3 నుంచి 7 వరకు హైకోర్టుకు సెలవులు | Holidays to the High Court | Sakshi
Sakshi News home page

3 నుంచి 7 వరకు హైకోర్టుకు సెలవులు

Published Sat, Oct 1 2016 1:42 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

Holidays to the High Court

సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా అక్టోబర్ 3-7 వరకు ఉమ్మడి హైకోర్టుకు సెలవులు ప్రకటించారు. తర్వాత శని, ఆదివారాలు, దసరా, మొహర్రం సెలవులు ఉన్నాయి. తిరిగి 13న హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. సెలవుల్లో అత్యవసర కేసులు విచారణకు వీలుగా జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ టి.సునీల్ చౌదరిలతో వెకేషన్ కోర్టును ఏర్పాటు చేశారు.

దీనికి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వం వహిస్తారు. జస్టిస్ ఎస్.వి.భట్ సింగిల్ జడ్జిగా కేసులు విచారిస్తారు. వెకేషన్ కోర్టులో అత్యవసర కేసులను అక్టోబర్ 4న దాఖలు చేసుకోవచ్చు. రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement