one year jail
-
కాలేజీకి వెళ్లొస్తుంటే లాగేసి ‘ఐ లవ్ యూ’..
ముంబయి: నలుగురిలో ఓ యువతి చేయిపట్టిలాగినందుకు 22 ఏళ్ల వ్యక్తికి ఏడాది జైలు శిక్ష పడింది. లైంగికపరమైన నేరాల నుంచి బాలికలకు ప్రత్యేక రక్షణ కల్పించే చట్టం(పోస్కో యాక్ట్) ద్వారా అతడికి ఈ శిక్ష ఖరారైంది. అయితే, నిత్యం అతడు ఆ యువతిని అనుసరిస్తూ చెడుగా ప్రవర్తించేవాడని, అసభ్యకరంగా మాట్లాడేవాడంటూ చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయినందున ఆ ఆరోపణలు మాత్రం కోర్టు కొట్టేసింది. అలాగే, అతడిపై కేసు నమోదైన అక్టోబర్ 29, 2015 నుంచి బెయిల్ పొందిన అక్టోబర్ 19, 2016వరకు జైలులోనే గడిపాడు. తాజాగా కోర్టు కూడా ఏడాదికాలం మాత్రమే శిక్ష వేయడంతో అతడి శిక్షకాలం దాదాపు పూర్తయినట్లు ప్రకటించే అవకాశం ఉంది. కోర్టు విచారణ ప్రకారం 2015 అక్టోబర్ 6న ఖడ్సే అనే యువకుడు 16 ఏళ్ల యువతి తన స్నేహితురాలితో కలిసి కాలేజీకి వెళ్లొస్తుండగా మధ్యలో వారిని అడ్డుకున్నాడు. ఆమెతో పలు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడాడు. అలా మాట్లాడుతూనే అనూహ్యంగా ఆమె చేయి పట్టిలాగి ‘ఐ లవ్ యూ’ అనేశాడు. దీంతో ఏడ్చుకుంటూ ఆ అమ్మాయి ఇంటికెళ్లింది. స్నేహితురాలు ఆమె తల్లికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. దీంతో వారు వెళ్లి ఖడ్సే తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పి మందలించే ప్రయత్నం చేశారు. అయినా.. వాళ్లు వినకుండా ఎదురుతిరిగిన పరిస్థితి ఎదురవ్వడంతో భయాందోళనకు గురైన ఆ యువతి కాలేజీకి వెళ్లడం మానేసింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసు విచారణను నెమ్మదిగా చేసిన పోలీసులపై కోర్టు అక్షింతలు వేసింది. -
చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు
గుత్తి: చెక్ బౌన్స్ కేసులో దోషి హెచ్‌సీ గురు ప్రసాద్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఏడీజే కే.వెంకటరమణారెడ్డి బుధవారం తీర్పు చెప్పారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. బళ్లారికి చెందిన హెచ్‌సీ గురుప్రసాద్ గుంతకల్లుకు చెందిన నూర్ మహ్మద్‌ల మధ్య వ్యాపార లావాదేవీలున్నాయి. నూర్ మహ్మద్‌కు గురుప్రసాద్ ఏడున్నర లక్షలు బాకీ పడ్డాడు. బాకీ తీర్చడం కోసం నూర్మహ్మద్కు గురుప్రసాద్ చెక్ ఇచ్చాడు. అయితే ఆ చెక్ బౌ¯Œ్స అయింది. దీంతో నూర్‌మహ్మద్ గుంతకల్లు పోలీసు స్టేష¯ŒSలో కేసు పెట్టాడు. పలు విచారణల అనంతరం కేసు బుధవారం తుది విచారణకు వచ్చింది. నేరం రుజువు కావడంతో గురు ప్రసాద్‌కు ఏడాది శిక్షతో పాటు ఏడున్నర లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని ఏడీజే తీర్పు చెప్పారు. ప్రాసిక్యూష¯ŒS తరఫున ఎంవీ మహేష్‌కుమార్ వాదించారు. -
ట్రావెల్ సంస్థ యజమానికి జైలు
పాలకొల్లు టౌన్ : భక్తులను హరిద్వార్ తీసుకెళ్తానని నమ్మించి సొమ్ము తీసుకుని మోసం చేసిన కేసులో విశాఖపట్నానికి చెందిన యతిరాజా ట్రావెల్ సంస్థ యజమాని రామానుజం వెంకటరమణకు ఏడాది జైలు, రూ.5వేల జరిమానా విధిస్తూ శుక్రవారం పాలకొల్లు కోర్టు మేజిస్ట్రేట్ ఎ.నాగశైలజ తీర్పుచెప్పారు. 2013 సెప్టెంబర్‌లో పట్టణానికి చెందిన మామిడి వెంకటేశ్వరరావు (బాబు)తోపాటు 23మంది హరిద్వార్ వెళ్లడానికి ట్రావెల్ సంస్థ యజమాని వెంకటరమణకు ఒక్కొక్కరూ రూ.13వేలు చొప్పున చెల్లించారు. ఢిల్లీ వరకు టికెట్లు తీశారు. అక్కడి నుంచి హరిద్వార్ వెళ్లేందుకు ట్రావెల్ యజమాని టికెట్లు తీయకుండా మోసం చేశారు. దీనిపై మామిడి వెంకటేశ్వరరావు పాలకొల్లు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై సుబ్బారావు కేసు నమోదు చేశారు. -
దేవుడు లేడన్నందుకు ఏడాది జైలు
'దేవుడు లేడు. బైబిల్ కథలన్నీ పుక్కిటి పురాణాలే' అని రష్యాకు చెందిన హేతువాది 38 ఏళ్ల విక్టర్ క్రష్ణోవ్ వ్యాఖ్యానించినందుకు ఆయనకు ఏడాది జైలుశిక్ష పడనుంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటివి కూడా కావు. 2014లో యూరోపియన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్ 'వీకే డాట్ కామ్'లో చేసినవి. కేసవుతుందని తెలసి వెంటనే ఆ వ్యాఖ్యలను సైట్ నుంచి వెంటనే తొలగించారు కూడా. 2014లోనే కేసు దాఖలైనా, సోమవారం నుంచే విచారణ కొనసాగుతోంది. విక్టర్ తన వ్యాఖ్యలతో మత విశ్వాసకుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆయనపై కేసు దాఖలైంది. అప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను రష్యా ప్రభుత్వం పెద్దగా పట్టించుకునేది కాదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న అభ్యంతరకర కథనాలపై కేసులు దాఖలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంతోమంది కేసులు ఎదుర్కొంటున్నారు. దేవుడు లేడన్న విషయం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పినా.. తనపై కేసు దాఖలు చేయడం ఏంటని విక్టర్ ప్రశ్నిస్తున్నారు. అయినా సోషల్ మీడియా తన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడం ఏంటని ఆయన అన్నారు. వాస్తవానికి సోషల్ మీడియా గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి కేసులు పెడుతోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. విక్టర్‌కు ఏడాది జైలుశిక్ష తప్పదని.. ఒకటి, రెండు రోజుల్లో తీర్పు వెలువడుతుందని న్యాయవర్గాలు తెలియజేస్తున్నాయి. -
కుక్కను కరిచి.. కనుగుడ్లు పీకి..
న్యూయార్క్: ఇదొక ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఊహించుకోవడానికే జుగుప్సకరంగా అనిపించే సన్నివేశం. ఇప్పటి వరకు కుక్కలు మనుషులను కరవడం చూశాంగానీ.. ఓ మనిషే కుక్కని కరిస్తే.. అది కూడా నరకం కనిపించేంతదారుణంగా కనుగుడ్లు పీకేసేంతగా అయితే.. అమెరికాలోని పామ్ బీచ్ లో ఇలాగే చోటుచేసుకుంది. డేవిడ్ ఈడ్జెల్ (37) అనే వ్యక్తి తన తల్లి ఎంతో ప్రేమగా చూసుకునే షియా జూ అనే బుజ్జి కుక్కను అమాంతం చేతిలోకి తీసుకొని కసిగా కొరికాడు. దాని కనుగుడ్లు పీకేశాడు. ఆ సమయంలో అతడు ఒళ్లు తెలియని విధంగా మద్యం మత్తులో ఉన్నాడు. ఓ మూగ ప్రాణిని హింసించిన ఫలితంగా అతడు కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఈ శిక్ష పడినందుకు అతడి తల్లి మిషెలీ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది. అతడు తాగిన మత్తులో చేసిన ఘోరానికి తగిన శిక్ష పడింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఎంతో ప్రేమగా జూను పెంచుకున్నానని, దానిపట్ల డేవిడ్ అంత క్రూరంగా ప్రవర్తిస్తాడని ఊహించలేదని చెప్పింది. డేవిడ్‌ను మద్యం నుంచి, కోపం నుంచి విముక్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసు విచారణ దాదాపు ఒక రోజంతా చేయడం కూడా ఆశ్చర్యకరం. ముందు కుక్కే అతడిని కరిచిందని, ఆ తర్వాతే తన క్లైంట్ దానిని కరిచాడని న్యాయవాది డేవిడ్ తరుపున వాధించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం డేవిడ్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. -
మాజీ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష
హైదరాబాద్ : చెక్ బౌన్స్ కేసులో కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి ఏడాది జైలుశిక్ష పడింది. హైదరాబాద్ ఎర్రమంజిల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చింది. మెదక్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యవహారంపై గత ఆరేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. లబ్బి వెంకటస్వామితో పాటు జంగం గోపి, రమేష్ బండారికి కూడా కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా బండారి కన్స్ట్రక్షన్స్ కంపెనీపై ఎస్.ఇబ్రహీం అనే వ్యక్తి వేసిన కేసులో తనను ప్రతివాదిగా చేర్చారంటూ లబ్బి వెంకటస్వామి గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే.