
‘హిజ్ అండ్ హర్’
ఏరియల్ ‘హిజ్ అండ్ హర్’ ప్యాక్‌ని టాలీవుడ్ నటి మంచు లక్ష్మి, ఆమె భర్త ఆనంద్ శ్రీనివాసన్ ఆవిష్కరించారు. బంజారాహిల్స్ తాజ్ కృష్ణాలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు... ‘షేర్ ది లోడ్’ మూవ్‌మెంట్‌లో ‘బకెట్ చాలెంజ్’ను మొదలు పెట్టి, అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిటీప్లస్ వారిని పలుకరించింది...
మంచు లక్ష్మి : మేం అమెరికాలో ఉన్నప్పుడు నేను,
ఆండీ (ఆనంద్ శ్రీనివాసన్) వర్క్‌ని షేర్ చేసుకునేవాళ్లం. ఇద్దరికీ కుకింగ్ అంటే ఇష్టం. తెగ వండేవాళ్లం.
ఆనంద్ శ్రీనివాసన్ : నిజానికి వర్క్ తను జస్ట్ ప్రారంభించేది. మాటల్లో పెట్టి ఏదో మ్యాజిక్ చేసేది. చివరికి చూస్తే నాతో కంప్లీట్ అయ్యేది.
మంచు లక్ష్మి : ఇప్పుడు మనం చాలా లక్కీ కాబట్టి వాషింగ్ మెషీన్‌లు వచ్చాయి. పని ఈజీ అయిపోతోంది. కానీ మా అమ్మమ్మ టైమ్‌లో ధోబీ ఇంటికొచ్చి బట్టలను కౌంట్ చేసి తీసుకెళ్లి తెచ్చిచ్చేవాడు. హైదరాబాద్‌కు వచ్చాక వాళ్లే ఇంటికి వచ్చి వాష్ చేయడం మొదలైంది.
ఆనంద్ శ్రీనివాసన్ : పాపకు సంబంధించిన విషయాల్లో లక్ష్మినే కేర్ తీసుకుంటోంది.
మంచు లక్ష్మి : యా... పాప బట్టలు స్వయంగా నేనే వాషింగ్ మెషీన్‌లో వేసి వాష్ చేస్తాను. అవి ఆరాక ఫోల్డింగ్ చేయడం ఆండీ పని. ఆర్గానిక్ డయపర్స్‌నే వాడుతున్నాం. అవి ఇండియాలో దొరకవు. అందుకే ఆండీ అమెరికానుంచి వచ్చేటప్పుడు తీసుకుని వచ్చాడు.
ఆనంద్ శ్రీనివాసన్: తీసుకురావడమంటే ఒకటో రెండో ప్యాకెట్స్ కాదండి... మూడునాలుగు సూట్‌కేసులు నిండా మోసుకొచ్చాను.
మంచు లక్ష్మి : అరియానా, విరియానా ఉండటం వల్ల మా బేబీకి బట్టలు కొనేపని తప్పింది. వాళ్లిద్దరి బట్టలూ ఇదే వేసుకుంటుంది.
ఆనంద్ శ్రీనివాసన్: అలా అని తనకు బట్టలు తక్కువనుకుంటున్నారేమో... మా ఇద్దరివి కలిసినా అన్ని ఉండవు. అన్ని బట్టలున్నాయ్ తనకు. పాప వచ్చాక... మా లైఫ్ అంతకుముందుకన్నా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. శిరీష చల్లపల్లి