బంధువుల ఇంటికి వచ్చిన ఓ బాలుడు వేడి నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్: బంధువుల ఇంటికి వచ్చిన ఓ బాలుడు వేడి నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కూకట్‌పల్లి ప్రాంతం ఎల్లమ్మబండలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లా గన్నేరుపెంట గ్రామానికి చెందిన కుమార్ ఎల్లమ్మబండలోని బావమరిది కోటేశ్వరరావు ఇంటికి కుటుంబంతోపాటు ఈనెల 3వ తేదీన వచ్చాడు. ఈనెల 4వ తేదీన కుమార్ కుమారుడు చిన్నబాబు(3) ఆడుకుంటూ ఇంట్లో స్టవ్‌పై ఉంచిన వేడి నీటి గిన్నెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం చనిపోయాడు.