ఫంక్షన్‌కు వెళ్లొచ్చేసరికి...
జవహర్‌నగర్: ఫంక్షన్‌కు వెళ్లొచ్చేలోగా దొంగలు తాళం పగులగొట్టి ఇల్లు గుల్ల చేశారు. 32 తులాల బంగారు నగలు, యూఎస్ డాలర్లు, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. దమ్మాయిగూడ అంజనాద్రీనగర్‌లో శనివా రం అర్ధరాత్రి ఈ భారీ చోరీ జరిగింది. జవహర్‌నగర్ సీఐ వెంకటగిరి కథనం ప్రకారం.. అంజనాద్రీనగర్ నివాసి నాగే శ్వరరావు బేగంపేట్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజర్. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. నాగేశ్వరరావు దంపతులు శనివారం సాయంత్రం ఇంటికి తాళం వేసి సరూర్‌నగర్‌లో ఉండే స్నేహితుడి ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లారు.
ఆదివారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం విరగ్గొట్టి ఉంది. ఆందోళనకు గురైన వారు లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. అందులోని సామగ్రి మంచంపై చిందరవందరగా పడి ఉంది. బీరువాలో దాచిన 32 తులాల బంగారు నగలు, రూ.30 వేల నగదుతో పాటు 1000 యూఎస్ డాలర్లు కనిపించలేదు. నాగేశ్వరారవు సమాచారం మేరకు డీఐ గిరీష్‌రావు, క్రైం ఎస్‌ఐ రవి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు.
పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి దమ్మాయిగూడ చౌరస్తా వరకు వె ళ్లి ఆగిపోయింది. కాగా, చోరీ జరిగిన ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లోని వీడియో ఫుటేజీ సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నాగేశ్వరరావు దంపతులు పెళ్లికి వె ళ్లడాన్ని గమనించిన దొంగలు శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
కిటికీ గ్రిల్ తొలిగించి...
గౌతంనగర్: దొంగలు ఓ ఇంట్లో చొరబడి పది తులాల బంగారు ఆభరణాలు, రూ. 12 వేల నగదు దోచుకెళ్లారు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనం జరిగింది. పోలీసులు, బాధితుల ప్రకారం... ప్రైవేట్ ఉద్యోగం చేసే బి.నరేందర్ ఈస్ట్ ఆనంద్‌బాగ్ ఆకుల నర్సింగ్‌రావునగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం తెల్లవారు జామున నరేందర్ ఇంట్లో గుర్తుతెలియని దొంగలుచొరబడి ప్రధాన ద్వారం పక్కన ఉన్న కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి ప్రవేశించి బీరువాలోని పది తులాల బంగారు ఆభరణాలు, రూ.12 వేల నగదు, రెండు సెల్‌ఫోన్లను తీసుకుని మరిన్ని వస్తువులను దొంగలించడానికి బీరువాలో వెతుకుతుండగా అలజడి విన్నకుటుంబసభ్యులు కేకలు వేయడంతో దొంగలు అప్పటికే తీసుకున్న సొత్తు తీసుకొని పారిపోయారు. నరేందర్ వెంటనే 100కు సమాచారం అందించగా మల్కాజిగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నరేందర్ ఇంటిముందు ఉన్న మరో ఇంట్లో ఒక సెల్‌ఫోన్, టైటాన్ వాచ్‌ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.
గోల్డ్ కొట్టేశారు..
Published Mon, Mar 23 2015 2:06 AM | Last Updated on Sun, Sep 2 2018 3:44 PM
Advertisement
Advertisement