
అగ్రిగోల్డ్ కేసుపై నివేదికలివ్వండి: హైకోర్టు
హైదరాబాద్ : అగ్రిగోల్గ్ సంస్థ మోసాలపై నమోదైన కేసుపై ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలపాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల వద్ద ఉన్న నివేదికలు సమర్పించాలంటూ తన ఆదేశాలలో హైకోర్టు పేర్కొంది. అగ్రిగోల్డ్ మోసాలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.