మోర్తాడ్(నిజామాబాద్ జిల్లా): తెలంగాణ ప్రాం త కార్మికులు నేరుగా కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలను నడిపేందుకు కువైట్‌లోని విదేశాం గశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదన చేశారు. ఇప్పటివరకు కువైట్‌కు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో కార్మికులు ఎక్కువ వ్య యం చేసి, ఇతర దేశాల మీదుగా అక్కడికి వెళ్లేవారు. నేరుగా విమాన సర్వీసు ఉంటే చార్జీల ఖర్చు తగ్గుతుంది. శుక్రవారం కువైట్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న తెలంగాణ కార్మికులు శంషాబాద్ నుంచి నేరుగా కువైట్‌కు లేవనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కువైట్‌కు వెళ్లాలంటే అబుదాబి, దుబాయ్, మస్కట్ ఇతరత్రా గల్ఫ్‌దేశాల మీదుగా వెళ్లాల్సివస్తుందని వివరించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు అయిన తరువాత కార్మికులు ఇక్కడి నుంచి వెళ్లడానికి ఆసక్తిని చూపుతున్నారు. కువైట్‌కు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో ఏర్పడుతున్న ఆర్థిక భారం గురించి కార్మికులు విదేశాంగ ఉన్నతాధికారుల కు వివరించడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు. కువైట్‌కు నేరుగా విమాన సర్వీసును ప్రారంభించే ఏర్పాట్లు జరుగనున్నాయని నిజామాబాద్ జిల్లా ఏర్గట్లకు చెందిన ఆనందం జ్ఞాణేశ్వర్ ‘సాక్షి’కి ఫోన్‌లో వివరించారు.
శంషాబాద్ నుంచి కువైట్‌కు విమానం
Published Sun, Sep 28 2014 12:39 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM
Advertisement
Advertisement