హైదరాబాద్ : మే 1వ తేదీలోగా రావాల్సిన బకాయిలను చెల్లించకుంటే.. మే 2 నుంచి ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌ల అసోసియేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోగ్యశ్రీ కి సంబంధించిన బకాయిలు రూ. 200 కోట్లను తక్షణమే విడుదల చేయాలని.. లేకుంటే తమ ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తామని అందులో పేర్కొన్నారు.