-ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రదాడుల నేపథ్యంలో బందోబస్తు
శంషాబాద్
టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ఉగ్రదాడుల నేపథ్యంలో పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఆదేశాలతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్ర యాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈమేరకు శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ, అంతర్జాతీయ టెర్మినళ్ల వద్ద అక్టోపస్ బలగాలను మోహరించారు. అంతర్గత భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.
విమానాశ్రయానికి ఉన్న ప్రధాన రహదారుల్లో పోలీసు బలగాలను దించారు. సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలతోపాటు రక్ష సెక్యూరిటీ దళాలతో భద్రతను పెంచారు. ప్రధాన ద్వారం వద్ద వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఇస్తాంబుల్ వెళ్లడానికి విమానాలు లేకపోయిన ప్పటికి ముంబై, ఢిల్లీ నుంచి కనెక్టింగ్ విమానాల ద్వారా ఇస్తాంబుల్ వెళ్లాల్సిన ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.