
పాతబస్తీలో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
హైదరాబాద్: నగరంలో పాతబస్తీ పరిధిలోని పహాడీ షరీఫ్లో ఐదేళ్ల బాలికను ఇంటినుంచి అపహరించి లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పహాడీ షరీఫ్ పీఎస్ పరిధిలో బాలిక ఇంటికి సమీపంలో ఉండే ఓ మైనరే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈనెల 7న జరిగిన ఈ దారుణంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ దర్యాప్తుమాత్రం కొనసాగకపోవడం గమనార్హం.
పైగా ఫిర్యాదును ఉపసంహరించుకోవాల్సిందిగా బాలిక తల్లిదండ్రులను కొందరు వ్యక్తులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేక్ గ్యాంగ్ ఆగడాలు వెలుగులోరావడం, ఇప్పుడు ఐదేళ్ల బాలికపై అత్యాచారం ఘటనతో పహాడీ షరీఫ్లో నివసిస్తోన్న మహిళలు, చిన్నారుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.