హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపు సరికాదంటూ దాఖలైన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియను ఎందుకు కుదించారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అంశాన్ని కేబినెట్లో చర్చించి ఆర్డినెన్స్ను ఎందుకు తసుకురాలేదని కోర్టు అడిగింది.
జనవరి 31 లోగా ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచనతో ఎన్నికల ప్రక్రియను కుదించామని ఏజీ సమాధానమిచ్చారు. అయితే ఎన్నికలు ఎన్నిరోజుల్లోగా నిర్వహిస్తారో స్పష్టంగా చెప్పాలని, అవసరమైతే రెండు, మూడు వారాలు గడువు పొడగిస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల పూర్తి షెడ్యూల్ ను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తీర్పును మధ్యాహ్నాం 2:30 గంటలకు వాయిదా వేసింది.