సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది జూలై 14 నుంచి 21 వరకు జరిగే పుష్కరాల్లో దాదాపు 3 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన సంగతి తెలిసిందే. పుష్కరాలపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం. రూ. 500 కోట్లతో భక్తులకు సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. మంగళవారం సచివాల యంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నేతత్వంలో నిర్వహించిన మంత్రివర్గ ఉపసం ఘం సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య తోపాటు మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, జోగురామన్న, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మహా కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహించాలని తీర్మానించారు. పదిరోజుల్లో టెండర్లు ఆహ్వానించి, పుష్కరాలకు నెలరోజులు ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు సూచించామన్నారు. ఘాట్‌లన్నింటికీ జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి అనుసంధానం కల్పిస్తూ రహదారులు నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ శాఖకు రూ. 206 కోట్లు, పంచాయ తీ రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణకు రూ. 60 కో ట్లు వెచ్చించనున్నారు.
పారదర్శకంగా పనులు...
వైద్య, ఆరోగ్య, విద్యుత్ శాఖల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరినట్టు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. పుష్కర పనుల టెండర్లలో సంపూర్ణ పారదర్శకత పాటించి పూర్తి నాణ్యతతో పనులు చేపడతామని ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. బాసర, ధర్మపురి, భద్రాచలం, కాళేశ్వరం ఘాట్‌ల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని, వాటిపై ప్రత్యేక దష్టి సారించాలని అధికారులకు ఉపసంఘం సూచించింది.
వైద్య సేవలకు రూ. 2.51 కోట్లు
భక్తులకు వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం రూ. 2.51 కోట్లు కేటాయించింది. ఆయా జిల్లాల్లో నిర్మించనున్న ఘాట్ల వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తారు. ఇం దుకోసం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ సురేష్‌చందా నేతత్వంలో కమిటీ ఏర్పడింది.
పుష్కరాల పనులకు రూ. 500 కోట్లు
Published Wed, Dec 24 2014 3:04 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement