సీఎం సాహసోపేత నిర్ణయం: గువ్వల | guvvala balaraju priced to cm kcr | Sakshi
Sakshi News home page

సీఎం సాహసోపేత నిర్ణయం: గువ్వల

Published Fri, Oct 7 2016 1:57 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

సీఎం సాహసోపేత నిర్ణయం: గువ్వల - Sakshi

సీఎం సాహసోపేత నిర్ణయం: గువ్వల

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటవుతున్నాయంటే అది కేవలం సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లేనని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఇంకా కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలసి తెలంగాణ భవన్‌లో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు.

మహబూబ్‌నగర్‌లో నాల్గో జిల్లాగా గద్వాలను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ నిర్ణయంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. సీఎంను కలిసే అవకాశం రావ డం లేదన్న ఎమ్మెల్యే వంశీ చంద్‌రెడ్డిపై మండిపడ్డారు. కలిసే అవకాశం ఉన్నా ప్రతిపక్షాలు అడ్డంగా మాట్లాడుతున్నాయన్నారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేస్తున్నందుకు సీఎంకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement