వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పలువురు నేతలు, వివిధ రంగాల ప్రముఖుల చేరిక, ఆ సందర్భంగా తరలివస్తున్న వారితో పార్టీ అధినేత వైఎస్ జగన్ నివాసం కిటకిటలాడుతోంది. గురువారం నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, గురు రాఘవేంద్ర బ్యాంకు కోచింగ్ సెంటర్ స్థాపకులు దస్తగిరిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. వారికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నాయకులు శిల్వా చక్రపాణిరెడ్డి, సిదార్థరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా లబ్బి వెంకటస్వామి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంతృత్వ పోకడలకు పోతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంఓ నిరుద్యోగ యువత చాలా సమస్యలు ఎదుర్కొంటుందని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల సమస్యలు తొలుగుతాయని అన్నారు. నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సపోర్ట్ చేస్తానని వెల్లడించారు.