గ్రీన్ కార్పెట్‌తో ‘గ్లోబల్’కు కాలేయం తరలింపు
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు వారి బంధువులు ముందుకు రాగా.. లివర్‌ను గ్రీన్‌కార్పెట్‌తో హైదరాబాద్ లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించి ఓ వ్యక్తికి అమర్చారు. విశాఖపట్నం నివాసి సత్యనారాయణ (53) ఈ నెల 26న రోడ్డుప్రమాదానికి గురవగా.. అక్కడి సెవెన్‌హిల్స్ హాస్పిటల్‌కు తరలించారు. 27న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
జీవన్‌దాన్ చైర్మన్, ఎన్టీఆర్ వర్సిటీ వీసీ డాక్టర్ టి.రవిరాజు, చీఫ్ ట్రాన్స్‌ప్లాంట్ కో ఆర్డినేటర్ కష్ణమూర్తిల సహకారంతో అవయవదానం చేసేందుకు వారి బంధువులు ముందుకు రాగా మంగళవారం తెల్లవారు జామున 3.30 నిమిషాలకు గ్లోబల్ హాస్పిటల్స్ డాక్టర్లు మాథ్యూ జేకబ్, డాక్టర్ రాఘవేంద్ర, మురగన్ రాజన్నల బృందం అవయవాలను శరీరం నుంచి వేరు చేశారు. ఒక కిడ్నీని సెవెన్‌హిల్స్ హాస్పిటల్‌కు, మరో కిడ్నీని విశాఖపట్నం కేర్ హాస్పిటల్‌కు తరలించారు.
లివర్‌ను గ్రీన్ కార్పెట్ సాయంతో లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించారు. దీంతో నగరంలో నివాసముండే 63 ఏళ్ల వ్యక్తికి లివర్‌మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించినట్లు గ్లోబల్ హాస్పిటల్స్ డాక్టర్ హీరేంద్రనాథ్ తెలిపారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల పోలీసులు లివర్ తరలించే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడటం వల్లే సకాలంలో హాస్పిటల్‌కు లివర్‌ను తరలించగలిగామని తెలిపారు.