ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు | High Court issues notices to ap incharge secretary satyanarayana | Sakshi
Sakshi News home page

ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు

Published Mon, Oct 24 2016 1:38 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు - Sakshi

ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇంఛార్జ్ సెక్రటరీ సత్యనారాయణ ఆ పదవికి అనర్హుడంటూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది.  మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్కే పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా సత్యనారాయణకు లా డిగ్రీ లేదని ఆర్కే తరుఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ...నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement