మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష | farmer mla labbi venkataswamy gets 1-yr jail in cheque-bounce case | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష

Published Fri, May 1 2015 11:38 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష

మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష

హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో కర్నూలు జిల్లా నందికొట్కూరు  మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి ఏడాది జైలుశిక్ష పడింది.  హైదరాబాద్ ఎర్రమంజిల్ ఫాస్ట్ట్రాక్ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యవహారంపై గత ఆరేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. లబ్బి వెంకటస్వామితో పాటు జంగం గోపి, రమేష్ బండారికి కూడా కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా బండారి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీపై ఎస్.ఇబ్రహీం అనే వ్యక్తి వేసిన కేసులో తనను ప్రతివాదిగా చేర్చారంటూ లబ్బి వెంకటస్వామి గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement