కర్మన్‌ఘాట్‌లో హనుమాన్‌ శోభాయాత్ర | hanuman shobha yatra in karmanghat | Sakshi
Sakshi News home page

కర్మన్‌ఘాట్‌లో హనుమాన్‌ శోభాయాత్ర

Published Tue, Apr 11 2017 12:42 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

hanuman shobha yatra in karmanghat

హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ఘాట్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి హనుమాన్‌ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో రెండు వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు బందోబస్తు చేపట్టారు. కర్మన్‌ఘాట్, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్ చెరువు కట్ట, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్ల మీదుగా నగరంలోకి ప్రవేశించనున్నది. భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement