలో ఇవ్వాలి. అన్నింటికంటే పెద్ద పొరపాటు ఏమిటంటే.. ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు తెలియజేయకపోవడం. సంస్థ కోరుకుంటున్న అన్ని అర్హతలు మీకుంటే.. మిమ్మల్ని సంప్రదిం చేందుకు వీలుండాలి కదా! కొందరు అభ్యర్థులు తాము కోరినంత జీతభత్యాలు ఇవ్వాలని, ఫలానా ప్రాంతంలోనే పని చేస్తామని షరతులు విధిస్తుంటారు. ఇవి దరఖాస్తులో తెలియజేయాల్సిన విషయాలు కావు. వేతనం అంకె దరఖాస్తులో కనిపిస్తే యాజమాన్యాలకు నచ్చకపోవచ్చు. తాము ఇవ్వాలనుకుంటున్న వేతనం కంటే ఎక్కువ మొత్తం దరఖాస్తులో కనిపిస్తే దాన్ని పక్కనపెట్టేస్తారు. సంస్థ మిమ్మల్ని సంప్రదించినప్పుడు మాత్రమే వీటిని ప్రస్తావించాలి. సూచనలు పాటించకపోవడం సంస్థలు ఉద్యోగ ప్రకటనలో కొన్ని సూచనలను ఇస్తుంటాయి. అభ్యర్థులు వాటిని తప్పనిసరిగా పాటించాలి. ఫోన్ ద్వారా తమను సంప్రదించాల్సిన అవసరం లేదు అని అంటే.. దానికి కట్టుబడి ఉండడమే ఉత్తమం. ఆన్లైన్లో మీ రెజ్యుమె సరైన సమాచారంతో, సరైన సమయానికి, సరైన వ్యక్తికి చేరగానే సరిపోదు.. మీరు సంస్థ సూచనలకు అనుగుణంగా నడుచుకున్నప్పుడే కోరుకున్న కొలువును దక్కించుకోగలుగుతారు. ఒకే రెజ్యుమె అన్నింటికీ సరిపోదు కొందరు అభ్యర్థులు ఒకే రెజ్యుమెను రూపొందించుకొని, అన్ని సంస్థలకు దాన్నే గ్రూప్ ఈ-మెయిల్స్ ద్వారా ఫార్వర్డ్ చేస్తుంటారు. ఇది ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. మొదట ఉద్యోగం గురించి అవగాహన పెంచుకోవాలి. వీటి ఆధారంగా రెజ్యుమెను తయారు చేసుకోవాలి. ఆ ఉద్యోగానికి మీరు సరిగ్గా సరిపోతారనే భావం రెజ్యుమే ద్వారా వెల్లడి కావాలి. తద్వారా మీకు ఉద్యోగంపై తగిన ఆసక్తి, ఇష్టం ఉన్నాయనే విషయం తెలుస్తుంది. అప్పుడే రిక్రూటర్స్‌కు మీపై సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. దరఖాస్తు త్వరగా ముందుకు కదులుతుంది. కొన్నిసార్లు సంస్థల తరఫున ప్లేస్మెంట్ ఏజెన్సీలు ఉద్యోగ ప్రకటనలను విడుదల చేస్తుంటాయి. అవి సంస్థ పేరును, వివరాలను బయటపెట్టవు. అలాంటప్పుడు ఉద్యోగంపై సమాచారం కోసం సదరు ఏజెన్సీని సంప్రదిస్తూ ఉండాలి. తొందరపాటు వద్దు మిగిలినవారి కంటే ముందే దరఖాస్తు చేస్తే ఉద్యోగం తప్పకుండా వచ్చేస్తుందని అనుకోవద్దు. తొందరపాటు కారణంగా దరఖాస్తులో తప్పులు దొర్లే అవకాశం ఉంటుంది. రెజ్యుమే, కవర్ లెటర్‌ను జతచేయడం మర్చిపోవద్దు. సరైన ఫార్మాట్లో లేని రెజ్యుమెలను పంపకూడదు. దరఖాస్తు పంపేముందు అన్నీ ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా సరిచూసుకున్న తర్వాతే పంపించాలి. రిక్రూటర్స్ దరఖాస్తులోని అంశాలనే పరిశీలిస్తారు తప్ప దాన్ని ఎప్పుడు పంపారనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వరు. అనవసర ఆర్భాటం రిక్రూటర్స్‌ను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తు విషయంలో ఆర్భాటం చేయొద్దు. దీనివల్ల ఎలాంటి ఫలితం ఉండకపోగా, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని గ్రహించాలి. కొందరు దరఖాస్తులకు రంగులు, హంగులు జోడిస్తుంటారు. అక్షరాల ఆకృతి, పరిమాణం(ఫాంట్) గురించి పట్టించుకోరు. ఇలాంటి అప్లికేషన్లు చూడటానికి ఇంపుగా ఉండవు. కాబట్టి అతిశయం వదులుకోవడం మంచిది. సాధారణ ఫార్మాట్లోనే దరఖాస్తును పంపాలి. ఇంకొందరైతే వ్యక్తిగత అభ్యర్థనలు, విజ్ఞప్తులను జతచేస్తారు. వీటివల్ల అభ్యర్థిపై రిక్రూటర్స్‌కు చిన్నచూపు ఏర్పడుతుందని తెలుకోండి. ఒక్కో దరఖాస్తును పరిశీలించేందుకు రిక్రూటర్స్ వెచ్చించే సమయం కొన్ని సెకన్లు మాత్రమే. అంత తక్కువ సమయంలో మీ గురించి తెలిపేలా దరఖాస్తును రూపొందించుకోవాలి. ఫాలోఅప్ చేయకపోవడం ఆన్లైన్లో దరఖాస్తును పంపగానే సరిపోదు. అది ఏ దశలో ఉందో తెలుసుకుంటూ ఉండాలి. అప్లికేషన్‌ను పంపిన తర్వాత వారం నుంచి 10 రోజుల్లోగా రిక్రూటర్స్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోతే.. ఒకసారి ఫాలోఅప్ చేయాలి. సంస్థను నేరుగా సంప్రదించాలి. అంతేతప్ప రోజూ ఈ-మెయిళ్లు పంపడం, ఫోన్లు చేయడం లాంటివి చేయొద్దు. మీ దరఖాస్తు అందినట్లు వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోతే వేరే జాబ్ పోర్టల్/ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ ద్వారా దరఖాస్తును మరోసారి పంపడానికి ప్రయత్నించండి. పాత కొలువును వదులుకోవడం మబ్బును చూసి కుండలో నీళ్లు ఒలకబోసుకోవడం తెలివైన లక్షణం కాదు. కొత్త ఉద్యోగం వస్తుందో రాదో తెలియకముందే పాత జాబ్‌కు రాజీనామా చేయొద్దు. కొత్త కొలువు వేట గురించి ప్రస్తుతం మీరు పనిచేస్తున్న సంస్థకు తెలియనివ్వకపోవడమే అన్నివిధాలా మంచిది. మరో విషయం.. పాత సంస్థ నుంచే కొత్త సంస్థను సంప్రదించడం, దరఖాస్తు పంపడం వంటి పొరపాట్లు అస్సలు చేయొద్దు. ఇలాంటివి చేస్తే యాజమాన్యానికి వెంటనే తెలిసిపోయేలా ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఆఫీసు బయటే చేసుకోవాలి. కొత్త కొలువు ఖాయమైన తర్వాతే రాజీనామా విషయాన్ని పాత సంస్థకు తెలియజేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ పంపేటప్పుడు పాటించాల్సినవి.. * ఉద్యోగ ప్రకటనలో ఇచ్చిన సూచనలను పాటించాలి * రిక్రూటర్స్ కోరిన సమాచారం తప్పనిసరిగా ఇవ్వాలి. * దరఖాస్తులో అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. అప్లికేషన్‌ను పూర్తిగా సరిచూసుకున్న తర్వాతే పంపించాలి. * రిక్రూటర్స్ సంప్రదించేందుకు వీలుగా ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి కాంటాక్ట్ సమాచారాన్ని దరఖాస్తులో పొందుపరచాలి. * అప్లికేషన్‌తో కవర్ లెటర్‌ను జతచేయాలి. * రెజ్యుమేను కూడా తప్పనిసరిగా జోడించాలి. * ఇప్పటిదాకా పనిచేసిన పాత సంస్థల్లో మీరు నిర్వహించిన విధులు, నిర్వర్తించిన బాధ్యతలు కాదు.. సాధించిన విజయాలను రెజ్యుమేలో పొందుపర్చాలి. * ఎక్కువ పేజీలున్న రెజ్యుమేకు ఎక్కువ విలువ ఉంటుందనుకోవద్దు. అందులో పొందుపర్చిన అంశాలకే విలువ ఉంటుంది కానీ పేజీలకు కాదు. అడ్డంకులను అధిగమించండి! ‘‘ఉద్యోగార్థులు రెజ్యుమె పంపడం దగ్గర్నుంచి ఆఫర్ లెటర్ అందుకునే వరకు జాగ్రత్తగా వ్యవహరించాలి. కొందరు అభ్యర్థులు పేజీల కొద్దీ రెజ్యుమెను తయారు చేసి పంపుతుంటారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. ఫ్రెషర్స్ అయితే ఒక్క పేజీలోనే తమ పూర్తి వివరాలతో కూడిన రెజ్యుమెను రూపొందించడం ప్రధానం. తప్పనిసరి పరిస్థితుల్లో పేజీన్నరకు మించకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రెషర్స్ నుంచి కంపెనీలు అకడమిక్ అర్హతలు, ప్రాజెక్టులు, ఇతర ప్రత్యేక నైపుణ్యాలనే కోరుకుంటాయి. అందుకే సాధ్యమైనంత తక్కువ సైజులో ఉండడం మంచిది. ముందుగానే అన్ని వివరాలతో కూడిన మాస్టర్ రెజ్యుమెను రూపొందించుకుని.. దాని ఆధారంగా ఉద్యోగ సంబంధిత అంశాలకే ప్రాధాన్యమిస్తూ మరో రెజ్యుమె తయారు చేసుకోవాలి. రెజ్యుమెలో రాసిన పదాల అర్థాలు తెలియక ఇంటర్వ్యూల్లో ఇబ్బంది పడేవారూ ఉంటారు. అందుకే రెజ్యుమెలో రాసే ప్రతి అంశంపై శ్రద్ధ ఉంచాలి. చాలామంది అభ్యర్థులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను నిర్లక్ష్యం చేస్తారు. అభ్యర్థుల వ్యక్తిగత నైపుణ్యాలతో పాటు సోషల్ మీడియా అంశాలను కూడా కంపెనీలు పరిశీలిస్తాయి. కాబట్టి అభ్యర్థులు తమ ఫేస్బుక్, లింక్డ్ఇన్ తదితర సోషల్ ప్రొఫైల్, ప్రవర్తన, కామెంట్లు, చర్చలపైనా సమతుల్యాన్ని పాటించాలి’’ - జి.ఆర్. రెడ్డి, ఫౌండర్ అండ్ చీఫ్ ఫెసిలిటేటర్, హ్యుసిస్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ -
విద్య ఉద్యోగ అవకాశాలు
ప్రవేశాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్, భువనేశ్వర్ పీహెచ్డీ ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు * యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, బయోఫిల్మ్ అండ్ బ్యాక్టీరియల్ ప్యాథోజెనెసిస్ * డెవలప్మెంట్ ఆఫ్ నావల్ ప్రమోటర్ విత్ ఎన్హాన్స్డ్ ఆక్టివిటీ * జెనెటిక్స్ అండ్ మాలిక్యులార్ ఎనాలిసిస్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్ * జీనోమిక్ ఇన్‌స్టెబిలిటీ అండ్ డిసీజెస్ * డ్రగ్ డిజైన్ అండ్ డిస్కవరి, బయోఇన్ఫర్మాటిక్స్ * వాస్క్యులర్ బయాలజీ అండ్ ట్యూ మర్ యాంజియోజెనెసిస్ అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 1 వెబ్సైట్: www.ils.res.in హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, లక్నో కింది కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కోర్సు: డిప్లొమా ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అర్హతలు: ఎంబీబీఎస్/బీడీఎస్/బీఫార్మసీ/ బీఎస్సీ(నర్సింగ్) ఉండాలి. వయసు: 35 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 20 వెబ్సైట్: www.sgpgi.ac.in 3 ఫెలోషిప్స్: సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీపీఆర్ఐ), బెంగళూరు రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కేటగిరీ: జూనియర్ రీసెర్చ్ ఫెలో/సీనియర్ రీసెర్చ్ ఫెలో విభాగాలు: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కాలపరిమితి: మూడేళ్లు అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్/మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. గేట్/నెట్లో అర్హత సాధించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 25 వెబ్సైట్: www.cpri.in 4 ఉద్యోగాలు: సీపీఆర్ఐ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీపీఆర్ఐ), బెంగళూరు తాత్కాలిక పద్ధతిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అసోసియేట్స్ అర్హతలు: మొదటి శ్రేణిలో బీఈ(మెకానికల్ లేదా సివిల్) ఉత్తీర్ణులై ఉండాలి. ఆటోక్యాడ్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూలై 16 వెబ్సైట్: www.cpri.in మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు.