స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్కు చోటు
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి కరీంనగర్కు చోటు దక్కింది.ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కేంద్రాన్ని కోరారు. దీంతో కేసీఆర్ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్రం అందుకు అంగీకారం తెలిపింది. కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సుముఖత వ్యక్తం చేసింది. దీంతో స్మార్ట్ సిటీల జాబితా నుంచి హైదరాబాదును తొలగించి ఆ స్థానంలో కరీంనగర్ ను చేర్చింది.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 స్మార్ట్ సిటీల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఉన్నాయి. అయితే రూ.100 కోట్ల నిధులు హైదరాబాద్కు సరిపోవని, స్మార్ట్ సిటీ బదులు హైదరాబాద్కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.