హాస్టల్ నుంచి విద్యార్థిని అదృశ్యం | Inter student missing | Sakshi
Sakshi News home page

హాస్టల్ నుంచి విద్యార్థిని అదృశ్యం

Published Fri, Jul 1 2016 7:57 PM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

Inter student missing

హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థిని కనిపించకుండాపోయిన ఘటన గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలానికి చెందిన ఎ.శ్రావణి (18) సికింద్రాబాద్‌లోని వెస్లీ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతూ కళాశాల ఆవరణలోని హాస్టల్ ఉంటోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఓ బ్యాగుతో సహా కాలేజీ నుంచి బయటికి వెళ్లిన శ్రావణి తిరిగి హాస్టల్‌కు రాలేదు. తల్లిదండ్రులకు సమాచారం అందించిన నిర్వాహకులు ఎటువంటి జాడ తెలియకపోవటంతో శుక్రవారం గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement