ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణరెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణరెడ్డి డిమాండ్ చేశారు. కేసులకు తాము భయపడేది లేదని, ఇప్పటికైనా కేసీఆర్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఆయన గురువారమిక్కడ హితవు పలికారు. తెలంగాణ వద్దు...ప్యాకేజీ ముద్దు అని తాము ఎన్నడు అనలేదని గండ్ర పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ నేతలు సన్నాసులంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.