
విజయవాడ: నగరంలోని కానూరులో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం కానూరులో కోటేశ్వరరావు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. కన్న తండ్రి మృతదేహంతోనే అదే ఇంటిలో నాలుగు రోజులుగా కుమారుడు ఉంటున్నాడు. కోటేశ్వరరావు చనిపోయి నాలుగు రోజులు కావడంతో శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటేశ్వరరావు కుమారుడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని పోలీసులు గుర్తించారు. అయితే మానసిక రోగి అయిన కుమారుడు తండ్రిని హతమార్చాడా..? లేక అనారోగ్యంతోనే కోటేశ్వరరావు మృతి చెంది వుంటాడా అనే కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment