ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జనం మందకొడిగా జరుగుతోంది. ఉదయం 8గంటల వరకూ 2 వేల 556 విగ్రహాలను అధికారులు నిమజ్జనం చేశారు. అయితే ఇంకా భారీ స్థాయిలో విగ్రహాలు నిమజ్జనానికి వేచి ఉన్నాయి. నిన్న రాత్రి వచ్చిన విగ్రహాలు సైతం ఇంకా ట్యాంక్ బండ్ పై బారులు తీరి ఉన్నాయి. క్రేన్ ల వద్ద నిమజ్జనం ఆలస్యం కావడం పై భక్తులు ఆందోళన చెందుతున్నారు.
బాలాపూర్ నుంచి శోభయాత్ర మొదలైతే.. భారీ సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్ వచ్చి చేరుతాయని... ఈ లోపు ఇప్పటికే వచ్చిన విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు.
మందకొడిగా నిమజ్జనం
Published Sun, Sep 27 2015 8:29 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement