హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడ ఎస్బీఐలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతు సర్వర్ రూమ్ను వ్యాపించాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు ఫిర్యాదు చేశారు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పివేశారు.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న బ్యాంక్ ఉన్నతాధికారులు అప్పటికే బ్యాంక్ వద్దకు చేరుకున్నారు. అయితే బ్యాంక్లోని కంప్యూటర్లు, ఫర్నీచర్, దస్త్రాలన్ని అగ్నికి ఆహుతయ్యాయని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని బ్యాంక్ అధికారులు భావిస్తున్నారు.