లెక్కలు తేలుస్తున్న వ్యవసాయశాఖ
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పొందే రైతుల్లో ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారనే దానిపై వ్యవసాయశాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు వారి పరిధిలోని బ్యాంకులకు వెళ్లి ఎస్సీ, ఎస్టీ రైతుల వివరాలు తెలుసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నాలుగో విడత (చివరి) రుణ మాఫీ కింద రూ. 4 వేల కోట్లు మంజూరు చేయడం తెలిసిందే. గతంలో మూడు విడతల రుణ మాఫీ సమయంలో రూ. లక్ష లోపు రుణాలున్న 35 లక్షల మంది రైతులను గుర్తించి వారి ఖాతాల్లో జమ చేశారు. అప్పుడు ఎస్సీ, ఎస్టీల సంఖ్యను లెక్కగట్టలేదు.
ఇటీవల ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని తీసుకురావడంతో ఆ వర్గాల వివరాల సేకరణ తప్పని సరైందని అధికారులు చెబుతున్నారు. వివరాలు సేకరించాకే రుణ మాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశముందన్నారు. అన్ని బ్యాంకుల నుంచి ఎస్సీ, ఎస్టీ రైతుల సంఖ్య తేలే వరకు ఇతర రైతులకు రుణ మాఫీ సొమ్ము ఇచ్చే అవకాశం లేదం టున్నారు. ఈ ప్రక్రియ పూరికి మరికొన్ని రోజులు పడుతుందని చెబుతున్నారు.
రుణమాఫీ రైతుల్లో ఎస్సీ, ఎస్టీలెందరు?
Published Sun, Apr 16 2017 2:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement