శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
Published Mon, Aug 7 2017 1:49 PM | Last Updated on Mon, Sep 11 2017 11:31 PM
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. పంద్రాగస్టు నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో పోలీసులు, సీఐఎఫ్, రాక్సా, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సోమవారం నుంచి ఈ నెల 20 వ తేదీ వరకు అన్ని రకాల పాస్‌లను రద్దు చేశారు. దీంతో సందర్శకులకు అనుమతి లేదు. ఎయిర్‌పోర్టుకు వచ్చే అన్ని వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు.
Advertisement
Advertisement