సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50 లక్షల మంది టీఆర్‌ఎస్ క్రియాశీలక కార్యకర్తలకు బీమా పాలసీ రెన్యువల్ కింద రూ.5.43కోట్ల ప్రీమియం మొత్తాన్ని నేషనల్ ఇన్సూరెన్సు కంపెనీకి చెల్లించినట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఎంపీ కవిత, ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
గత ఏడాది రూ.4.87కోట్ల ప్రీమియం చెల్లించగా, రూ.10కోట్ల మేర క్లెయిములు పొందామని వివరించారు. గత ఏడాది 487 మంది కార్యాకర్తలు చనిపోగా, 274 మందికి బీమా పరిహారం చెక్కులు అందాయని చెప్పారు. బీమా సౌకర్యానికి సంబంధించిన పార్టీ మానిటరింగ్ కమిటీ నిత్యం వివరాలు సేకరించి చనిపోయిన కార్యకర్తల ప్రతీ కుటుంబానికి రూ.2లక్షల బీమా మొత్తం అందేలా చూసిందని చెప్పారు.