స్ఫూర్తి చిత్రం
ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుూత్‌లో యువు క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెరుుల్ టు sakshicityplus@gmail.com
జేఎన్‌టీయూలో ఫ్యాకల్టీగా చేస్తున్న వీరాంజీ... షార్ట్ ఫిల్మ్స్‌పై తనకున్న ఆసక్తితో ‘యాక్తూ స్టుడియో ప్రొడక్షన్స్’ నెలకొల్పారు. ఫీచర్ ఫిల్మ్ చేయాలనేది ఆయన లక్ష్యం. ఆయన తీసినవాటిలో ఆదరణ పొందిన
రెండు చిత్రాల గురించి...
జీవితం, బంధాలు, ప్రేమ ఇలా అన్నింటిపై విరక్తి కలిగిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. విషం తాగబోతున్న అతను, కొంతమంది పిల్లలు ఆడుకోవటం గమనిస్తాడు. పిల్లలందరూ ఎత్తులో ఉన్న గంటను కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో ఓ పిల్లాడు దాన్ని కొట్టే ప్రయత్నంలో గాయపడతాడు. అయినా పట్టుదలతో సాధించి ఆటలో గెలుస్తాడు. ఇది చూసిన యువకుడు స్ఫూర్తి పొంది జీవితం విలువ తెలుసుకుని, ఆత్మహత్య విరమించుకోవడమే ఈ చిత్రం కథ. చక్కటి విజువల్స్, ప్రతి ఫ్రేము అర్థవంతంగా చిత్రీకరించారు దర్శకుడు వీరాంజీ.
అబ్‌సెషన్...
ఆలోచనలకు అంతులేదు. ఆలోచనలకు ఆది అంతం ఏమిటో తెలియదు. అలా చిత్రవిచిత్రమైన పరిస్థితులు, ప్రాంతాల మధ్య సాగే ఒక వ్యక్తి ఆలోచనా ప్రయాణమే ‘అబ్‌సెషన్’ చిత్రం. దీనికి కూడా దర్శకుడు వీరాంజీనే. ఆకాశం, పచ్చని పరిసరాలు, కొండలు, గుట్టలు, ఒకే ఒక పాత్రతో సాగే ఈ చిత్రంలో ఒక్క సెకన్, ఒక్క ఫ్రేము కూడా అనవసరంగా ఉందనిపించదు. షార్ట్ ఫిలింస్‌లో ఈ తరహా ఎడిటింగ్, ఫ్రేమింగ్ అరుదే.