విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Published Tue, Jun 28 2016 6:43 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

Farmer killed by electric shock

విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మల్కారంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టీ గోవర్ధన్‌రెడ్డి (68) తనకున్న మూడెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటి లాగానే ఈ ఖరీఫ్‌లో వరి సాగు చేయడానికి సిద్ధమయ్యాడు.

 

నారు మడి తయారు చేయడానికి వీలుగా మడిని తడపాలని మంగళవారం సాయంత్రం బోరు మోటారు వద్దకు వెళ్లాడు. మోటారు ఆన్ చేయడానికి స్టార్టర్ డబ్బాను పట్టుకున్నాడు. అయితే.. అప్పటికే కరెంటు తీగలు డబ్బాకు తగిలి ఉండడంతో విద్యుదాఘాతానికి గురైన గోవర్ధన్‌రెడ్డి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. గమనించిన తోటి రైతులు వచ్చి చూసే సరికి ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో ఒక కుమారుడికి వివాహం కావాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement