దేశవ్యాప్తంగా 10 వేల మంది విద్యార్థుల రాక
సాక్షి, హైదరాబాద్: రోహిత్ మృతికి కారకులను శిక్షించాలంటూ సోమవారం తలపెట్టిన ఛలో హెచ్‌సీయూ నేడులో హెచ్‌సీయూ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది విద్యార్థులు తరలిరానున్నారని జేఏసీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని, అందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని పలు యూనివర్సిటీల నుంచి విద్యార్థులు ఇప్పటికే హెచ్‌సీయూకు చేరుకున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఏపీ నుంచి విద్యార్థులు వస్తున్నట్టు విద్యార్థి నాయకులు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెయ్యి మంది విద్యార్థులు తరలిరానున్నారు.
అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు, బాలచంద్ర ముంగేకర్, జేఎన్‌యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మీనా కందస్వామి, హరగోపాల్, కాకి మాధవరావు సహా పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు సభలో పాల్గొంటారని విద్యార్థి నేతలు తెలిపారు.
నేడు ఛలో హెచ్‌సీయూ
Published Mon, Jan 25 2016 5:09 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM
Advertisement