
సింగిల్‌హ్యాండ్ మహేశ్..
తెలంగాణ వీరాభిమాని.. ఉద్యమ సమయంలో 10 జిల్లాల్లో బైక్‌పై యాత్ర చేసిన ఘనుడు ఇతడు. పేరు మహేశ్. శామీర్‌పేటకు చెందిన ఇతడికి ఒక చేయి లేదు. అయినా సరే బైక్‌ను మాత్రం పరిగెత్తించగలడు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తన బైక్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీని పెట్టుకుని 150 డివిజన్ల పర్యటనకు శ్రీకారం చుట్టాడు.
ఇప్పటికి 60 డివిజన్లు చుట్టేసిన మహేష్ అక్కడి టీఆర్‌ఎస్ అభ్యర్థులను కలిశాడు. అన్ని ఖర్చులు సొంతంగానే భరిస్తున్నాడు. బుధవారం జగద్గిరిగుట్టలో ‘సాక్షి’ కెమెరాకు చిక్కాడు.