ఫ్రాన్స్‌తో భారత్‌కు విడదీయరాని బంధం | It is the inseparable bond with India with France | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌తో భారత్‌కు విడదీయరాని బంధం

Published Sat, Jan 6 2018 3:25 AM | Last Updated on Sat, Jan 6 2018 3:25 AM

It is the inseparable bond with India with France - Sakshi

శుక్రవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన అలెగ్జాండర్‌ జిగ్లర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఫ్రాన్స్‌తో భారత్‌కు విడదీయరాని బంధ ముందని ఆ దేశ రాయబారి అలెగ్జాండర్‌ జిగ్లర్‌ ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలున్నా యని, పలువురు ఫ్రెంచ్‌ జాతీయులు హైదరాబాద్‌లో ఉన్నా రని పేర్కొన్నారు. దేశంలో ఫ్రాన్స్‌ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. అలెగ్జాండర్‌ జిగ్లర్‌ శుక్రవారం హైదరా బాద్‌లోని బంజారాహిల్స్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తారకరామారావుతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జిగ్లర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి చాలా సానుకూల అంశాలు విన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ మెట్రో రైలు కార్యకలాపాల్లోనూ ఫ్రాన్స్‌ కంపెనీ భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. ఫ్రాన్స్‌ కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సానుకూలమైన ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందని పేర్కొ న్నారు. మూడేళ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతికి అభినందనలు తెలిపారు. ఇక్కడి ఇన్నోవేషన్‌ వల్లే ఫ్రాన్స్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని, ఇన్నోవేషన్‌ రంగంలో హైదరాబాద్‌ ముందు వరుసలో ఉందన్నారు. 

టీ–హబ్‌కు పొగడ్తల వర్షం..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ–హబ్‌ను పొగడ్తలతో ముంచె త్తారు. తమ దేశంలోని బోర్డో నగరంతో కలసి హైదరాబాద్లో మొబిలిటీ అంశంపై పరస్పర సహకారం అందించుకు నేందుకు, ట్రామ్‌ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. త్వరలోనే 50 ప్రముఖ ఫ్రెంచ్‌ పెట్టుబడిదారుల బృందం రానున్నట్లు తెలిపారు. ఫ్రాన్స్‌ కంపెనీలకు, పెట్టుబడిదారులకు అనుసంధానకర్తగా పని చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను జిగ్లర్‌కు మంత్రి వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం, అనుమతుల ప్రక్రియల ద్వారా ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వచ్చాయని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రానికి ఫ్రెంచ్‌ పెట్టుబడులు వచ్చేందుకు సహకరించాలన్న మంత్రి విజ్ఞప్తికి జిగ్లర్‌ సానుకూలంగా స్పందించారు. ఫ్రెంచ్‌ నుంచి రానున్న పెట్టుబడిదారుల బృందానికి తమ ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుందని చెప్పారు. ఏరోస్పేస్, రక్షణ, ఫార్మా రంగాల్లో ఫ్రెంచ్‌ పెట్టుబడులను ఆశిస్తోందని కేటీఆర్‌ చెప్పారు. సమావేశంలో ఫ్రెంచ్‌ కాన్సుల్‌ జనరల్‌తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement