కుక్కను కరిచి.. కనుగుడ్లు పీకి.. | Man bites dog and may face year in jail for it in Palm Beach County | Sakshi
Sakshi News home page

కుక్కను కరిచి.. కనుగుడ్లు పీకి..

Published Wed, Nov 4 2015 2:46 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

కుక్కను కరిచి.. కనుగుడ్లు పీకి.. - Sakshi

కుక్కను కరిచి.. కనుగుడ్లు పీకి..

న్యూయార్క్: ఇదొక ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఊహించుకోవడానికే జుగుప్సకరంగా అనిపించే సన్నివేశం. ఇప్పటి వరకు కుక్కలు మనుషులను కరవడం చూశాంగానీ.. ఓ మనిషే కుక్కని కరిస్తే.. అది కూడా నరకం కనిపించేంతదారుణంగా కనుగుడ్లు పీకేసేంతగా అయితే.. అమెరికాలోని పామ్ బీచ్ లో ఇలాగే చోటుచేసుకుంది. డేవిడ్ ఈడ్జెల్ (37) అనే వ్యక్తి తన తల్లి ఎంతో ప్రేమగా చూసుకునే షియా జూ అనే బుజ్జి కుక్కను అమాంతం చేతిలోకి తీసుకొని కసిగా కొరికాడు. దాని కనుగుడ్లు పీకేశాడు. ఆ సమయంలో అతడు ఒళ్లు తెలియని విధంగా మద్యం మత్తులో ఉన్నాడు. ఓ మూగ ప్రాణిని హింసించిన ఫలితంగా  అతడు కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఈ శిక్ష పడినందుకు అతడి తల్లి మిషెలీ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది.

అతడు తాగిన మత్తులో చేసిన ఘోరానికి తగిన శిక్ష పడింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఎంతో ప్రేమగా జూను పెంచుకున్నానని, దానిపట్ల డేవిడ్ అంత క్రూరంగా ప్రవర్తిస్తాడని ఊహించలేదని చెప్పింది. డేవిడ్ను మద్యం నుంచి, కోపం నుంచి విముక్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ కేసు విచారణ దాదాపు ఒక రోజంతా చేయడం కూడా ఆశ్చర్యకరం. ముందు కుక్కే అతడిని కరిచిందని, ఆ తర్వాతే తన క్లైంట్ దానిని కరిచాడని న్యాయవాది డేవిడ్ తరుపున వాధించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం డేవిడ్ కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement