చరిత్రను చాటేలా ఉత్సవాలు
♦ శతాబ్ది ఉత్సవాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష
♦ వారంలో ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల లోగో ఆవిష్కరణ
♦ 3 రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ
♦ ఉత్సవాల సందర్భంగా ఏప్రిల్ 27న అఖిల భారత వీసీల సమావేశం
♦ ఏడాది పొడవునా కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు నిర్వహి స్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. వచ్చే ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో ఘనంగా ఉత్సవాలను నిర్వహించేం దుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సోమవారం ఆయన తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశవరావు, ప్రభుత్వ సలహాదారు పాపా రావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. పాపిరెడ్డి, ఓయూ, జేఎన్‌టీయూ వీసీలు రామచంద్రం, వేణుగోపాల్‌రెడ్డి, విద్యాశా ఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పాల్గొన్నారు. అనంతరం కడియం మాట్లాడుతూ తెలంగాణకు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అవినాభావసంబం ధం ఉందన్నారు. ఉత్సవాలు ఆ మూడు రోజులే కాకుండా, ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఉత్సవాల నిర్వహణకు 30 కమిటీలు
ఉత్సవాలను పక్కాగా నిర్వహించేందుకు 30 కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీ, రిసెప్షన్ కమిటీ, ఆర్గనైజింగ్ కమిటీలు ఇందులో ప్రధానమైనవ న్నారు. శతాబ్ది ఉత్సవాలకు కేంద్ర మానవ వనరుల శాఖ, ఏఐసీటీఈ, యూజీసీ ఉన్నతాధికారులను ఆహ్వానిస్తా మని, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం కోరుతామని తెలిపారు. ఏప్రిల్ 27న అఖిల భారత వీసీల సమావేశం నిర్వహిస్తామ న్నారు. 28వ తేదీన ఇండియ న్ ఇంటర్నే షనల్ సైన్స్ ఫెయిర్‌ను ఇక్కడ నిర్వహిం చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీక రించిందన్నారు. దీనికి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్య అతిథిగా హాజరుకాను న్నారని తెలిపారు. విశ్వవిద్యా లయం ప్రారంభం నుంచి నేటి వరకు ప్రచురించిన ఉత్తమ వంద ప్రచురణలతో పుస్తకం తీసుకువస్తామన్నారు.
ఉస్మానియా వర్సిటీలో చదివి వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన వారిపైనా ప్రత్యేకంగా ఓ పుస్తకం తెస్తామన్నారు. విశ్వవిద్యాలయ చరిత్రను భావితరాలకు పదిలం చేసేందుకు వీడి యోను రూపొందిస్తున్నామన్నారు. వారం రోజుల్లో సీఎం కేసీఆర్‌ను కలసి ఉత్స వాలపై స్పష్టత తీసుకుంటామని, అప్పుడే ఉత్సవాల లోగో, బ్రోచర్, పోస్టర్, వెబ్ సైట్‌లను ఆవిష్కరిస్తామని చెప్పారు. మెస్ బిల్లుల బకాయిలను సీఎం మంజూరు చేశారన్నారని, ఇంకా సమస్యలుంటే వెం టనే పరిష్కరిస్తామన్నారు. కాంట్రాక్టు లెక్చ రర్లు కొంతమంది కొన్ని పార్టీల ప్రోద్బలం తో విధులకు హాజరుకావడం లేదన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలను జీవో 14 ప్రకారమే 50శాతం పెంచామని, వారి వేతనం రూ.18వేల నుంచి రూ.27 వేలకు పెరిగిందన్నారు. వారిని క్రమబద్ధీక రించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.