Koteshwara Rao
-
పరమ యోగి..
రాలిపడిన పూవుల గాయాలరహస్యాలను శోధించే తోటమాలివి నీవు...దుర్గంధంతో జ్వలించే కీకారణ్యాన్ని జయించి చావు తావులను పసిగట్టే సత్యాన్వేషివి నీవు...పార్థివ దేహ గర్భగుడిలో సంచరించిమృత్యువు మూలతత్త్వాన్నిఅపర నారాయణులకుప్రవచించే పరమ యోగి నీవు...కరకు కత్తులు చేసిన రక్త సంతకాలతోనిర్జీవ గాత్రం నిండా ఘనీభవించిన గాయాలను, కామ తృష్ణ పరమ హింసలో ఛిద్రమైన శుక్త ఖండాలను,ఆచూకీ తెలియనిఉక్కు పాదాలకింద నలిగినఅనాథ కళేబరాలనువేయి చూపులతో దర్శించిమరణమూల్యాంకనం చేస్తావు..కుష్ఠురోగిని ఇష్ట దైవంగా కొలిచిన మహాతల్లిలా కుళ్లిన శవాలను ప్రాణమిత్రుల వలెపరామర్శిస్తావు...శవాల మీద విసిరిన చిల్లరను మూటగట్టుకోవడం చాలా సులభం!కానీ మూటగట్టిన శవాల్లోకినిర్భయంగా తొంగి చూడటమే కష్టం!వస్తువులతో కాపురం చేసే ప్రబుద్ధులుబతికి ఉన్న మనుషులను శవాలుగా చూస్తుంటే, శవాలను కూడా మనుషులుగా ప్రేమించే కరుణా జలపాతం నీవుమూర్తీభవించిన సాహసం నీవు స్ఫూర్తీభవించిన దివ్య సేవానిరతి నీవు.కన్నీటి ఎడారుల సాక్షిగామార్చురీ మైదానంలో నిర్విరామంగామహా యజ్ఞం నిర్వహించినమేరే ప్యారే సలీం భాయ్!పవిత్రమైన నీ చేతులనునాకిప్పుడు ముద్దాడాలనిపిస్తోంది! – కోయి కోటేశ్వరరావు, 9440480274 -
కోటేశ్వరాస్త్రంపై కదలిక
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో బినామీలకు నామినేషన్లపై పనులు కట్టబెట్టడానికి సంబంధించి సంస్థ అదనపు డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) డి.కోటేశ్వరరావు బహిర్గతం చేసిన అవినీతి భాగోతంపై దృష్టి సారించిన సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సదరు సర్వీస్ కోడ్‌ను సాఫ్ట్వేర్ నుంచి తొలగించడంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా వ్యయ పరిమితులు విధించింది. ఫేస్బుక్ లైవ్‌లో ఆధారాలతో సహా.. కోటేశ్వరరావు 2020 ఫిబ్రవరి 4న ఫేస్బుక్ లైవ్ నిర్వహించి.. సంస్థలో ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు, చెట్ల కొమ్మలు నరికివేత పనుల్లో రూ.వందల కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చారు. దోపిడీకి పాల్పడుతున్న కొందరు విద్యుత్ ఇంజనీర్ల పేర్లను సైతం బహిర్గతం చేశారు. దీనిపై ‘సాక్షి’అప్పట్లోనే కథనం ప్రచురించింది. ఈ అవినీతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో కోటేశ్వరరావుపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే జాతీయ ఎస్టీ కమిషన్ జోక్యంతో సస్పెన్షన్ తొలిగింది. అదే సమయంలో ఆయన బహిర్గతం చేసిన అవినీతి సంస్థ యాజమాన్యంలో కదలికను తీసుకొచ్చింది. అవినీతి ఇలా జరిగింది.. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు కోసం ’సాప్’సాఫ్ట్‌వేర్‌లో ఒకే సరీ్వస్ కోడ్ (ఎస్డబ్ల్యూఆర్ 21693) ద్వారా ఒకే రకమైన పనికి వేర్వేరు రేట్లతో అడ్డగోలుగా ఎలా అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడ్డారన్న అంశాన్ని కోటేశ్వరరావు ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. వందలాది పనుల అంచనాలను బయటపెట్టారు. గాల్వనైజ్డ్ ఐరన్ మెష్ (ఇనుప కంచె)తో ఫెన్సింగ్ ఏర్పాటు కోసం ఒక ప్రాంతంలోని డివిజనల్ ఇంజనీర్ (డీఈ) చదరపు అడుగుకు రూ.54 (100 శాతం)తో అంచనాలు తయారుచేస్తే, మరో ప్రాంతంలోని డీఈ రూ.125 (231 శాతం అధికం), ఇంకో ప్రాంతంలోని డీఈ రూ.284 (526 శాతం అదనం), మరో ప్రాంతంలోని డీఈ రూ.384 (711 శాతం అదనం) చొప్పున అంచనాలు రూపొందించారని బయటపెట్టారు. ఒక ట్రాన్స్ఫార్మర్కు 120–130 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు రూ.20 వేలలోపు ఖర్చు కావాల్సి ఉండగా, కొందరు ఇంజనీర్లు ఈ రకంగా రూ.60 వేల వరకు అంచనాలను పెంచేశారు. ఇలా అడ్డగోలుగా అంచనాలు పెంచి 48 మంది కాంట్రాక్టర్లకు రూ.1,344 కోట్లు చెల్లించారని వివరించారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన పని విలువ రూ.144 కోట్లు మాత్రమే అని తెలిపారు. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు పేరుతో రూ.1,200 కోట్ల అవినీతి జరిగిందని ఆయన సీఎం కేసీఆర్, సీఎస్, ఇంధన శాఖలకు లేఖలు సైతం రాశారు. అయితే, ఈ అవినీతిలో బాధ్యులైన ఇంజనీర్లలో కొందరికి మాత్రమే షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంస్థ యాజమాన్యం తూతూమంత్రంగా విచారణ నిర్వహించి సంస్థకు ఎలాంటి నష్టం జరగలేదని తేలి్చందనే విమర్శలున్నాయి. అయితే అడ్డగోలు అంచనాలు బయటపడిన నేపథ్యంలో జాగ్రత్తపడిన సంస్థ యాజమాన్యం సదరు సరీ్వస్ కోడ్‌ను సాఫ్ట్వేర్ నుంచి తొలగించింది. దీంతోపాటు ఒక ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు వ్యయంపై రూ.20 వేల గరిష్ట పరిమితి విధించింది. చెట్ల కొమ్మల్లోనూ కొట్టేశారు! వర్షాకాలంలో గాలివానలకు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తుంటాయి. దీంతో ఏటా రెండు మూడుసార్లు 11 కేవీ విద్యుత్ లైన్లపై నుంచి వెళ్లే చెట్ల కొమ్మలను సంస్థ యాజమాన్యం కొట్టి వేయిస్తుంటుంది. అయితే చెట్ల కొమ్మలు కొట్టడం పేరుతో కొందరు విద్యుత్ ఇంజనీర్లు అడ్డగోలుగా ఏటా రూ.కోట్లలో బిల్లులు చేసుకుంటున్నారని కూడా కోటేశ్వరరావు బయటపెట్టారు. దీంతో ఒక ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు నరకడానికి ఏడాదికి గరిష్టంగా రూ.20 వేలలోపు మాత్రమే ఖర్చు చేసేలా సంస్థ యాజమాన్యం మరో వ్యయ పరిమితి విధించింది. దీంతో ఏడాదిలో ఎన్నిసార్లు చెట్ల కొమ్మలు నరికినా ఒక ఫీడర్ పరిధిలో ఇకపై రూ.20 వేలు మాత్రమే బిల్లు రానుంది. గతంలో ఒక ఫీడర్ పరిధిలో రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు అడ్డగోలుగా బిల్లులు చేసుకునేవారు. రాజేంద్రనగర్ డివిజన్లో పనిచేసిన ఒక డీఈ ఏకంగా రూ.4 కోట్లను చెట్ల కొమ్మలు నరికివేత పేరుతో ఒక ఏడాదిలో బిల్లులు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యయ పరిమితి విధించడంతో ఒక్కో ఫీడర్ పరిధిలో కనీసం రూ.50 వేలు ఆదా కానున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 7,440 పీడర్లు ఉండగా, కొమ్మల నరికివేత పనుల్లో ఏటా సంస్థకు రూ.37.20 కోట్లు ఆదా కానున్నాయి. అక్రమాలు జరిగినందుకే దిద్దుబాటు.. ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు, చెట్ల కొమ్మలు నరికివేత పనుల్లో అవినీతిని తాను బయటపెట్టడం వల్లే డిస్కం చర్యలు చేపట్టిందని, మార్పులు సాధ్యమయ్యాయని కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన సరీ్వస్ బుక్‌లో ఎంట్రీ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లాలని ఇటీవల సంస్థ యాజమాన్యానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ మార్పులు చేశారంటే, గతంలో చెల్లించిన బిల్లులు అక్రమమైనవేనని తేలినట్టేనని ఆయన దరఖాస్తులో పేర్కొనడం గమనార్హం. ఇదీ అవినీతి ఒక ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటుకు రూ.20 వేల లోపు ఖర్చు కావాల్సి ఉండగా రూ.60 వేల వరకు అంచనాలు పెంచేసిన ఇంజనీర్లు. ఈ విధంగా 48 మంది కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.1,200 కోట్ల సంస్థ సొమ్మును దోచిపెట్టేశారు. ఇలా దిద్దుబాటు సదరు సరీ్వస్ కోడ్‌ను సాఫ్ట్వేర్ నుంచి సంస్థ తొలగించింది. దీంతోపాటు ఒక ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు వ్యయంపై రూ.20 వేల గరిష్ట పరిమితి విధించింది. అంటే ఎక్కడా రూ.20 వేలకు మించి ఖర్చు పెట్టడానికి వీల్లేదన్నమాట. ఇదీ అవినీతి వర్షాకాలంలో విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు పడకుండా ఏటా రెండుసార్లు కొమ్మలు కొట్టేసే పనుల్లో కూడా కోట్లు కొట్టేశారు. గతంలో ఒక్క ఫీడర్ పరిధిలోనే రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు అడ్డగోలుగా బిల్లులు చేసుకునేవారు. ఇలా దిద్దుబాటు ఒక ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు నరకడానికి ఏడాదికి గరిష్టంగా రూ.20 వేల లోపే ఖర్చు చేసేలా సంస్థ వ్యయ పరిమితి విధించింది. ఇకపై ఏడాదిలో ఎన్నిసార్లు చెట్ల కొమ్మలు నరికినా ఫీడర్ పరిధిలో రూ.20 వేలే బిల్లు రానుంది. 2020 ఫిబ్రవరి 4వ తేదీన ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతున్న ఏడీఈ కోటేశ్వరరావు -
నగర అభివృద్ధి డ్రాఫ్ట్ సిద్ధమవుతోంది
-
కోటయ్య కేసు.. నీరుగారుస్తున్న పోలీసులు
సాక్షి, గుంటూరు: పోలీస్ శాఖ, ప్రభుత్వంపై మచ్చ తెచ్చే ఏ కేసునైనా ప్రభుత్వ పెద్దలు రాజకీయం చేసి నీరుగారుస్తున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కొండవీడు ఉత్సవాల్లో భాగంగా సీఎం సభ నేపథ్యంలో మృతి చెందిన బీసీ కౌలు రైతు కోటేశ్వరరావు కేసు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం నిలిచింది. పోలీసుల దాడిలోనే కోటేశ్వరరావు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ‘రైతు మృతికి పోలీసుల తప్పో లేక ఇంకోటో కావచ్చు. ప్రభుత్వం తరఫున మృతుని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తాం’ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రకటించారు. సాక్షాత్తూ సీఎం నోటి నుంచి రైతు మృతుకి పోలీసుల ప్రవర్తన కారణం కావచ్చు అని వచ్చినప్పటికీ పోలీసులు పారదర్శకంగా కేసు దర్యాప్తు చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు చేయకుండానే ఆత్మహత్యని ప్రకటన ఓ వైపు రైతు కోటేశ్వరరావు పోలీసుల దాడిలో మరణించాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఘటన స్థలంలో గొడవ జరిగినట్టు బొప్పాయి చెట్లు విరిగిపోయి కనిపిస్తున్నాయి. బొప్పాయి తోటలోనే పోలీసులు మద్యం తాగి, పేకాడినట్టు పేక ముక్కలు, మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. అయినప్పటికీ కేసు దర్యాప్తు మాత్రం పోలీసుల తప్పులేదన్న కోణంలోనే సాగుతోంది. ఎటువంటి దర్యాప్తూ చేయకముందే కోటేశ్వరరావు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని సాక్షాత్తూ జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖరబాబు నిర్ధారించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించిన తరువాత డీఎస్పీతో విచారణ చేయిస్తామని ఎస్పీ ప్రకటించి ఉపయోగం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ ఉన్నతాధికారే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించిన తరువాత డీఎస్పీ నిస్పక్షపాతంగా దర్యాప్తు ఎలా చేస్తారని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ పెద్దల రాజకీయం.. సీఎం పర్యటన సందర్భంగా కోటేశ్వరరావు పోలీసుల దాడిలో మరణించాడని విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలుగుతుందని టీడీపీ పెద్దలు భావించారు. వెంటనే రైతు మృతిని రాజకీయం చేయడం మొదలుపెట్టారు. దీనికితోడు కేసులో ప్రత్యక్ష సాక్షి, కౌలు రైతు కోటేశ్వరరావు పాలేరు పున్నారావు ఘటన జరిగిన మరుక్షణం నుంచి మాయమై, మంత్రి ప్రెస్మీట్లో ప్రత్యక్షమవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ప్రెస్‌మీట్ అనంతరం పున్నారావు తిరిగి కనిపించడంలేదు. ఈ తీరు చూస్తుంటే పున్నారావును బెదిరించి కేసును తొక్కిపట్టే ప్రయత్నాల్లో భాగంగానే టీడీపీ నాయకులు అతడిని నిర్బంధించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.(కోటయ్య ఫోన్ ఎందుకు మాయం చేశారు?) బాధ్యత గల మంత్రి ప్రత్తిపాటి సైతం తన నియోజకవర్గంలో జరిగిన రైతు మృతిపై పూర్తి విచారణ జరపాల్సిందిపోయి, హెలీప్యాడ్ స్థలం అతనిది కాదంటూ కేసును పక్కదారి పట్టిం చేలా మాట్లాడటంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన తండ్రి పురుగుమందు తాగినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఎక్కడా పేర్కొనలేదని కోటేశ్వరరావు కుమారుడు వీరాంజనేయులు మొత్తుకుంటున్నారు. అయితే పోలీసులు మా త్రం కోటేశ్వరరావు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు అతని కుమారుడు ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో వెపు ఈ ఘటనపై ఎస్పీ స్పందించిన తీరుకు, సిబ్బంది చెబుతున్న మాటలకు పొంతన కుదురడంలేదు. రైతును రక్షించే సమయంలో అతని కుమారుడు ఘటన స్థలంలో ఉన్నాడని పోలీసులు చెబుతుంటే, మృతుని కుమారుడు మాత్రం పోలీసులే తన తండ్రి మృతదేహాన్ని రోడ్డుపైకి ఎదురు తెచ్చిచ్చారని స్పష్టంచేస్తున్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు సర్వత్రా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కోటేశ్వరరావు భార్య ప్రమీలను ఓదార్చుతోన్న వైఎస్సార్సీపీ చిలకలూరి పేట సమన్వయకర్త విడదల రజని(ఫైల్) కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది? -
కానూరులో దారుణం
విజయవాడ: నగరంలోని కానూరులో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం కానూరులో కోటేశ్వరరావు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. కన్న తండ్రి మృతదేహంతోనే అదే ఇంటిలో నాలుగు రోజులుగా కుమారుడు ఉంటున్నాడు. కోటేశ్వరరావు చనిపోయి నాలుగు రోజులు కావడంతో శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటేశ్వరరావు కుమారుడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని పోలీసులు గుర్తించారు. అయితే మానసిక రోగి అయిన కుమారుడు తండ్రిని హతమార్చాడా..? లేక అనారోగ్యంతోనే కోటేశ్వరరావు మృతి చెంది వుంటాడా అనే కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నారు. -
స్మైల్ ప్లీజ్!
ఆయన పేరు... కోటేశ్వర్రావు. పేరులోనే కాదు... బ్యాంకు బ్యాలెన్స్లోనూ కోట్లున్నాయి.ఆయనకు ఒక్కగానొక్క కొడుకు... పేరు: స్మైలేంద్ర. పేరుకు స్మైలేంద్రేగాని ఒకసారి తప్ప... ఎప్పుడూ నవ్విన పాపాన పోలేదు. పుట్టగానే అందరూ కేర్‌మని ఏడుస్తారు. ఇతను మాత్రం ఆస్పత్రి అదిరిపోయేలా బిగ్గరగా నవ్వాడట. దీంతో ‘స్మైలేంద్ర’ అని కొడుక్కి అక్కడికక్కడే నామకరణం చేశాడు కోటేశ్వర్రావు. కానీ... ఆనాటి నుంచి స్మైలేంద్ర ఏనాడూ నవ్విన పాపాన పోలేదు. మరో పది నిమిషాల్లో ప్రపంచ యుద్ధం ముంచుకు వస్తున్నట్లు ఎప్పుడూ సీరియస్‌గా ముఖం పెట్టేవాడు. స్నేహితులు ఎన్ని జోకులు చెప్పినా ‘వీళ్లకేం పని లేదు’ అన్నట్లుగా చూసేవాడు తప్ప చిరునవ్వైనా నవ్వే వాడు కాదు. కొన్ని సంవత్సరాల తరువాత...స్మైలేంద్ర చదువు పూర్తయింది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో గొప్ప ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంతో పాటు పెళ్లీడు కూడా వచ్చింది. తన కొడుక్కి పిల్లనివ్వడానికి అందరూ క్యూ కడతారు అనుకున్నాడు. కానీ అంత సీనేమీ కనిపించలేదు. ఇక ఇలా కాదనుకొని తానే రంగంలోకి దిగాడు. ‘మంచి సంబంధం... మీ ఇంటికి పిల్లనివ్వడం మా అదృష్టం’ అన్నవాళ్లు కూడా వారం తిరక్కుండానే ‘పెళ్లి క్యాన్సిల్’ అంటున్నారు.‘ఏమిటీ మిస్టరీ?’ అని తనలో తాను అనుకోవడమే కాదు... ఒక స్నేహితుడిని కూడా అడిగాడు కోటేశ్వర్రావు.‘‘మిస్టరీ కాదు. మీ వాడి హిస్టరీ... మీ వాడు ఎప్పుడూ నవ్వకపోవడం గురించి ఊళ్లో వింతగా చెప్పుకుంటున్నారు. తానే నవ్వలేని వాడు భార్యను ఎలా నవ్వించగలడు? ఆమెను ఎలా సంతోషపెట్టగలడు? అని దీర్ఘంగా ఆలోచించి అందరూ పారిపోతున్నారు’’ అని అసలు విషయం చెప్పాడు స్నేహితుడు. ‘ఎలాగైనా సరే నా కొడుకును నవ్వించాలి.... వాడి పెళ్లి ఘనంగా చేయాలి’ అని గట్టిగా అనుకొని ‘మా అబ్బాయిని నవ్వించిన వ్యక్తికి కోటి రూపాయలు బహుమానంగా ఇస్తాను’ అని ప్రకటించాడు కోటేశ్వర్రావు.దీంతో మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి, వాటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద పెద్ద కమెడియన్లు రంగంలోకి దిగారు. ఇప్పుడు స్మైలేంద్ర గదిలో ఏం జరుగుతుందో చూద్దాం... ‘‘హాయ్ స్మైలేంద్ర... నేనొక కామెడీ సీన్ చెబుతాను. శ్రద్ధగా విను. నవ్వు చచ్చినట్లు తన్ను కొస్తుంది’’ అని ఇలా చెప్పడం మొదలు పెట్టాడు ఒక కమెడియన్...‘‘అనగనగా ఒక ఊళ్లో సుత్తి వీరభద్రరావు ఉంటాడు. ఆయన రచయిత. వాళ్ల ఇంట్లో బ్రహ్మానందం అద్దెకు ఉంటాడు. అద్దెకున్న పాపానికి వీరభద్రరావు ఏ చచ్చు కథ చెప్పినా చచ్చినట్లు వింటూ బుర్ర పాడుచేసుకుంటూ ఉంటాడు. ఎటూ పారిపోకుండా ఉండటం కోసం ఒకరోజు బ్రహ్మానందాన్ని మెడలోతు వరకు ఇసుకలో పాతిపెట్టి ఇలా కథ చెప్పడం మొదలు పెడతాడు వీరభద్రరావు... ‘మంగళగిరి తిరునాళ్లలో ఆరు నెలల గుంటడు తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు... ఆడి కోసం ఏఏ ఊళ్లు తిరిగారో తెలుసా? సికింద్రాబాదూ, హైదరాబాదూ, ఆదిలాబాదూ, అహ్మదాబాదూ, ఫకీరాబాదూ, అలహాబాదూ, ఔరంగాబాదూ, సిం«ద్బాదూ, సుల్తానాబాదూ, ముస్తాబాదూ, ఘజియాబాదు...’ ఇలా ఎన్నో బాదుల గురించి తెగ బాదిన తరువాత... బ్రహ్మానందానికి మతి చలించి ఇలా అంటాడు... ‘నా బొంద బాదూ నా శ్రాద్ధం బాదూ నా పిండాకూడు బాదూ నన్ను వదిలేయ్ బాదూ బతికితే బఠానీలు అమ్ముకుంటా బాదూ...ఈ సీన్ చెప్పిన కమెడియన్ తెగ నవ్వాడు తప్ప.... స్మైలేంద్రలో ఎలాంటి స్మైలూ లేదు. ఈ కమెడియనే కాదు... ఎంతో మంది కమెడియన్లు ఎన్నో జోకులు చెప్పినా స్మైలేంద్ర చిన్న నవ్వు కూడా నవ్వలేదు. చివరికి ఒకే ఒక్క కమెడియన్ మిగిలాడు. అతడి పేరు... జానీ లీకర్. ‘‘అయ్యా... ఇప్పటి వరకు 99 మంది కమెడియన్లు నవ్విద్దామని లోనికి వెళ్లి... నవ్వించలేక ఏడుస్తూ బయటికి వచ్చారు. జానీ లీకర్ ఒక్కడే మిగిలాడు. లోనికి పంపించమంటారా?’’ కోటేశ్వర్రావుని అడిగాడు అతని అసిస్టెంట్. ‘‘ఎవరి బుర్రలో ఏముందో... పంపించు’’ నిరుత్సాహంగానే అన్నాడు కోటేశ్వర్రావు. జానీ లీకర్ లోపలికి వెళ్లి పది నిమిషాలైందో లేదో నాన్‌స్టాప్‌గా పెద్దగా నవ్వు వినిపించింది. అది స్మైలేంద్ర నవ్వు! స్మైలేంద్ర నవ్వు విని సంతోషం తట్టుకోలేక ఏడ్చాడు కోటేశ్వర్రావు.విక్రమార్కా... సుత్తి లేకుండా సూటిగా అడుగుతాను. జానీ లీకర్ ఏం చెప్పి స్మైలేంద్రను నవ్వించి ఉంటాడు?’’ భుజం మీద వేలాడుతున్న భేతాళుడు విక్రమార్కుడి కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు... ‘‘జానీ లీకర్ స్మైలేంద్ర గదిలోకి వెళ్లి.... ‘మిస్టర్ స్మైలేంద్ర... నేనొకటి చెబుతాను. నువ్వు నవ్వనక్కర్లేదు. అందులో లీనమైపోతేచాలు’’ అన్నాడు. అలాగే అన్నాడు స్మైలేంద్ర. జానీ లీకర్ చెప్పడం మొదలు పెట్టాడు.‘‘ ఏదో బంపర్ డ్రా తగిలి ఎన్నో దేశాలు ఉచితంగా పర్యటించే అవకాశం మీకు వచ్చింది. ఒకరోజు... మీరు విమాన ప్రయాణంలో ఉన్నారు. దురదృష్టవశాత్తు ఆ విమానానికి టెక్నికల్ ప్రాబ్లం ఎదురైంది. కూలడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అదృష్టవశాత్తు మీరు పారాచూట్ సహాయంతో విమానం నుంచి బయటపడ్డారు. దురదృష్టవశాత్తు ఆ పారాచూట్‌కు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మీరు ఉన్నపళంగా ఆకాశంలో నుంచి ఒక నదిలో పడతారు. అదృష్టవశాత్తు ఆ నదిలో ఒక పడవలో పడతారు. దురదృష్టవశాత్తు ఆ పడవ ఏ క్షణమైనా మునగడానికి సిద్ధంగా ఉంటుంది. మరోవైపు నీటిలో ఉన్న మొసళ్లు మిమ్మల్ని తినడానికి ఆవురావురుమంటూ ఎదురుచూస్తుంటాయి. మీరు భయాందోళనలతో బిక్కచచ్చిపోతారు’’‘‘రాజా...హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్... ఇది జోకా!? సరే... జోకే అని అనుకుందాం. ఇది విని స్మైలేంద్ర వణికి ఛస్తాడేగానీ బిగ్గరగా నవ్వుతాడా?’’ ఆగ్రహంగా అరిచాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా సమాధానం ఇచ్చాడు: ‘‘పురుషుల్లో పుణ్యపురుషులు వేరయా.. లాగా నవ్వుల్లో వెరైటీ నవ్వులు వేరయా! నెర్వస్ లాఫ్టర్ అనేది అందులో ఒకటి. ఇది జోకుల వల్ల వచ్చే నవ్వు కాదు. ఎంబరాస్మెంట్, డిస్కంఫర్ట్, కన్ఫ్యూజ్, టెన్షన్, స్ట్రెస్... ఇలాంటి ఫీలింగ్స్ ఎదురైనప్పుడు ఫిజికల్ రియాక్షన్లో భాగంగా కొద్దిమంది గట్టిగా నవ్వుతారు. దీన్నే నెర్వస్ లాఫ్టర్ అంటారు. మన స్మైలేంద్ర ఈ కోవకు చెందిన వ్యక్తే. జోక్‌లకు నవ్వడని తెలుసుకున్న జానీ లీకర్ అటు నుంచి నరుక్కువచ్చాడు... నెర్వస్ లాఫ్టర్ని నమ్ముకొని స్మైలేంద్రను తెగ భయపెట్టించి, తెగ కన్ఫ్యూజ్ చేసి... ఏమైతేనేం నవ్వించాడు. అదీ విషయం!’’ – యాకుబ్ పాషా -
వేడి నీటిలో పడి చిన్నారి మృత్యువాత
హైదరాబాద్: బంధువుల ఇంటికి వచ్చిన ఓ బాలుడు వేడి నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కూకట్పల్లి ప్రాంతం ఎల్లమ్మబండలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా గన్నేరుపెంట గ్రామానికి చెందిన కుమార్ ఎల్లమ్మబండలోని బావమరిది కోటేశ్వరరావు ఇంటికి కుటుంబంతోపాటు ఈనెల 3వ తేదీన వచ్చాడు. ఈనెల 4వ తేదీన కుమార్ కుమారుడు చిన్నబాబు(3) ఆడుకుంటూ ఇంట్లో స్టవ్‌పై ఉంచిన వేడి నీటి గిన్నెలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం చనిపోయాడు. -
హోదా రాకపోయినా ఏపీకి నష్టం లేదు
ఒంగోలు: ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ఏపీకి ఎటువంటి నష్టం జరగదని, అంతకన్నా ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా అభివృద్ధి సాధ్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.కోటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి హోదా విషయంలో స్పష్టత వచ్చిందన్నారు. ఒంగోలులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. ప్రధానిని కలిసిన తర్వాతే ముఖ్యమంత్రి హోదా కన్నా అధిక నిధులు కావాలని అడుగుతున్నారని చెప్పారు. ఆ పార్టీ నాయకులు మాత్రం అయోమయ ప్రకటనలు చేయడం బాధాకరమన్నారు. అమృత్ పథకంలో అమరావతికి చోటుకు సిద్ధం అమృత్ పథకంలో భాగంగా అమరావతిని 30వ నగరంగా చేర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అమృత్ పథకంలో 29 నగరాలను కేంద్రప్రభుత్వం చేర్చిందని, 30వ నగరంగా అమరావతికి చోటు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ నాయకులు అయోమయ ప్రకటనలు వీడి అమృత్ పథకంలో అమరావతిని చేర్చుకునేందుకు అవసరమైన ప్రక్రియపై దృష్టిసారించాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, దానికి రాష్ట్రం 30శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాల్సి ఉన్నా మొత్తం 100శాతం నిధులు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చన్నారు.ప్రత్యేక హోదాపై ప్రజలలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గందరగోళాన్ని తొలగించేందుకు బీజేపీతోపాటు టీడీపీ కూడా కలిసి వచ్చి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అసోంలో విజయబావుటా ఎగురేసినట్టే 2019లో ఏపీలో గెలుపు లక్ష్యంగా బీజేపీ సిద్ధ అవుతుందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు పి.వి.కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు బత్తిన నరశింహారావు, రాష్ట్ర కార్యదర్శి బి.మీనాకుమారి తదివతరులు పాల్గొన్నారు. -
అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
అప్పులబాధతో కోటేశ్వరరావు(34) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన తిరుమల బాలాజీనగర్ 6వ లేన్‌లో చోటుచేసుకుంది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రి తలసాని కుమారునిపై కేసు
హైదరాబాద్: బెదిరింపుల వ్యవహారంలో మంత్రి తలసాని యాదవ్ కుమారుడు సాయి యాదవ్‌పై కేసు నమోదైంది. భూ వివాదంలో జోక్యం చేసుకుని, తనను బెదిరించాడంటూ ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు గురువారం ఉదయం పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాయదుర్గంలోని తన ఐదెకరాల భూమి డెవలప్మెంట్ కోసం రామకృష్ణ అనే వ్యక్తికి చెందిన రామకృష్ణ కన్స్ట్రక్షన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నానని, అయితే అతడు సరిగా డబ్బులు చెల్లించకపోవటంతో డీల్ రద్దు చేసుకున్నట్లు రామకోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ విషయమై మాట్లాడాలని తలసాని శ్రీనివాస్‌యాదవ్ కొడుకు సాయియాదవ్, రామకృష్ణ కలసి తాజ్‌కృష్ణ హోటల్‌కు రావాలని బుధవారం సాయంత్రం కబురు పంపారని, అక్కడికి వెళ్లగా తనను మంత్రి కుమారుడు బెదిరించాడని ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ జరిపి మంత్రి కొడుకు సాయి యాదవ్‌పై కేసు నమోదు చేశారు. అయితే, ఇదే వ్యవహారంలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత తన భర్తను మంత్రి కుమారుడు కిడ్నాప్ చేశారంటూ బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. -
'ఎవరైనా తాజ్ కృష్ణా హోటల్లో కిడ్నాప్ చేస్తారా'
హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వర రావును తన కుమారుడు కిడ్నాప్ చేశాడన్న ఆరోపణలపై మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. కిడ్నాప్ చేసే వాళ్లు ఎవరైనా తాజ్‌కృష్ణా హోటల్లో కూర్చుని మాట్లాడుతారా అని ఆయన ప్రశ్నించారు. కిడ్నాప్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న ఆయన.. డాక్యుమెంట్లపై బలవంతంగా సంతకాలు చేయించారన్న వార్తలు కూడా అవాస్తవం అన్నారు. కేవలం ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని మాత్రమే అడిగారని, అయితే డబ్బు ఇచ్చే వరకు డాక్యుమెంట్లు పెట్టుకోవాలని రామకోటేశ్వర రావే అన్నారని తెలిపారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఇరువురి అగ్రిమెంట్లకు సంబంధించిన వివరాలను శుక్రవారం వెల్లడిస్తానని తలసాని తెలిపారు. 2011లో కొత్తపల్లి గీత కుటుంబం తమ వద్ద 11 కోట్లు అప్పుగా తీసుకున్నారని అయితే అవి ఇప్పటి వరకూ తిరిగి చెల్లించకపోగా ఇప్పుడు ఈ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తాజ్ కృష్ణా హోటల్ నుంచి అందరూ నవ్వుకుంటూనే బయటకు పోయారని ఆ ఫోటేజీ చూస్తే కిడ్నాప్ వార్తలు అవాస్తవం అని అర్థమౌతుందన్నారు. 'గీత భర్త మీడియాతో మాట్లాడుతూ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారు అనే విషయాన్ని మాత్రమే చెబుతున్నారు, వారు డబ్బు ఇవ్వాల్సి ఉందన్న విషయాన్ని వెల్లడించడం లేదు' అని తలసాని మండిపడ్డారు. -
భార్యే ప్రియుడితో హత్య చేయించింది
వీడిన మేస్త్రీ హత్య కేసు మిస్టరీ నాగోలు: బండ్లగూడలో గతనెల 24 వెలుగు చూసిన మేస్త్రీ హత్య కేసును ఎల్బీనగర్ పోలీసులు ఛేదించారు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భార్యే అతడిని ప్రియుడితో చంపించిందని తేల్చారు. శుక్రవారం ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఏసీపీ వేణుగోపాల్‌రావు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా కొండేటి మండలం సంతనూతలపాడు గ్రామానికి చెందిన తన్నీరు వెంకటేశ్ (35), సుశీల భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు బండ్లగూడ సర్వే నెం-58లో ఇల్లు కొనుగోలు చేసి ఉంటున్నారు. మేస్త్రీగా పని చేసే వెంకటేశ్ తర్వాత సర్వే నెం-58లో కిరాణాషాపు పెట్టాడు. ఇదిలా ఉండగా.. గుంటూరు జిల్లా పెద్ద పులివేరుకు చెందిన గొర్రుమంచు కోటేశ్వరరావు (24) బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో ఉంటున్నాడు. వెంకటేశ్ మేస్త్రీగా కాంట్రాక్ట్ పట్టుకుని కోటేశ్వరరావుకు అప్పగించేవాడు. పనులకు సంబంధించి కోటేశ్వరరావుకు వెంకటేశ్ కొంతడబ్బు బాకీపడ్డాడు. ఈ క్రమంలో తరచూ వెంకటేశ్ ఇంటికి వచ్చే కోటేశ్వరరావుకు అతని భార్య సుశీలతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది గమనించిన వెంకటేశ్ భార్యను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. పథకం ప్రకారమే... తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని, అది కూడా తాను ఇంట్లో లేనప్పుడు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావాలని సుశీల ప్రియుడు కోటేశ్వరరావుతో కలిసి పథకం వేసింది. ఈ క్రమంలోనే గతనెల 14న పిల్లలను తీసుకుని సొంతూరు సంతనూతలపాడుకు వెళ్లింది. 23వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేశ్ తలపై పెద్ద కర్రతో మోది కోటేశ్వరరావు చంపేశాడు. తర్వాత ప్రియురాలు సుశీలకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. తనకు ఏమీ తెలియనట్టు మరుసటి రోజు ఉదయం పిల్లలను తీసుకుని ఫతుల్లాగూడలోని ఇంటికి వచ్చిన సుశీల.. ఇంట్లో పడివున్న భర్త మృతదేహాన్ని చూసి ఎవరో హత్య చేశారంటూ బోరుమంది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుడు కోటేశ్వరరావును అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా సుశీలను వేధించడంతో పాటు తనకు రావాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో వెంకటేష్‌ను హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు.. హత్యకు పథకం పన్నిన సుశీలతో పాటు కోటేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.