రెండు మత్స్య కళాశాలల ఏర్పాటు | Fisheries colleges establishing in telangana says by Minister Talasani Srinivas Yadav | Sakshi
Sakshi News home page

రెండు మత్స్య కళాశాలల ఏర్పాటు

Published Thu, Jan 5 2017 2:47 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

రెండు మత్స్య కళాశాలల ఏర్పాటు

రెండు మత్స్య కళాశాలల ఏర్పాటు

మంత్రి తలసాని వెల్లడి 
 
సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్రంలో 2 మత్స్య కళాశాలలు, మత్స్య కార్పొరేషన్‌ను ఏర్పా టు చేస్తామని పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. మత్స్య పారిశ్రామిక సహకార, మత్స్య సం ఘాల నాయకులు, సభ్యులు బుధవారం ఆయన్ని కలసి సన్మానించారు. హైదరాబా ద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, రంగా రెడ్డి, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల నుంచి మత్స్యకార సంఘాల నాయకులు భారీగా తరలివచ్చారు.

తలసాని మాట్లాడు తూ.. గతంలో లేని విధంగా దాదాపు 40 కోట్ల చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కు తుందన్నారు. గంగపుత్రులు, ముదిరాజ్‌ లకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ వారి కుటుంబాలలో వెలుగులు నింపేందుకు కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మం తరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement