ప్రతిపక్షాలపై మంత్రి తీవ్ర మండిపాటు | Harish Rao fire on oppositions | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాలపై మంత్రి తీవ్ర మండిపాటు

Published Sun, Mar 27 2016 8:17 PM | Last Updated on Wed, Sep 5 2018 9:52 PM

ప్రతిపక్షాలపై మంత్రి తీవ్ర మండిపాటు - Sakshi

ప్రతిపక్షాలపై మంత్రి తీవ్ర మండిపాటు

హైదరాబాద్: ప్రాజెక్టుల రీడిజైన్ పై ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితమని రాష్ట్రమంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైన్ అంశంపై వస్తున్న విమర్శలపై ఆదివారం రాత్రి ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ... అఖిలపక్ష సమావేశాలు పెట్టి పసలేని ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.

మహారాష్ట్రతో టీఆర్ఎస్ ప్రభుత్వం రాజీపడిందని ప్రజలను నమ్మించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాకు తెలంగాణ ప్రజల హక్కులే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు తమ మైండ్ సెట్ మార్చుకోవాలని హరీష్ రావు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement