అలరించిన వెస్లీకాలేజీ ఫెయిర్‌వెల్ షో | fairwell conducted in wesley college in secunderabad | Sakshi
Sakshi News home page

అలరించిన వెస్లీకాలేజీ ఫెయిర్‌వెల్ షో

Published Fri, Feb 13 2015 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

అలరించిన వెస్లీకాలేజీ ఫెయిర్‌వెల్ షో

అలరించిన వెస్లీకాలేజీ ఫెయిర్‌వెల్ షో

హైదరాబాద్‌ సిటీ : జానపదం, సాంస్కృతిక ప్రదర్శనలతో సికింద్రాబాద్ లోని వెస్లీ బాలికల జూనియర్ కళాశాల ఉర్రూతలూగింది. శుక్రవారం నిర్వహించిన ఫెయిర్‌వెల్ పార్టీ కార్యక్రమం సందర్శకులను ఆద్యంతం అలరించింది. వెస్లీ జూనియర్ కళాశాల సీనియర్ బాలికలకు జూనియర్స్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. నృత్యాలు, క్యాట్‌వాక్ జరుగుతున్నంత సేపు కళాశాల ఆడిటోరియం సహా విద్యార్థినుల కేరింతలు, చప్పట్లతో మార్మోగింది. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రిసిల్లా సుహాసిని మెరిట్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఫెయిర్వెల్ కార్యక్రమంలో లెక్చరర్లు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement