ఇన్‌స్పెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ నిలిపివేత | High Court interim order on the Police inspectors | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ నిలిపివేత

Published Sun, Jan 8 2017 12:41 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

ఇన్‌స్పెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ నిలిపివేత - Sakshi

ఇన్‌స్పెక్టర్ల పదోన్నతుల ప్రక్రియ నిలిపివేత

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌:
పోలీస్‌ ఇన్‌స్పెక్టర్ల పదోన్నతుల ప్రక్రియను ఉమ్మడి హైకోర్టు నిలిపేసింది. గత ఏడాది డిసెంబర్‌ 13న ప్రకటించిన సీనియారిటీ జాబితా ను 8 వారాల పాటు నిలిపేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సీనియారిటీ జాబితాను సవాలు చేస్తూ ఎస్‌పీ (నాన్‌ కేడర్‌) పి.వి.రాధాకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ రామచంద్రరావు ఆ సీనియారిటీ జాబితా అమలును నిలిపేశారు. ఆ జాబితా ఆధారంగా ఎటువంటి పదోన్నతులు చేపట్టవద్దని ప్రభుత్వా న్ని ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ తదితరులకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement