గురుకుల పరీక్షల షెడ్యూలు జారీ | Grievance exam schedule issued | Sakshi
Sakshi News home page

గురుకుల పరీక్షల షెడ్యూలు జారీ

Published Wed, Aug 9 2017 2:53 AM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM

గురుకుల పరీక్షల షెడ్యూలు జారీ

గురుకుల పరీక్షల షెడ్యూలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: న్యాయ వివాదాలతో ఇటీవల ఆగిపోయిన గురుకులాల్లోని వివిధ పోస్టుల రాత పరీక్షల తేదీలను (రివైజ్డ్‌ షెడ్యూలు) టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. కోర్టు వివాదం తాత్కాలికంగా సమసిపోవడం, పరీక్షల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ లభించడంతో తాజా షెడ్యూలును జారీ చేసింది. గురుకులాల్లో పోస్టులను మహిళలకే కేటాయించడాన్సి సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్షలు ఆగిపోయాయి.

తాజాగా కోర్టు స్టే ఎత్తివేయడంతో పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈ నెల 27, 28 తేదీల్లో పీజీటీ లాంగ్వేజెస్‌ పోస్టులకు, సెప్టెంబర్‌ 3, 4 తేదీల్లో టీజీటీ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించేలా గతంలో జారీ చేసిన షెడ్యూలు ప్రకారం రాత పరీక్షలు ఉంటాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement