అగ్రిగోల్డ్ ఆస్తుల నిర్ధారణకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను నిర్ధారించేందుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో మంగళవారం అగ్రిగోల్డ్ కేసు విచారణకు వచ్చింది.
అగ్రిగోల్డ్ యాజమాన్యం అమ్మకానికి సిద్ధంగా ఉన్న 26 ప్రాపర్టీలను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించింది. ఆస్తుల వివరాలను నిర్ధారించే బాధ్యతలను రెండు కంపెనీలకు అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.